Praja Deveena
Newspaper Banner
Date of Publish : 12 December 2025, 2:04 am Posted by : praja deveena

Big Breking APBusAccident: బిగ్ బ్రేకింగ్, ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లాలో ఘోరదుర్ఘటన, బస్సు లోయలోపడి 15మంది దుర్మరణం

బిగ్ బ్రేకింగ్, ఆంధ్రప్రదేశ్ అల్లూరి జి ల్లాలో ఘోరదుర్ఘటన, బస్సు లో యలోపడి 15మంది దుర్మరణం

Big Breking APBusAccident:  ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్ర‌ప్ర‌ దేశ్‌లోని అల్లూరి సీతారామ‌రా జు జిల్లాలో ఘోరదుర్ఘటన సంభవించింది. శుక్ర‌వారం తెల్ల‌వారు జా మున జరిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదంలో మృత్యుఘోష చోటు చేసు కుంది. ఓప్ర‌యివేటు బ‌స్సు అదుపుత‌ప్పి లోయ‌లో ప‌డిపోయిన దుర్ఘటనలో 15 మంది ప‌ర్యా ట‌కులు మృత్యువాత పడగా ప‌లువురు తీవ్ర గాయాలపాలయ్యా రు.

అందిన సమాచారం మేరకు ఓ ప్ర‌యివేటు బ‌స్సు అదుపుత‌ప్పి లో య‌లో ప‌డిపోగా, 15 మంది ప‌ర్యా ట‌కులు మృతి చెందగా ప‌లు వురు తీవ్రంగా గాయ‌ప‌డ్దారు. సమాచారం అందుకున్న పోలీసులు వెనువెం టనే స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

చిత్తూరు జిల్లాకు చెందిన కొంత మంది ప‌ర్యాట‌కులు ఓ ప్ర‌యివేటు బ‌స్సులో టూర్‌కు వెళ్లారు. భ‌ద్రాచ‌లం ఆల‌య ద‌ర్శ‌నం అనంత‌రం అ న్న‌వ‌రం ప్రయాణం ప్రారంభించగా అల్లూరి జిల్లాలోని చింతూరు మా రేడుమిల్లి ఘాట్ రోడ్డు రాజుగారి మెట్ట వ‌ద్ద‌కు రాగానే ప‌ర్యా ట‌కుల బ‌స్సు ఆకస్మాత్తుగా అదుపుత‌ప్పింది. చూస్తుండగానే లోయ‌ లో ప‌డిపోయి జరగారని ఘోరం జరిగిపోయింది.

స‌మాచారం అందుకున్న చింతూరు పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరు కొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌లో 15 మంది వ‌ ర‌కు యాత్రికులు చ‌నిపోయిన‌ట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. క్ష‌త‌గాత్రుల‌ను స‌మీప ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించిన‌ట్లు తెలిపారు. దీంతో మృతుల కుటుంబ సభ్యులు శోక‌ సంద్రంలో మునిగిపోయారు. మరి న్ని పూర్తివివరాలు అందాల్సిఉంది.