Praja Deveena
Newspaper Banner
Date of Publish : 05 December 2025, 10:06 am Posted by : praja deveena

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, ఓ యూ అభివృద్ధికి ఎంతమొత్త‌మైనా ఖ‌ర్చు చేసేందుకు వెనుకాడ‌బోo 

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: ఉస్మాని యా యూనివ‌ర్సిటీ (OU) లో చేప‌ ట్ట‌నున్న అభివృద్ధి ప‌నుల్లో వి ద్యా ర్థులు, బోధ‌న సిబ్బంది అభి ప్రా యాల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని ము ఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూ చిం చారు. ఓయూ అభివృద్ధి ప‌నుల‌కు సంబంధించి ఎంతమొత్త‌మైనా ఖ‌ ర్చు చేసేందుకు వెను కాడ‌మ‌ని తెలి పారు. ఉస్మానియా యూని వర్సిటీ అభివృద్ధి ప‌ను ల‌పై ముఖ్య మంత్రి ఉన్నతస్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు. యూనివ‌ ర్సిటీలో చేప‌ట్టాల్సిన అభివృద్ధి ప‌నుల‌పై తొలుత అధికారులు వివ‌ రించారు. అనంత‌రం ప‌ నుల‌కు సంబంధించిన వివిధ మోడ‌ళ్ల ప‌వ‌ ర్ పాయింట్ ప్ర‌జం టేష‌న్స్‌ ను ముఖ్యమంత్రి వీక్షించారు.

హాస్ట‌ల్ భ‌వ‌నాలు, ర‌హ‌దారులు, అ క‌డ‌మిక్ బ్లాక్స్‌, ఆడిటోరియం నిర్మాణాల‌కు సంబంధించి ప‌లు మార్పు లు చేర్పుల‌ను సూచించా రు. యూ నివ‌ర్సిటీ ప‌రిధిలోని అట‌వీ ప్రాంతం లో ప‌నుల‌కు అర్బ‌న్ ఫారెస్ట్రీ నిధు లు వినియోగించే అంశాన్ని ప‌రిశీలించాల‌ని చెప్పా రు.యూనివ‌ర్సిటీ ప‌రిధిలో ఇప్ప‌టికే ఉన్న జ‌ల వ‌న‌రుల‌ను సంర‌క్షి స్తూనే నూత‌న జ‌ల వ‌న‌రుల ఏర్పాటుకు ఉన్న అవ‌కాశాల‌ను ప‌రి శీలించాల‌ని సూచించారు. హాస్ట‌ల్‌, అక‌డ‌మిక్ భ‌వ‌నాల నిర్మాణం విష‌యంలో వం ద మంది విద్యార్థులుంటే అద‌నంగా మ‌రో ప‌ది శా తం విద్యార్థుల‌కు వ‌స‌ తులు ఉండేలా చూడాల‌ని తెలిపారు. వి ద్యార్థులు, సిబ్బంది భ‌విష్య‌ త్తులోనూ ఎటువంటి అసౌక‌ర్యానికి గురికాకుండా నిర్మాణాలు ఉండాల‌ని సీఎం అన్నారు.

యూనివ‌ర్సిటీ ప‌రిధిలోని చారిత్ర‌క, వార‌స‌త్వ భ‌వ‌నాల‌ను సంర‌ క్షించాల‌ని చెప్పారు. చారిత్ర‌క ప్రాధాన్యం లేని పురాత‌న‌ భ‌వ‌నాల‌కు భారీ మొత్తాలు వెచ్చించి మ‌ర‌మ్మ‌తులు చేసే బ‌దులు నూత‌న భ‌వ‌ నాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాల‌న్నారు. సైకిల్ ట్రాక్‌లు, వాకింగ్ పాత్‌ల తో పాటు ప్ర‌తి ప‌నిపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పె ట్టాల‌ని తెలిపారు. ఉ స్మానియా విద్యార్థుల పోరాట ప్ర‌తిమ‌ను ప్ర‌తి బింబించే చిహ్నాలు ఏర్పాటు చేయాల‌ని సూచించారు.

ఈ నెల 10 ఓయూను సంద‌ర్శించనున్న‌ట్లు ముఖ్యమంత్రి చెప్పా రు. ప్రధానంగా అక‌డ‌మిక్ బ్లాక్‌లు, హాస్ట‌ళ్ల‌ను ప‌రిశీలిస్తాన‌ని చె ప్పా రు. యూనివ‌ర్సిటీ అభివృద్ది ప‌నుల‌ విషయంలో విద్యార్థులు, బో ధ‌నా సిబ్బంది అభిప్రాయాలు స్వీక‌రించాల‌ని పేర్కొన్నారు.తొలుత అభివృద్ధి న‌మూనాలు వారి ముందు ఉంచాల‌ని త‌ర్వాత వారి అ భిప్రాయాలు తెలిపేందుకు డ్రాప్ బాక్స్‌లు ఏర్పాటు చేయ‌డంతో పా టు ప్ర‌త్యేక వెబ్‌ సైట్‌ను ఏర్పాటు చేయాల‌ని సూచించారు. వారి అభిప్రాయాల‌కు ప్రా ధాన్య‌మిస్తూ ఈ నెలాఖ‌రు నాటికి అభివృద్ధి ప్ర‌ణాళిక‌ల‌పై తుది నిర్ణ‌ యం ఖ‌రారు కావాల‌ని తెలిపారు.

ఈ స‌మీక్ష‌ సమావేశంలో సీఎం స‌ల‌ హాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కేశ‌వ‌రావు, ఓయూ వైస్ చా న్సెలర్ ప్రొఫెసర్ మొలుగురం కుమార్, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సి పల్ ప్రొఫెసర్ కాశీంతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సాయుధదళాల పతాక దినో త్సవనిధికి సీఎం విరాళం…

సాయుధ దళాల పతాక దినోత్సవ నిధి (Armed Forces Flag Day Fund – AFFDF) కి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి 1 లక్ష రూపాయల విరాళం అందించారు. సాయుధ దళాల పతాక దినో త్సవం (డిసెం బర్ 7) పురస్కరించుకుని తెలం గాణ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టరేట్ ప్రతి నిధులు ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలి శారు.ఈ సంద ర్భం గా బోల్డ్ అండ్ బ్రేవ్ పుస్తకాన్ని ము ఖ్యమం త్రి ఆవిష్కరించారు. ఈ కా ర్యక్రమంలో సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ కల్నల్ రమేష్ కుమార్, కెప్టెన్ శ్రీనేష్ కుమార్, కెప్టెన్ నరోత్తమ్ రెడ్డి, కెప్టెన్ శ్రీనివాసులుతో పాటు ఇతర అధికారులు ఉన్నారు.