CM Revanth Reddy : ప్రజా దీవెన, మిర్యాలగూడ: రా ష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ము గియగానే రైతు భరోసా వేస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీలక వ్యా ఖ్య చేశారు. త్వరలో నే రైతు భరోసా కిందనే తొమ్మిది వే ల కోట్ల ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు. రైతుల కోసం ఇప్ప టి వరకు మా ప్రభుత్వం లక్షా పదివేల కోట్లు ఖర్చు చేసింద ని, తెలంగా ణలో ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచి తప్రయాణం కల్పించామని, కోట్లాది మంది ఆడ బిడ్డలు అమ్మగారి ఇంటి కైనా, అమ్మవారి గుడి కైనా ఉ చితంగా వెళ్లున్నారని పున రుద్ఘాటించారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేసిన మహిళ లు కాంగ్రెస్ కు ఓటేస్తే బీజేపీ, బీఆర్ఎస్ కు వాళ్ల కు డిపాజి ట్లు రావని జోస్యం చె ప్పారు. బీఆర్ఎస్, బీజేపీ తరు పున పోటీ చేస్తున్న మహిళా అ భ్యర్థులకు కూడా ఉచిత ప్రయా ణం కల్పిస్తున్నామని చమత్కరించా రు. బుధవారం నల్లగొం డ జిల్లా మిర్యాలగూడ ప్రజా పాలన ప్రగతి బాట బహిరం గసభలో సీఎం రేవం త్ రెడ్డి ఉద్వేగ భరిత ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చేసి న ఆసక్తికర వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే…
బీఆర్ఎస్ నాయకులకు అన్ని సం క్షేమ కార్యక్రమాలు ఇస్తు న్నాం. ఎక్కడా వివక్ష చూపిం చలేదు. బీఆ ర్ఎస్ నాయకుల పిల్లలు కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూల్ లో చదువుకోవచ్చు. రాష్ట్రంలో 100 యంగ్ ఇండియా ఇం టిగ్రే టేడ్ స్కూల్స్ నిర్మిస్తున్నాం.తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు నకు విజయసూచిక గా వేలాది మంది తరలి వచ్చా రు.
సభలో ఆడబిడ్డలు ఉత్సాహంగా పాల్గొనడం చూస్తే మున్సిపల్ ఎ న్నికల్లో ఎదురులేదన్న విశ్వాసం కనిపిస్తోంది. ఈ ప్రభుత్వం గిరిజ నులు, పేదలు, ఆదివాసీలు, నిరు ద్యోగులు, మహిళలు , మైనార్టీల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కా ర్యక్రమాలు తీసుకువచ్చింది.మా ప్రభుత్వ కార్యక్రమాలను చూసి మున్సిపల్ ఎన్నికల్లో తీర్పు ఇవ్వా లి. తెలంగాణ వచ్చిన తర్వాత గ త ప్రభుత్వం కనీసం రేషన్ కార్డు లు ఇవ్వలేదు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన వెంటనే లక్షలాది మందికి రే షన్ కార్డులు ఇచ్చాం.మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యం ఇస్తున్నాం.గత ప్రభుత్వం ఇచ్చిన దొడ్డు బియ్యం బర్రెలకు ధానా పె ట్టడానికి ఉపయోగప డ్డాయి. బు క్కెడు బువ్వ తినడానికి ఉపయో గపడలే దు. మాప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యం పేదవారికి చేరాయి.
సన్న బియ్యంతో వండుకుని తిం టున్న వారందరూ కాంగ్రెస్ కు ఓ టు వేయాలి.ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.. ఇళ్లలో వెలుగులే కాదు మీ కళ్ల లో సంతోషం చూస్తు న్నాం. వ్యవసాయానికి ఉచిత వి ద్యు త్ తో పాటు ఇళ్లకు 200 యూ నిట్లు ఉచిత విద్యుత్ ఇస్తు న్నాం..
రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ మిర్యాలగూడ
మిర్యాలగూడలో అత్యధికంగా వరి పండుస్తున్నారు. గతం లో ఆ నాటి సీఎం వరి వేసుకుంటే ఉరే అన్నాడు. మా ప్రభు త్వం వచ్చాక సన్న వడ్లు పండిస్తే 500 రూపాయ ల బోనస్ ఇస్తున్నాం. బోనస్ తీసు కుంటున్న అత్యధిక లబ్దిదారులు మిర్యాలగూడాలోనే ఉన్నారు..రైతు భరోసా కింద ప్రతి ఎక రాకు 6 వేల రూపాయలు ఇస్తున్నాం. 9 రో జుల్లోనే 9 వేల కోట్లు రైతులకు ఇ చ్చాం. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పు డు 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించాం.
డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని కేసీఆర్ ఆనాడు ఊరిం చాడు.పదేళ్లు సీఎంగా ఉండి ఫామ్ హౌ స్, ప్రగతి భవన్ కట్టుకున్నాడు..ఏ పేదవాడికి ఇళ్లు కట్టి ఇవ్వాలన్న ఆలోచన బీఆర్ఎస్ చేయలేదు..ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగా నే 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. దళారు లు, దగా లేకుండా నేరుగా లబ్దిదారుల ఎకౌంట్ లోనే డబ్బు లు వేస్తున్నాం.ప్రతి ఎమ్మెల్యే మాకు మరిన్ని ఇం దిరమ్మ ఇ ళ్లు ఇవ్వాలని కోరుతున్నారు.వచ్చే బడ్జెట్ లో కొత్తగా ఇం ది రమ్మ ఇళ్లు మంజూరు చేయబోతున్నాం.
నల్గొండ జిల్లా ప్లోరైడ్ ప్రాంతం. ఈ సమస్యకు పరిష్కారం గతంలో దొరకలేదు. నల్గొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల న్ని కాంగ్రెస్ పార్టీ కట్టినవే. ఎస్ ఎల్ బీసీ 30 కిలో మీటర్ల టన్నెల్ ను గత కాంగ్రెస్ ప్రభు త్వం తొవ్వింది. నల్గొండ జిల్లా పైన కోపం ,విషంతో ఎస్ ఎల్ బీసీ ని పూర్తి చేయలేదు. ఎస్ ఎల్ బీసీ ని రెండేళ్లలో పూర్తి చేయడానికి ముందుకు వ చ్చాం. కాని అనుకోని ప్ర మాదం జరిగి 8మంది చనిపోయా రు.ఎస్ ఎల్ బీసీలో 8 మంది చనిపోతే మామ, అల్లుడు, బామ్మర్థి సంతోషపడ్డారు.
కడుపులో విషం పెట్టుకున్నవాళ్లు మున్సిపల్ ఎన్నికల్లో త మకు ఓటు వేయమని ఎలా అడుగుతారు..సిగ్గులేకుండా గంగిరెద్దుల్లా ఇంటి ముందుకు వస్తే కర్రు కాల్చి వాత పెట్టం డి.గంజికి గతి లేని వాళ్లు బెం జ్ కార్లు కొన్నారు..అదంతా మంది ని ముంచినదే.నల్గొండ జిల్లా ప్రజ లు కాంగ్రెస్ కు అం డగా నిలబడా లి.రెండేళ్లో 70 వేల ఉద్యోగాలు ఇచ్చాం. రై తు రుణమాఫీ చేశాం. రై తు భరోసా ఇచ్చాం. నాలుగు న్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం.1000 బస్సులకు మహిళల ను యజమానులను చేశాం.
మహిళా సంఘాలతో పెట్రోల్ బం కులు పెట్టించాం. 25 వేల కోట్ల ను సున్నా వడ్డీకి మహిళా సంఘాలకు ఇచ్చాం.ప్రజా ప్రభుత్వం వల్లనే ఇది సాధ్యం అయింది.పదేళ్లు అధికా రం లో ఉండి తెలంగాణను దోచుకు న్నారు.పెళ్లం మొగుడు మా ట్లాడు కుంటే ఫోన్లు విన్నరు.జర్నలిస్టులు, సినిమా తారలు, జడ్జీలు ..ఎవరిని వదలకుండా ఫోన్లు విన్నారు. అ న్నం తినే వాల్లు ఎవరరైనా పెళ్లాం మొగుడు మాట్లాడుకుంటే వింటా రా. కొంత మంది జాతిపితను వి చారిస్తారా అని అడుగుతు న్నారు.
