Nalgonda ACB traps : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అ ధికారులు ఆకస్మిక దాడు లు కొనసాగుతున్నాయి. తాజాగా నల్లగొండ జిల్లా గుర్రంపో డు మండల తహ సీల్దార్ కార్యాలయంపై ఏసీబీ సో మవా రం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆఫీసుపై దాడి చేసిన ఏసీబీ అధికారులు గుర్రంపోడ్ మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మ హమ్మద్ అబ్దుల్ హకీమ్ ను గుర్రం పోడు తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో రెడ్ హ్యాండెడ్ గా ప ట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
ఫిర్యాదుదారు నుండి అధికారిక సహాయం చేయడoలో బా గంగా సర్వే నెం. 225/6, 1.15 ఎకరాల భూమి వివరాల ను ఆన్‌లై న్ 1-బి రిజిస్టర్ (ROR) నుండి తొలగించబడినం దు న వాటిని పున రుద్ధరించడానికి ఫిర్యాది దరఖాస్తు తోపాటు సంబంధిత ఫైల్‌ను తహ శీల్దార్‌కు ప్రాసెస్ చేసి పంపడానికి” రూ. 20,000 లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
లంచంగా తీసుకున్న రూ. 20,000 నగదును నిందిత అధి కారి వద్ద నుండి అతని సూచన మేరకు స్వాధీనం చేసు కు న్నారు. నిందిత అధి కారి అక్రమ ప్రయోజనం పొందడం కో సం తన ప్రభుత్వ విధిని సక్రమం గా కాకుండా, నిజాయితీ లేకుండా నిర్వర్తించారు. ఈ క్రమంలో నిందిత అధికారిని అ రెస్టు చేసి హైదరా బాద్‌లోని ఏసీబీ విచారణ కోర్టు మొదటి అదనపు ప్రత్యేక న్యాయ మూర్తి ముందు హాజరుపరచడం జరుగుతుందని తెలిపారు. కేసు దర్యాప్తులో ఉన్నందున భ ద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాది వివరాలు గోప్యంగా ఉంచ బడ్డాయని చెప్పా రు.
1064 నంబర్‌కు (టోల్ ఫ్రీ నం బర్) కాల్ చేయండి ..ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డి మాండ్ చేస్తే, చట్ట ప్రకా రం చర్య తీ సుకోవడానికి ప్రజలు ఏసీబీ టోల్ ఫ్రీ నం బర్ 1064కు సంప్రదించా లని ఏసీబీ అధికారులు కోరుతు న్నా రు. ఏసీబీ తెలంగాణను సోష ల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లైన వా ట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), X/గతంలో ట్విట్టర్ (@Telangana ACB) ద్వారా కూడా సంప్రదించవచ్చు.
ఏసీబీ తెలంగాణను సంప్రదించడానికి అన్ని ప్రభుత్వ కా ర్యాలయా లు మరియు ప్రముఖ బహిరంగ ప్రదేశాలలో ఏసీ బీ యొక్క క్యూఆర్ కోడ్ ప్రదర్శించబడిందన్నారు. బా ధితు డు, ఫిర్యాది పేరు మరియు వివరాలు గోప్యంగా ఉంచబడ తుందని వెల్లడించారు. ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతిని అరి కట్టాలంటే ప్రజల భాగస్వామ్యం అందించాల్సిన అవసరం ఉంటుందని ఏసీబీ అధికారులు అప్పీల్ చేస్తున్నారు.
