BRS Chief KCR : ప్రజా దీవెన, హైదరాబాద్: ఫోన్ ట్యాపిం గ్ వ్యవహారంలో సిట్ (SI T) అధికారులు వ్యవహరించిన తీరు చట్టాలకు వ్యతిరేకమని మా జీ ముఖ్యమంత్రి, గులా బీ బాస్ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం సి ట్ అధికారుల నోటీసులపై కేసీఆర్ చేసిన ముఖ్యాంశాలు వారి మాటల్లోనే…
సిట్ అధికారులు వ్యవహరించిన తీరు చట్టాలకి వ్యతిరేకం. సుప్రీంకో ర్టు తీర్పులను తుంగలో తొక్కిన సీట్ అధికారుల తీరు సిట్ అధికా రు లకి నోటీసు ఇచ్చే అధికారమే లేదు. నా రాజ్యాంగ హక్కులను కాల రాయడమే అన్న కెసిఆర్. ఈ సం దర్భంగా సిట్ అధికారుల తీరు ను ఎండగట్టారు. మొన్నటికీ మొన్న రెండు సార్లు సి ట్ అధికారులు ఇచ్చిన నోటీసులు చట్టవిరుద్ధం, చట్టాలకు అతిక్ర మిం చి ఇచ్చారు. మీరు ఇచ్చిన మొద టి నోటీసుకు మున్సిపల్ ఎన్నికల నేప థ్యంలో బిజీగా ఉండటం వల్ల వేరే రోజు విచారణకు తేదీ ఇవ్వా లని చెప్పాను.
దాంతో పాటు 65 ఏళ్ల పైబడిన వ్య క్తులను వారు నివసించే చోటనే విచారించాలని చెప్పే సెక్షన్ 160 CrPC నిబంధనల ను మీ దృష్టికి తెచ్చాను. దాంతో పాటు తదుపరి నోటీసు లన్నీ కూడా ఎర్రవల్లిలోని నా నివాసానికే పంపాలని చెప్పా ను.కానీ, ఇది చెప్పిన తర్వాత కూ డా గుర్తుతెలియని వ్యక్తు లు మీ సంతకంతో ఉన్న లేఖను రాత్రి 9 గంటలకు నంది నగర్ నివాసం లోని మా ఇంటి గోడకు అతికించినట్లు తెలు స్తోంది.
ఆ లేఖ మీరే పంపినట్లయితే, మీ సూచనల మేరకే అతికిం చినట్ల యితే, ఆ లేఖను తీవ్రంగా ఆక్షేపి స్తున్నాను. ఇది భా రత రాజ్యాం గం, చట్టం మరియు గౌరవ సు ప్రీంకోర్టుల పట్ల మీకు ఏమాత్రం గౌరవం లేదు అనే విషయాన్ని సూచిస్తుం ది.గతంలో సుప్రీంకోర్టు ‘సతేంద్ర కుమార్ యాంటిల్ వర్సెస్ సిబిఐ’ అనే కేసులో స్పష్టమైన ఆదే శాలు జారీ చేసింది.
వాట్సాప్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా నోటీసు లు పంప డం చట్టబద్ధమైన పద్ధతి కాదని, చట్టం నిర్దేశించిన రీతిలోనే నోటీసు లు ఇవ్వాలని పేర్కొంది. CRPC 160 నో టీసులను వ్యక్తిగతంగా అందజేయాలి. కానీ మీరు కావా ల నే చట్టాన్ని, సుప్రీంకోర్టు ఆదే శాల న ఉల్లంఘించారు. ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది.
భవిష్యత్తు నోటీసులన్నీ ఎర్రవల్లికే పంపాలని చెప్పినప్పటికీ మీరు దా న్ని విస్మరించారు. కాబట్టి మీరు ఇ చ్చిన రెండవ నోటీసు చట్టబద్ధంగా అందలేదు, అది చెల్లదు. మీరు ఇ చ్చి న నోటీసు నా రాజ్యాంగబద్ధ హక్కులను ఉల్లంఘించ డమే. నేను మీ పోలీస్ స్టేషన్ పరిధిలో గానీ, పొరుగు పోలీస్ స్టేష న్ పరిధి లో గానీ నివసించడం లేదు.
కాబట్టి మీకు నోటీసు ఇచ్చే అధి కార పరిధి లేదు. ఈ నోటీ సు నన్ను కట్టడి చేసే అధికారం లేదు. ఎలక్ష న్ అఫిడవిట్ లో, అసెంబ్లీ రికార్డు లో ఉన్న అడ్రస్ ఆధారంగా ఎర్ర వల్లిలో విచారించలేమని మీరు చె ప్పడం సరికాదు. నోటీసు ఇచ్చే సమయానికి వ్యక్తి ఎక్కడ నివసి స్తున్నారు అన్నదేముఖ్యం. నేను కొన్ని సంవత్సరాలుగా ఎర్రవల్లిలో నివసిస్తున్నాను అ న్నది నిర్వివాద అంశం.
అక్కడే నా స్టేట్మెంట్ రికార్డ్ చేయ వలసిన బాధ్యత మీపై ఉన్నది.హరీష్ రావు అఫిడవిట్ లో సిద్ది పేట అని చిరునా మా ఉన్నప్పటికీ హైదరాబాద్ లో నోటీసు ఇచ్చారు.ఇది మీ ద్వంద్వ ప్రమాణాలను సూచిస్తున్నది. మీరు నాకు ఇచ్చిన గోడకు నోటీసు అతికించడం చట్ట విరుద్ధం. మీరు నాకు నో టీసు ఇచ్చే అధికార పరిధి లేదు. చట్టం ప్రకారం నా స్టేట్మెంట్ ను ఎర్రవల్లిలోనే రికార్డ్ చేయాలి.
అయితే చట్టపరమైన అంశాలు ఎలా ఉన్నప్పటికీ, మాజీ ముఖ్య మంత్రిగా, ప్రస్తుత ప్రతిపక్ష నాయ కుడిగా, బాధ్యతా యుతమైన భారత పౌరుడిగా దర్యాప్తుకు సహకరించాలని నిర్ణయిం చు కు న్నాను.రేపు 3 గంటలకి నందినగర్ లో అం దుబాటులో ఉంటాను.మీరు నందినగర్ నివాసంలోనే స్టే ట్మెంట్ రికార్డ్ చేయాలని పట్టుబ ట్టినందున అక్కడే అందు బాటులో ఉంటానని స్పష్టం చేశారు కేసీఆర్.