Praja Deveena
Newspaper Banner
Date of Publish : 14 December 2025, 1:18 pm Posted by : praja deveena

MLA Rajagopal Reddy : బిగ్ బ్రేకింగ్, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్య, పదేళ్లలో బిఆర్ఎస్ వేల కోట్లు దోచు కుంది 

MLA Rajagopal Reddy : ప్రజా దీవెన చౌటుప్పల్: తెలంగా ణ రాష్ట్రంలో గత పదేళ్ల బి ఆర్ఎస్ ప రిపాలనలో వేలాది కోట్ల రూ పాయ లు దోచుకున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగో పాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.యాదాద్రి భువనగిరి జిల్లా లోని మునుగోడు నియోజకవర్గంలో మూడో విడత ఎన్నికల ప్రచా రంలో భాగంగా చౌటుప్పల్ మండలంలోని పలుగ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.

మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కంటి సమస్యతో ఎవ్వరూ బా ధ పడవద్దని మా అమ్మ పేరు మీద ప లు ఉచిత కంటి వైద్య శిబి రాలు నిర్వహించి కంటి ఆపరేషన్లు చేయించామని గుర్తు చేశారు.

రాబోయే రోజుల్లో మునుగోడు నియోజకవర్గoలో ఎల్వి ప్రసాద్ కం టి ఆసుపత్రి మద్దతుతో నూతన కంటి ఆసుపత్రిని కట్టిస్తామని తెలి పారు.ఈ వారం రోజులు డబ్బు, మద్యం ఇచ్చే అభ్యర్థుల కన్నా ఐ దు సంవత్సరాలు నిజాయితీగా పని చేసే అభ్యర్థులకు ఓటు వేసి గె లిపించండని కోరారు. 10 సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం అధి కారంలో ఉండి వేల కోట్లు దోచుకున్నారని, బిఆర్ఎస్ స్థానిక నాయ కులు ఉన్న చోట వారి డబ్బులు తీసుకొని కాంగ్రెస్ అభ్యర్థులకు ఓ టు వేయాలన్నారు.

చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామ బిఆర్ఎస్ అభ్యర్థి భూకబ్జా దారుడని భూకబ్జాలకు పా ల్పడే వాళ్ళకి బుద్ధి చెప్పాలన్నా రు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మం వైపు ఉన్నాడని ఇంకా కాంగ్రెస్ ప్ర భుత్వం మూడు సంవత్సరాలు ఉంటున్నందున కాంగ్రెస్ అభ్యర్థి మ స్తాన్ బాబుకి ఓటు వేయాల్సిందిగా కోరారు.

నిజాయితీగా ప్రజా సేవ చేయాలని లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చా నని అక్రమ సొమ్ము, అధర్మం వైపు కోమ టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వుండడని, అతని అనుచరులు కూడా అక్ర మం వైపు నిలబడర న్నారు. ప్రచారం చేయడానికి తమ గ్రామాలకు వచ్చిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి ఘన స్వాగతం పలికి ఆహ్వా నించారు ఆయా గ్రామాల ప్రజలు.