Praja Deveena
Newspaper Banner
Date of Publish : 12 December 2025, 9:28 am Posted by : praja deveena

HIV Outbreak in Bihar : బిగ్ బ్రేకింగ్, బీహార్‌లో హెచ్‌ఐవీ బ యోత్పాతం, అక్కడి ఒకే జిల్లాలో 7400 మందికి పాజిటివ్ కేసులు 

HIV Outbreak in Bihar : ప్రజా దీవెన, బీహార్: దేశంలో అం దుకు సంబంధించి ఆ నాటి నుంచి ఎలాంటి ఆనవాళ్లు లేకుండా చడీ చప్పుడు లేకుండా ఉన్న మహ మ్మారి మళ్లీ ఒక్కసారిగా ఉల్లిక్కి పా టుకు గురి చేసింది. దేశ వ్యాప్తంగా కేంద్రం, రాష్ట్రాల్లో పాలిస్తున్న పాల కులు నెత్తినోరు కొట్టుకొని మరీ చె ప్పినా పెడచెవిన పెడుతున్న వారు మరొక్కమారు మనషుల్లో మంట లు లేపారు. ప్రభుత్వాలు ఎంతగా ప్రచారం చేస్తున్నా హెచ్‌ఐవీ, ఎయి డ్స్‌పై ప్రజల్లో సరైన అవగాహన కొ రవడుతూనే ఉదన్న వాదనకు తాజా ఘటన బలం చేకూరుస్తోంది.

దీని ఫలితంగా ప్రమాదకరమైన ఈ వైరస్ వ్యాప్తి కొన్ని ప్రాంతాల్లో ఆం దోళనకర స్థాయిలో కొనసాగుతోం ది. తాజాగా బీహార్‌లోని సీతామఢీ జిల్లాలో హెచ్‌ఐవీ మహమ్మారి వి జృంభిస్తోన్న వైనం విస్తుగొలుపు తోంది. జిల్లావ్యాప్తంగా ఏకంగా 7,4 00 మంది ఈ వైరస్ బారిన పడి న ట్లు అధికారిక నివేదిక వెల్లడించడం తీవ్ర భయాందోళన పరిస్థితులు నె లకొల్పాయి.

ఇదే సమయంలో మరింత ఆందోళ న కలిగించే విషయం ఏమిటంటే బీహార్ బాధితుల్లో 400 మంది చి న్నారులు కూడా ఉండటం గమనా ర్హం. జిల్లా ఆసుప‌త్రిలోని ఏఆర్‌టీ సెంటర్‌లో నిర్వహించిన వైద్య పరీ క్షల్లో ఊహించని వాస్తవాలు వెలు గు చూశాయి. వైరస్ బారిన పడిన చిన్నారులకు వారి తల్లిదండ్రుల నుంచే ఈ వ్యాధి సంక్రమించినట్లు వైద్యులు కుండబద్దలు కొట్టినట్లు నిర్ధారించారు.

తల్లిదండ్రుల్లో ఎవరికి హెచ్‌ఐవీ ఉ న్నా, పుట్టబోయే పిల్లలకు ఈ వ్యా ధి వచ్చే ప్రమాదం ఉందని వారు వి వరిస్తున్నారు. ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి విషాదక ర ఘటనలు చోటుచేసుకుంటున్నా యని వైద్య నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ పరిస్థితిపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ హసీన్ అక్తర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి నెలా సగటున 50 నుంచి 60 కొత్త హెచ్‌ఐవీ పాజిటివ్ కేసులు నమోద వుతున్నాయని చెప్పారు.

ప్రస్తుతం గుర్తించిన బాధి తుల్లో 5 వేల మందికి పైగా వైద్య చికిత్స అం దిస్తున్నామని తెలిపారు. ఈ గణాం కాలు బీహార్ రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా వ్యాధి తీవ్రతకు అ ద్దం పడుతునే బయోత్పాత వాతా వరణాన్ని సృష్టిస్తున్నాయి. ఏది ఏ మైనా బీహార్ లోని తాజా పరిస్థితిపై దేశవ్యాప్తంగా మరో మారు హెచ్ఐ వి చర్చ తెర మీదకు వచ్చింది.