Praja Deveena
Newspaper Banner
Date of Publish : 22 January 2026, 5:00 am Posted by : praja deveena

Citizen Victim Centric Policing : నల్లగొండ జిల్లా పోలీసుల వినూ త్న ప్రయత్నం, బాధితుడి వద్దకు నేరుగావెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు 

Citizen Victim Centric Policing : ప్రజా దీవెన, నల్ల గొం డ: నల్లగొండ జిల్లా పోలీసులు వినూత్న ప్రయత్నంలో విజ యవంతం సాధించారు. తెలంగాణ పోలీస్ శాఖ పౌర కేంద్రి త, బాధిత కేంద్రిత పోలీసింగ్ విధానంలో (Citizen, Victim Centric Policing) నిదర్శనగా నిలిచారు.

సమాజంలో వివాదాలల్లో బాధితులు వివిధ కారణాల వల్ల పోలీస్ స్టే షన్‌కు వచ్చి స్వయంగా ఫిర్యాదు ఇవ్వలేని ప్రత్యే క పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ పోలీస్ శా ఖ పౌర కేంద్రిత, బాధిత కేంద్రిత పోలీసింగ్ విధానంలో భా గంగా ప్రజల వద్దకే వెళ్లి న్యాయం అందించే వినూత్న కార్య క్రమాలను అమలు చేస్తున్న భాగంగా నల్లగొండ పోలీసులు తొలి అడుగులో విజయం సాధించారు.

ఈ నేపథ్యంలో నల్లగొండ జిల్లాలో పోలీసులు వినూత్న ప్ర యత్నoలో విజయం సాధించిన విషయం అందరి దృష్టి ఆ కర్షిస్తుంది. సదరు వినూత్న ప్రయత్నo వివరాలు ఇలా ఉ న్నాయి. నల్లగొండ జిల్లా కనగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మద న పురం గ్రామానికి చెందిన బొల్లిగొర్ల గురువయ్య అ నే వ్యక్తి ఇటీవల ఒ క వ్యక్తి దాడిలో గాయపడి నల్లగొండలో ని సురక్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం పోలీ సు అధికారుల దృష్టికి వచ్చింది.

సదరు విషయంపై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ( nalg onda SP Sharath Chandra Pawar) స్పందించి, వెంట నే కనగల్ ఎస్‌ఐతో మాట్లాడిన వెంటనే ఆయన ఆదేశాల మేరకు కన గల్ పోలీసు అధికారులు తక్షణమే స్పందించి బాధితుడి వద్దకు చేరు కున్నారు. గాయాల కారణంగా బాధి తుడు పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయలేని పరిస్థితి ఉండ టంతో పోలీసు అధికారులు ఆసు పత్రికి వెళ్లి బాధి తుడిని కలుసుకొని అతనికి జరిగిన అన్యాయాన్ని వివరం గా అడిగి తెలుసుకున్నారు.

బాధితుడి వాంగ్మూలాన్ని అక్కడి కక్కడే నమోదు చేసి అ క్కడికక్కడే ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. అ నంతరం నమో దైన కేసుపై దర్యా ప్తు ప్రారంభించి నిందితుడిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకు నేం దుకు చర్యలు చేపట్టారు.ఈ సం దర్భంగా జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ ప్ర జలు అత్యవసర పరిస్థితుల్లో న్యాయం కోసం తప్పనిసరిగా పోలీస్ స్టేషన్‌ కు రావాల్సిన అవసరం లేదని, అ వసరమైతే పోలీసులే బాధితుల వద్దకు వెళ్లి ఫిర్యాదు స్వీకరిస్తారని తె లిపారు.

ముఖ్యంగా గాయపడిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందు తున్న వారు, వృద్ధులు, మహిళ లు, అసహాయ వర్గాలకు బాధిత కేంద్రిత పోలీసింగ్ ద్వారా తక్షణ న్యాయం అందిం చడమే తెలంగా ణ పోలీస్ శాఖ లక్ష్యమని స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ప్రజల భద్రత, రక్షణ, న్యాయం కోసం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, ఎవరైనా అన్యా యానికి గురైతే భ యపడకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. తెలంగాణ పోలీస్ శాఖ పౌ ర కేంద్రిత, బాధిత కేంద్రిత పోలీసింగ్ విధానంలో నల్లగొండ పోలీసులు తక్షణ సహాయం అందించేలా చర్యలు చేపడు తామని స్పష్టం చేశారు.