Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ:నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్ర చా రంలో భాగంగా పలు డివిజన్ల లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అ భ్యర్థుల తరుపున రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వ హించారు. హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ కార్పొరే టర్ అభ్యర్థులను గె లిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చే శారు. ప్రచారంలో అడుగడుగునా మంత్రికి నల్లగొండ పట్టణ ప్రజ లు నీరాజనం పలికారు. మంచి చెడు లో అండగా నిలిచే కోమటి రెడ్డి వెం కట్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటా మని ప్రతినబూనారు. మం త్రి ప్రచారంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూ తన ఉత్సాహాన్ని నింపారు.
తొలుత నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని చర్లపల్లి(15)వ డివిజన్ అభ్యర్థి పెరిక నాగరాజు,మర్రిగూడ 14 డివిజన్ అభ్యర్థి బొజ్జ శంకర య్యకు మద్దతుగా చర్లపల్లి బొడ్రా యి చౌరస్తా వద్ద ప్రచారం నిర్వ హించారు. అనంతరం 12వ డివి జన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అ భ్యర్థి మామిడి కార్తీక్, 27 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి సట్టు నాగమ ణి శంకర్, 28వ డివిజన్ అభ్యర్థి గుండబోయిన పుష్పలత వెంకన్న, 29వ డివిజన్ అభ్యర్థి గులాబ్ మ హమ్మద్ షఫిక్, 26వ డివిజన్ అ భ్యర్థి అసిమా సుల్తాన్( బషీర్ ),30 వ డివిజన్ కార్పొరే టర్ అభ్యర్థి మారగోని నవీన్ గౌడ్ తరపున వి స్తృత ప్రచా రం నిర్వహించారు.మున్సిపాలిటీ నుండి కార్పొరేషన్ గా మార్చితే జరిగే లబ్ది, కార్పొరేట ర్లు,కొత్త మేయర్ వస్తే జరిగే అభివృ ద్ధి,సంక్షేమం పై ప్రజలకు వివరించా రు.
ఈ సందర్భంగా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండ ప్రజలతో ఉ న్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావో ద్వే గ ప్రసంగం చేశారు.5సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిం చిన నా నల్లగొండ ప్రజల రుణం తీర్చుకోలేనిదనీ,నల్లగొండ ప్రజల తో నాది విడదీయని ఆత్మీయబం ధమన్నారు. నల్లగొండ నే నా ఇల్లు, నల్లగొండ నే నా ప్రాణం, నల్లగొండ నే నా కుటుం బం, నల్లగొండ నే నా జీవితమని,పేదప్రజల మధ్యలో ఉండ డం నాకిష్టమని మంత్రి పే ర్కొన్నారు.
పేద ప్రజలకు ఏ కష్టం వచ్చినా త ట్టుకోననీ,ప్రతి విద్యార్థిలో తన కొ డుకును చూసుకుంటా వారు ఉ న్నత చదువులు చదివి ప్రయోజ కులు ఐతే సంతోషిస్తానని చెప్పారు. అందు కే ప్రతీక్ పేరు మీద ప్రభు త్వ స్కూళ్లు,కాలేజీలు నిర్మిస్తున్న ట్లు చెప్పారు. బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాల అంతర్జాతీయ ప్రమాణా లతో నిర్మించానని,పట్టణంలోని 1 8 ప్రభుత్వ స్కూల్స్ ను నాణ్యమై న విద్యను అందించే మోడల్ స్కూ ల్స్ గా మారుస్తానని తెలిపా రు. తన చివరి శ్వాస వరకు పేద ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తా నని,నల్లగొండను, హైదరాబాద్ లాంటి నగరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇ చ్చారు.48 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలి పిం చి క్లీన్ స్వీప్ చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి అధిక నిధులు తెస్తానని పేర్కొన్నారు.
ప్రభుత్వం అందించే సంక్షేమ పథ కాలు ప్రతి గడపకు చేర వేస్తానని, అభివృద్ధిలో నల్లగొండను నెంబర్ వన్ గా నిలుపు తానని అన్నారు. సన్న బియ్యంతో పేదవాడి ఆకలి తీర్చడ మే నిజమైన ఇందిరమ్మ రా జ్యంమని,10ఏళ్లు అధికారంలో ఉ న్న వాళ్ళు కనీసం రేషన్ కార్డు కూ డా ఇవ్వలేదని మండి పడ్డారు. డ బుల్ బెడ్రూం ఇళ్ల పేరిట కాలయా పన చేశారనీ, ప్రజా ప్రభుత్వం ఇం దిరమ్మ ఇళ్లతో ఒక్కో ఇంటికి 5లక్ష ల ఆర్థిక సాయం చేస్తూ..పేదవాడి సొంతింటి కల నిజం చేస్తు న్నామని తెలిపారు.ఓటు కోసం ప్రతి పక్షాలు చెప్పే మాయ మాటలు నమ్మవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు..వారికి ఓ టు వేస్తే వృధానే అవుతుందని,నా దగ్గరికి మీ సమస్యలు తీ సుకువ చ్చే కాంగ్రెస్ కార్పొరేటర్లను ఎన్ను కోవాలని పిలుపు నిచ్చారు. పిల్లల చదువుకు,వైద్యానికి, ఏ ఆపద వ చ్చిన ఆర్థిక సాయం చేయమని నా దృష్టికి తెచ్చే చేతి గుర్తుకు ఓటు వే సి కాంగ్రెస్ కార్పొరేటర్లును గెలిపి స్తే 5ఏళ్ల పాటు నల్లగొండ పట్టణ అభి వృద్ధి నేను చూసుకుంటానని మం త్రి భరోసానిచ్చారు.
తాను ఉండగా నల్లగొండలో శాంతి భద్రతలకు విఘాతం క లుగదనీ, అ న్ని వర్గాల ప్రజలు తన వాళ్లే అని మంత్రి పున రుద్ఘాటించారు. కులం, మతం బేదం లేకుండా అభివృద్దే ల క్ష్యంగా సాగుదామని,అందుకు న ల్లగొండ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సం పూర్ణ మద్దతు పలకాలని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.
కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడిన అభ్యర్థులకు పోటీగా నిల బడిన ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు రౌడీలు చిల్లర వ్యక్తుల పట్ల పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలనివారికి ఎట్టి పరిస్థి తుల్లోనూ ఓటు వేయ కుండా కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చే శారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్ డాక్టర్ హఫీజ్ ఖా న్, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అ ధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీని వాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, తి ప్పర్తి మాజీ జెడ్పిటిసి పాశం రామ్ రెడ్డి, పృధ్విధర్ రెడ్డి, 12వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా మామిడి కా ర్తీక్,27 డివిజన్ అభ్యర్థి సట్టు నాగ మణి శం కర్,28వ డివిజన్ అభ్యర్థి గుండబోయిన పుష్పలత వెంక న్న, 29వ డివిజన్ అభ్యర్థి గులాబ్ మ హమ్మద్ షఫిక్, 26వ డివిజన్ అ భ్యర్థి అసిమా సుల్తాన్( బషీర్ ),30 వ డివిజన్ అభ్యర్థి మారగోని నవీ న్ గౌడ్, ప్రముఖ పౌర సరఫరాల శా ఖ ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్ కందు ల వెంకటరమణ, కుటుంబ సభ్యు లు కందుల నిర్మలమ్మ, భార్గవి, తే జస్విని, వాణి, యశ్వంత్, భోన గి రి శివకుమార్, పలువురు మాజీ కౌ న్సి లర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకు లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొ న్నారు.



