Praja Deveena
Newspaper Banner
Date of Publish : 07 February 2026, 11:25 am Posted by : praja deveena

sp sharath chandra pawar : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లాలో ము మ్మరంగా వాహన తనిఖీలు,ము న్సిపల్ ఎన్నికల్లో పకడ్బందీ తని ఖీలన్న ఎస్పీ శరత్ చంద్ర పవార్

sp sharath chandra pawar : ప్రజా దీవెన, నల్లగొండ: న ల్లగొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, స్వే చ్ఛా యుతంగా, న్యాయంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శా ఖ కఠిన చర్యలు చేపట్టింది. ఎన్నికల ప్రవర్తనా నియమావ ళి అమలులో భాగంగా ఓట ర్లను ప్రలోభపెట్టేందుకుమద్యం, నగదు, ఇతర విలువైన వస్తువులు అక్రమంగా సరఫరా కా కుండా జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వ హిస్తున్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ స్వ యంగా పలు చెక్ పోస్టులు, తనిఖీ కేంద్రాల ను పరిశీలించి పోలీసు అధికారుల కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశా రు. ప్రధాన రహదారులు, గ్రామీణ మార్గాలు, పట్టణ పరిధుల్లో వాహ నాల తనిఖీలు ముమ్మరంగా చేపట్టాలని, అనుమా నాస్పద వాహనా లు మరియు వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉం చాలని సూచించారు.

తనిఖీల్లో భాగంగా కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు సహా అన్ని ర కాల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ, మద్యం, నగదు, గిఫ్ట్ వస్తు వులు తరలిస్తున్నారా అనే కోణంలో పరి శీలిస్తున్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినట్లయి తే సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసు కుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.అలాగే, ఎన్నికల స మయంలో శాంతిభద్ర తలకు విఘాతం కలిగించే ప్రయ త్నా లు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.

ప్రజలు కూడా ఎలాంటి ప్రలోభాల కు లోనుకాకుండా స్వే చ్ఛాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, అ క్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పో లీసు లకు తెలియజేయాలని జిల్లా ఎస్పీ కోరారు. ఈ తనిఖీ కా ర్యక్రమాల్లో జిల్లా ఎస్పీ వెంట నల్లగొండ డీఎస్పీ శివ రాంరెడ్డి, ఎస్.ఐ గోపా ల్ రావు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.