CM Revanth Reddy : ప్రజా దీవెన న్యూ ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రె డ్డి దేశ రాజధాని న్యూ ఢిల్లీ లో సు డిగాలి పర్యటన కొనసాగిస్తున్నా రు. ఓ వైపు కేంద్ర మంత్రులతో రా ష్ట్రాభివృద్ధి కోసం, పార్టీ పటిష్టత వి షయంలో అగ్రనేత సోని యా గాం ధీ, రాహుల్ గాంధీలతో పాటు ఇత ర నేతలతో విస్తృత స్థాయిలో భేటీ లతో విస్తృత చర్చలు జరుపుతు న్నారు. రాష్ట్రంలో ప్రధానమైన వి ద్యా విద్యా వ్యవస్థలకు సంబంధిం చి ఆయా శాఖల మంత్రులు ప్రదా నంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ లా సీతారామ న్, విద్యా శాఖ మం త్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితరులను కలిశారు.
విద్యారంగ అభివృద్ధికి సహక రించాలి… విద్యా రంగం అభివృ ద్ధికి తెలoగాణ ప్రభుత్వం తీసు కుం టున్న చర్యలకు మద్దతుగా నిలవా లని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ కి ముఖ్య మం త్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అత్య ధిక సంఖ్యలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య ను అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చ ర్యలను కేంద్ర మంత్రికి వివరించారు.
ముఖ్యమంత్రి న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో పా ర్లమెంట్‌లోని వారి ఛాంబర్‌లో స మావేశమయ్యారు.తెలంగాణ వ్యాప్తంగా 105 శాసనసభ నియోజకవ ర్గాల్లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల (YIIRS) ప్రాధాన్యత ను ఈ సంద ర్భంగా ముఖ్యమంత్రి వివరించారు.
5 నుంచి 12 తరగతుల వరకు ఉం డే ఒక్కో ఇంటిగ్రేటెడ్ రెసిడె న్షియల్ ( YIIRS)లో 2,560 మంది విద్యార్థులు ఉంటారని, మొ త్తంగా 105 పాఠశాలతో 2.70 లక్షల మంది వి ద్యార్థులకు ప్రత్యక్షం గా నాణ్యమైన విద్యాబోధన లభిస్తుందని వివరిం చారు. YIIRSలు సమీప ప్రభుత్వ పాఠశాలలకు విద్యా హబ్‌లుగా ఉండడంతో పరో క్షంగా లక్షలాది మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని తెలియజేశారు.
అత్యాధునిక వసతులు, లేబొరేటరీ లు, స్టేడియాలతో నిర్మించే ఈ 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసి డెన్షియల్ స్కూళ్ల నిర్మాణా నికి రూ. 21 వేల కోట్ల వ్యయమవుతుందని తెలిపారు. అలాగే, రా ష్ట్రంలోని జూ నియర్, డిగ్రీ, సాంకేతిక కళాశాల లు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో ఆధునిక ల్యాబ్‌లు, ఇతర మౌలిక వసతుల కల్పన కు మరో రూ.9 వేల కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారు.
మొత్తంగా రాష్ట్రంలో విద్యా రంగం సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం రూ.30 వేల కోట్లు వెచ్చించినున్న ట్లు ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి తె లిపారు. ఈ నిధుల సమీకరణకు ప్రత్యేక ప్రయోజన సంస్థ (SP C) ఏ ర్పాటు చేయనున్నామని, తద్వారా సేకరించే రుణాలకు ఎఫ్ఆర్‌బీఎం పరిమితి నుంచి మినహాయించాలని ముఖ్యమంత్రి కోరారు. విద్యా రంగంపై ప్రభుత్వం చేస్తున్న వ్య యాన్ని మానవ వనరుల అభివృ ద్ధి కి చేస్తున్న పెట్టుబడిగా భావించాల ని కోరారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడె న్షియల్ స్కూళ్ల ఏర్పాటు, తె లంగాణలో విద్యా రంగం అభివృద్ధిపై ము ఖ్యమంత్రి చూపుతున్న చొరవను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మ లా సీతారామన్ ప్రశం సించారు. YI IRS మోడల్ బాగుందన్న కేంద్ర మంత్రి SPC కి సం బంధించిన వివరాలను అందజేయాలని సూచించారు.
హైదరాబాద్ కు ఐఐఎం మంజూరు చేయాలని వినతి... హైదరా బాద్ కు ఐఐఎం మంజూరు చేయాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎక రాల భూమిని ఇప్పటికే గుర్తించి న ట్లు కేంద్ర మంత్రికి సీఎం వివరించా రు. వెంటనే తరగ తులు ప్రారంభిం చ mడానికి ట్రాన్సిట్ క్యాంపస్ సిద్ధంగా ఉందని వెల్లడిoచారు.
ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన అనుమతులు మంజూరు చేస్తే అ వసరమైన వసతులు కల్పిస్తామ న్నారు. తెలంగాణలో పెరిగిన జి ల్లా ల సంఖ్యకు అనుగుణంగా 9 కేంద్రీ య విద్యాలయాలను, 16 జవహర్ నవోదయ విద్యాలయాలను మం జూరు చేయాలని కేంద్ర మంత్రి ధ ర్మేంద్ర ప్రధాన్‌ను కోరారు. కేంద్రీయ విద్యాలయాలు, జవ హర్ నవోద య విద్యాలయాల ఏర్పాటుకు అ వసరమైన స్థలం, ఇతర వసతులు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ అందజేత..
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి న్యూ ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు, రాజ్యసభ సభ్యు రాలు శ్రీమతి సోనియా గాం ధీని మ ర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధే లక్ష్యం గా రూపొం దించిన తెలంగాణ రైజింగ్ 2047 వి జన్ డాక్యు మెం ట్ ను అందజేశారు.తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 8,9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మ కంగా నిర్వహించిన తెలంగాణ రై జింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 విశేషా లను సోనియా గాంధీకి తెలి యజేశా రు.
ప్రజా పాలనలో గత రెండేండ్లుగా అ మలవుతున్న సంక్షేమ పథకా లు, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం తీసు కుంటున్న చర్యలు, భవిష్య త్ ప్రణా ళికలను వివరించారు.ఈ సంద ర్భంగా తెలంగాణలో ప్రజా ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధి విషయం లో ముఖ్యమంత్రి దూ రదృష్టిని సోనియా గాంధీ అభినందించారు.తెలంగాణ రైజింగ్ 204 7 విజన్ డా క్యుమెంట్ కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథం లో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ, సోనియాగాంధీ ముఖ్య మంత్రికి శు భా కాంక్షలు తెలిపారు. ఈసమావేశంలో ముఖ్యమం త్రితో పాటు ఎంపీ లు మందాడి అనిల్ కుమార్, డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.