ఎవరికి రా నువ్వు జాతి పితవు నీ జాతికి నువ్వు పిత కా వొచ్చు మా కు కాదు.పెళ్లాం మొగుడు జోలి పెట్టుకుంటే వి న్నసన్నాసి నువ్వు జాతిపితవా. సిగ్గుతో తలదించుకోవాలి మీరు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును మొఖాలకు ముసు గు తొడిగి విచారణకు పోలీసులు తీసుకువచ్చేది ఉండే. జా తిపిత అయి తే మీరు సంపాదించుకున్న ఆస్తులు తెలం గాణ ప్రజలకు ఇస్తారా..
కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ , కేసీ ఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌ స్ , హరీష్ రావు మోయినా బాద్ ఫామ్ హౌ స్ , టీవీలు, ఫేపర్లు, వేల కోట్లు తె లంగాణ ప్రజలకు ఇస్తారా.సీఎం, మం త్రి, ఎమ్మెల్యే అన్ని పదవులు మీరే తీసుకున్నారు. తెలంగా ణ కో సం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకర మ్మ కు చిన్న పద వి కూడా ఇవ్వలేదు.తెలంగాణ కో సం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జాతి పిత అవుతడు..
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ మొ త్తం పోయినా తెలంగాణ ప్రజల ఆ కాంక్షను నేరవేర్చిన సోనియమ్మ తెలంగాణ తల్లి అవుతుంది. లు చ్చా, సన్నాసి , దొంగ నువ్వెలా జా తి పిత అవుతావు.. తెలంగాణ ప్ర జలకు మీరు క్షమాపణ చెప్పా లి..
నక్క జిత్తుల భాస్కర్ రావు మిర్యాలగూడలో ఉన్నాడు. జా నారెడ్డి చెప్పులు మోసినవాడు. నీళ్ల సీసాలు మోసినవాడు భాస్కర్ రావు.మిర్యాలగూడా లో కాంగ్రెస్ కార్య కర్తలు గెలి పిస్తే ఆత్మగౌరవాన్ని ఎ ర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ పా దాల దగ్గర పెట్టాడు. మా అభ్య ర్థు లను బెదిరిస్తే భాస్కర్ రావు నీకు చింతపండు అవుతుంది. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ భయపడొద్దు..జానారెడ్డిని ఓడించడానికి భాస్కర్ రావు ఇంటింటికి తిరిగాడు..
నల్గొండ జిల్లాలో 18 మున్సిపా లి టీల్లో విజయంపైన నాకు నమ్మకం ఉంది. తెలంగాణలో అన్ని మున్సి పాలిటీలు గెల వాలి.తెలంగాణలో మున్సిపాలిటీల్లో 17,472 కోట్లు ఖర్చు పెట్టాం.నల్గొండ జిల్లా మున్సి పాలిటీల్లో 2028 కోట్లు ఖర్చు పె ట్టాం. మిర్యాలగూడ మున్సి పా లి టీలో 295 కోట్ల ఖర్చు చేశాం. ము న్సిపల్ శాఖ నా దగ్గరే ఉంది.. ము న్సిపాలిటీల అభివృద్ధి నా బాధ్య త. వడ్డించే వాడు మనవాడు అ లాగే అడిగే వాడు మన వాడు ఉండాలి. మనోడు అయి ఉండా లి. ఇంకా 8 ఏళ్లు అధికారంలో ఉం టాం. మున్సిపాలి టీల ను అద్దంలా తీర్చిదిద్దుతాం. కాంగ్రెస్ గెలిస్తే పేద వాడు గెలి చినట్లు. అభివృద్ధి జర గాలంటే అధికార పార్టీ గెలవాలి..
గతంలో ఇచ్చిన బతుకమ్మ చీరలు దేనికైనా పనికి వచ్చా యా..? సారె పెట్టినట్లుగా ఆడబిడ్డలు ఇందిర మ్మ చీరలు కట్టుకుని వచ్చారు.జమ్మికి వచ్చిన పాలపిట్టల్లా ఇం దిరమ్మ చీరల్లో ఆడబిడ్డలు కని పి స్తున్నరు. ఓటేసే ముందు సన్నబి య్యం, రేషన్ కార్డు, రైతు భోరో సా,రుణమాఫీ, బస్సు ప్ర యాణం, 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు , ఇం దిరమ్మ ఇళ్లను గుర్తు చేసుకోండి.ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకో వా ల్సిన బాధ్యత మీది. 123 ము న్సిపాలిటీల పైన కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ముఖ్య మంత్రి ధీమా వ్యక్తం చేశారు.


