Praja Deveena
Newspaper Banner
Date of Publish : 08 January 2026, 12:52 pm Posted by : praja deveena

District SP Sharath Chandra : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా పోలీస్ అలెర్ట్, సంక్రాంతి సెలవుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

–ఇళ్లకు తాళం వేసి పండుగకు వెళ్లే వారు భద్రతాచర్యలు తీసుకోవాలి

— నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

District SP Sharath Chandra : ప్రజా దీవెన, నల్లగొండ: రాబోయే సంక్రాంతి పండుగ సెలవుల సంద ర్భంగా జిల్లా ప్రజలు తమ స్వగ్రా మాలకు, ఇతర పట్టణాలతో పాటు దూర ప్రాంతాలకు ప్రయాణం చే యనున్న నేపథ్యంలో ఇళ్లకు తాళం వేసి వెళ్లే సందర్భాల్లో దొంగతనాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసు కోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రజలకు అప్పీల్ చేశారు.

సంక్రాంతి పండుగలను దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా 24 గంటల పాటు నిరంతర పోలీస్ పె ట్రోలింగ్ నిర్వహిస్తున్నామని తెలి పారు. రద్దీ ప్రాంతాలు, నిర్మానుష్య ప్రాంతాలు, ముఖ్యమైన ప్రభుత్వ మరియు ప్రైవేట్ భవనాలు, ఆర్థిక సంస్థలు, అపార్ట్మెంట్లు, కాలనీల వ ద్ద పోలీస్ సిబ్బంది సందర్శిస్తూ ప్ర త్యేక నిఘా ఏర్పాటు చేశామని వెల్ల డించారు.

పండుగల సమయంలో ఎలాంటి అ వాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు చర్యలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.దొంగతనాల నివారణకు పోలీస్ శాఖ సూచనల మేరకు ఇంటికి తాళం వేసి వెళ్లే ముందు తలుపులు, కిటికీలు సరి గా మూసివేశామా లేదా అని నిర్ధా రించుకోవాలన్నారు.

బంగారు, వెండి ఆభరణాలు, నగ దు, ముఖ్యమైన పత్రాలను ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్‌లో లేదా విశ్వసనీయ వ్యక్తుల వద్ద భద్రప రచుకోవాలని, ఇల్లు ఖాళీగా ఉం దని అనుమానం రాకుండా టైమర్ లైట్లు ఏర్పాటు చేయాలి లేదా రా త్రివేళ కనీసం ఒక గదిలో లైట్ వెలి గేలా చూడాలని సూచించారు.

ఇంటి ముందు పత్రికలు, పాలు, పా ర్సెల్స్ పేరుకుపోకుండా ముందుగా నే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

సీసీటీవీ కెమెరాలు, అలారం సిస్ట మ్స్ ఏర్పాటు చేయడం ద్వారా భ ద్రత మరింత మెరుగుపడుతుంది.

సోషల్ మీడియాలో “ఊరికి వెళ్లాం, ఇంట్లో లేను” వంటి వివరాలను బ హిరంగంగా పోస్ట్ చేయడం నివా రించాలి.పొరుగువారితో సమ న్వ యం కలిగి పరస్పరంగా ఇళ్లపై ని ఘా ఉంచుకునేలా సహకరించు కోవాలని చెప్పారు.

తాళాలను తలుపుల దగ్గర, పూల కుండీలలో లేదా మ్యాట్స్ కింద దా చిపెట్టకూడదని, పనిమనుషులు, డ్రైవర్లు, అపరిచితుల వివరాలను సరిగా పరిశీలించి మాత్రమే ఇంట్లోకి అనుమతించాలని, ఇంటి చుట్టూ ఉ న్న పొదలు, చెట్లు కత్తిరించి స్ప ష్టమైన విజిబిలిటీ ఉండేలా చూడా లని తెలిపారు.

మెయిన్ గేట్ లేదా ఇంటి ముందు సెన్సార్ లైట్లు ఏర్పాటు చేయడం ద్వారా అనవసర ప్రవేశాలను అడ్డు కోవచ్చని, ఇంటి ముందు లేదా ఇం ట్లోకి వెళ్లే దారుల్లో వాహనాలను ఎ క్కువ రోజులు నిలిపి ఉంచకుండా జాగ్రత్త పడాలని, బంగారం కొను గోలు, పండుగ షాపింగ్ వివరాలను బహిరంగంగా ప్రచారం చేయకుండా ఉండాలన్నారు.

ఇంట్లో పనిచేసే వారి వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన్‌లో వెరి ఫి కేషన్ చేయించుకోవాలి. ప్రయా ణా నికి ముందు ఇంటి ఫోటోలు, వి లు వైన వస్తువుల వివరాలను భద్రంగా నమోదు చేసుకుని ఉంచుకోవడం మంచిదన్నారు. అపార్ట్మెంట్లు, కాల నీల్లో వాచ్‌మన్‌లను అప్రమత్తం చే సి గేట్లు సరిగా మూసేలా చూడా లని, అద్దె ఇళ్ల యజమానులు ఖా ళీగా ఉన్న ఇళ్లపై ప్రత్యేక దృష్టి సా రించాలి.ఇంటి బయట గేటుకు ఎ క్కువ రోజుల పాటు తాళం వేస్తే ఇం ట్లో ఎవరూ లేరనే అనుమానం దొం గలకు కలగవచ్చునని గుర్తుంచుకో వాలన్నారు.

జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ ప్రత్యేక బందోబస్తు చ ర్యలు, నైట్ పెట్రోలింగ్ కొనసాగిస్తు న్నట్లు తెలిపారు. ప్రజలు పోలీస్ శా ఖకు పూర్తిస్థాయిలో సహకరించాల ని, ఏదైనా అనుమానాస్పద సమా చారం గమనించిన వెంటనే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.

ప్రతి ఒక్కరూ పై సూచనలు పాటి స్తూ, పోలీస్ యంత్రాంగానికి సహ కరిస్తూ, నల్లగొండ జిల్లాను నేర రహి త జిల్లాగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.