Praja Deveena
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 12:42 pm Posted by : praja deveena

Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్య, హైదరాబాదుకు దీటుగా నల్లగొండ కార్పొరేషన్ తీర్చిదిద్దుతా 

 

Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ను హైద రాబా దుకు దీటుగా అభివృద్ధి చే సేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రో డ్లు,భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెం కట్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండ ము న్సిపల్ కార్పొరే షన్ ఎన్నికల ప్రచా ర కార్యక్రమంలో భాగంగా 4,5, 21, 20, 41, 47,48 డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులను గెలి పించాలని కోరుతూ రోడ్ షో నిర్వ హించారు. ఈ సంద ర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. నల్లగొండ మున్సిప ల్ కార్పొరేషన్ ను సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తానని తెలిపారు.

గత బిఆర్ఎస్ ప్రభుత్వం నల్గొండ మున్సిపల్ అభివృద్ధికి ఎ లాంటి కృ షి చేయలేదని ధ్వజమెత్తారు. కెసిఆర్ ప్రభు త్వం కుటుంబంలో పద వులు పంచుకున్నారే తప్ప ప్రజా సంక్షే మాన్ని పట్టించుకోలేదని విమ ర్శించారు. తెలంగాణ ఉద్య మంలో ఎంతో మంది విద్యార్థుల చావుకు కారణమైన కేసీఆ ర్ ఎలా జాతిపిత అవుతాడని ప్రశ్నించారు. చెప్పడానికి ఆ పార్టీ నాయకులకు సిగ్గుండాన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వి ద్యార్థులు ఆత్మ బలిదా నం చేసు కుంటుంటే చలించి తాను మంత్రి పదవికే రాజీ నా మా చేశానన్నారు. కెసిఆర్ పాలనలో దొరపాలన, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఇంది రమ్మ రాజ్యం నడు స్తుంద న్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే ధ్యే యంగా పని చేస్తుందని పేర్కొన్నారు.

పేదలకు రేషన్ కార్డులు, సన్న బి య్యం, ఉచిత కరెంటు త దితర ఎ న్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నా రు. ఈనెల 11న జరిగే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎ న్నిక లలో చెయ్యి గుర్తుకు ఓటు వే సి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే డి విజన్లోని సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించడం జరు గుతుందన్నా రు. ఇతర పార్టీల అ భ్యర్థులను గెలిపిస్తే ఎలాంటి ప్ర యోజ నం ఉండదని తెలిపారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో రూ. 2000 కోట్లతో వివిధ అభి వృద్ధి పనులు జరుగుతు న్నాయని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మ రింత అభివృద్ధి చేస్తా నని తెలిపారు.

నల్లగొండ నియోజకవర్గంలో ప్రజ లకు ఏ సమస్య కుటుం బంలో వ్య క్తిగా వారికి అన్ని విధాలుగా అండ గా ఉంటానని పేర్కొన్నారు. తన ను ఐదు సార్లుగా ఎమ్మెల్యేగా గె లి పించి మంత్రిగా చేసిన ఇక్కడి ప్రజ ల రుణం ఎప్పటికీ తీర్చుకోలే నిదని అన్నారు. 4వ డివిజన్ పరిధిలోని కేశరాజుపల్లిని గత ప్రభుత్వం ఇం డస్ట్రియల్ కారిడార్ మారిస్తే ప్రజల సమస్య లను దృష్టిలో ఉంచుకొని తాను దానిని రద్దు చేయించానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్ డాక్టర్ ఎంఏ హా ఫిజ్ ఖాన్, మాజీ మున్సిపల్ చై ర్మన్ బురి శ్రీనివా స్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మో హన్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, తి ప్ప ర్తి మాజీ జడ్పిటిసి పాశం రామ్ రెడ్డి,4వ డివిజన్ కార్పొరేట ర్ అ భ్యర్థి బోగరి వైష్ణవి,5వ డివిజన్ అ భ్యర్థి పున్న జ్ఞానే శ్వరి గణేష్,21వ డివిజన్ అభ్యర్థి మహమ్మద్ ఇబ్ర హీం, 20వ డివిజన్ అభ్యర్థి అల్లి సుభాష్, 42వ డివిజన్ అ భ్యర్థి పబ్బు సాయిశ్రీ,41వ డివిజన్ అ భ్యర్థి కేసాని వేణుగోపాల్ రెడ్డి, 47 డివి జన్ కార్పొరేటర్ అబ్బగోని కవి త రమేష్, 48వ డివిజన్ అభ్యర్థి యామ కవిత దయాకర్, మాజీ కౌ న్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.