Praja Deveena
Newspaper Banner
Date of Publish : 29 December 2025, 1:40 pm Posted by : praja deveena

District Collector Ila Tripathi : జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కీలక వ్యా ఖ్య, జిల్లాలోని వివిధ బ్యాంకులలో నిర్వహించని బ్యాంక్ అకౌంట్లలో రూ.66 కోట్లు 

District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: ప్రభుత్వ ప థకాల లబ్ధిని పొందడంలో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా జిల్లా అధికారులు అవగాహన కల్పించా లని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అ న్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మం దిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యా దులను స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమ్మిళిత సమావేశంలో మాట్లాడు తూ జిల్లాలోని వివిధ బ్యాంకులలో ప్రజలు, ప్రభుత్వ శాఖలు నిర్వహిం చని బ్యాంక్ అకౌంట్లలో సుమారు 66 కోట్ల రూపాయలు ఉన్నాయని, అందులో ప్రభుత్వ శాఖలకు సం బంధించి 20 కోట్ల రూపాయలు ఉం డగా, తక్కినవి ప్రజలకు సంబంధిం చిన వినియోగించని, మరిచిపోయి న ఖాతాలు ఉన్నాయని, వాటిని సాధ్యమైనంత త్వరగా వినియో గించుకునేలా అవగాహన కల్పించా లని చెప్పారు.

యూరియా పంపిణీకీ సంబంధించి ఎక్కడ వివాదాలు రాకుండా మండ ల ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయి లో పర్యవేక్షించాలన్నారు. యూరి యా విషయంలో అప్రమత్తంగా ఉం డాలని తెలిపారు. పత్తి కొనుగోలుకై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాప్ ద్వారా సమస్యలు రాకుండా సం బంధిత శాఖల అధికారులు ప రిష్కరించాలని, ఎక్కడైనా సమస్య వస్తే అవసరమైన చోట రెవెన్యూ అ ధికారులు చొరవ తీసుకొని పరి స్క రించాలని ఆదేశించారు. త్వర ల లోనే జిల్లాకు రవాణా కమిషనర్ రా నున్నారని, ఈ సందర్భంగా జిల్లా లో చిట్యాల అండర్ పాస్, రహ దా రులపై ప్రమాదాలు జరగకుండా తీ సుకోవాల్సిన చర్యలు, తదితరు అంశాలపై సమీక్షించడం జరుగు తుందని తెలిపారు.

గిరిజన ప్రాంతాలైన దేవరకొండ, పె ద్దవూర ప్రాంతాలలో అన్ని ప్రాథమి క వైద్యారోగ్య కేంద్రాలలో ఈసీఐఎ ల్ సహకారంతో ఏర్పాటు చేయను న్న అల్ట్రా సౌండ్ మిషన్లు, ఇటీవల దివ్యాంగులకు పంపిణీ చేసిన ట్రై సైకిల్స్ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారుల ను కలెక్టర్ ఆదేశించారు. కాగా ఈ సోమవారం మొత్తం( 97) ఫిర్యాదు లు రాగా, జిల్లా అధికారులకు (46) రెవెన్యూ శాఖకు సంబంధించి (51) ఫిర్యాదు లలు వచ్చాయి. స్థానిక సంస్థల ఇంచార్జి అదనపు కలెక్ట ర్ ,ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, గృహ ని ర్మాణం పీడీ రాజ్ కుమార్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, దేవర కొండ ఆర్ డిఓ ర మణారెడ్డి, జిల్లా అధికారులు ప్రజ ల వద్ద నుండి ఫిర్యాదులను స్వీక రించారు.