–అక్రిడిటేషన్ ప్రక్రియ పారదర్శకం తో అర్హులందరికీ న్యాయం
–సమాచార పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
Minister Ponguleti Srinivas Reddy : ప్రజా దీవెన, హై దరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి జ ర్న లిస్టుకూ అక్రిడిటేషన్ కార్డు అం దేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబం ధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జర్న లిస్టుల సంక్షేమం పట్ల ముఖ్య మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నా య కత్వం లోని ప్రజాప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందని పేర్కొన్నారు.
అక్రిడిటేషన్ కార్డుల జారీ విధానం, అక్రిడిటేషన్ కమిటీ ఏ ర్పాటు తదితర అంశాలపై గురువారం సచివాలయంలోని తన కార్యాలయం లో సమాచార పౌరసంబంధాల శాఖ క మిషనర్ సిహెచ్. ప్రియాంక, ముఖ్యమంత్రి సిపిఆర్‌వో జి. మ ల్సూర్‌లతో మంత్రి సుదీర్ఘంగా చ ర్చించారు. ప్రక్రియ పా రదర్శకంగా, వేగవంతంగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్య లపై దిశానిర్దేశం చేశారు.
అక్రిడిటేషన్ కార్డుల జారీకి సంబం ధించి ప్రభుత్వం ముం దుగా జి.ఓ. 252 జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. అనం తరం జర్నలిస్టు సంఘా లతో సమావేశమై వారి సూచన లు, అభిప్రాయాలను సవివరంగా పరిగణనలోకి తీసుకొని అవసర మైన సవరణలు చేసి జి.ఓ. 10 3ను జారీ చేసిన ట్లు వెల్లడించారు. ఈ సవరణల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రిం ట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీ డియా మరియు డిజిటల్ మీ డియా విభాగాల్లో మొత్తం 44,706 అక్రిడిటేషన్ కార్డులు పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు.
గతంలో సుమారు 23 వేల మందికి మాత్రమే అక్రిడిటేషన్ కార్డులు ఉండగా, తాజానిర్ణయంతో దాదా పు 21 వేలకు పైగా కార్డుల సంఖ్య పెరుగుతుందని మంత్రి వివరించారు. 2.50 లక్షల పైగా సర్క్యులేషన్ ఉన్న 8 పత్రికలకు 6,256 కార్డు లు, 75 వేల నుండి 2.50 లక్షల వరకు సర్క్యులేషన్ ఉన్న24 పత్రిక లకు 17,784 కార్డులు , 25001 నుంచి 75 వేల వరకు సర్క్యులేషన్ ఉన్న 30 పత్రికలకు 3,390, అదే విధంగా 15001 నుంచి 25000 వరకు సర్క్యులేషన్ ఉన్న 169 చి న్న పత్రికలకు 11,661 , 15వేలలో పు సర్క్యులేషన్ ఉన్న 113 చిన్న పత్రికలకు 226, పీరియాడికల్స్‌కు 624, 2 0 న్యూస్ ఏజన్సీలకు 68 అక్రిడిటేషన్‌లు పొందుతాయని తెలిపారు.
అలాగే 21 శాటిలైట్ ఛానళ్లకు 4,4 31 కార్డులు, 8 జాతీయ ఛానల్స్ కు 32, వంద లోకల్ కేబుల్ ఛానళ్ల కు 200 ,డిజి టల్ మీడియా విభా గానికి 10 కార్డులు మొత్తంగా 44, 706 కార్డులు కేటాయించినట్లు తె లిపారు.ఇందులో రాష్ట్ర మరి యు జిల్లా స్థాయిలో 16,056, నియోజ కవర్గ మరియు మం డల స్థాయిలో 28, 650 మంజూరు చేస్తున్నట్లు తెలి పారు. అక్రిడిటేషన్ కార్డుల జారీ ని రంతర ప్రక్రియ అని, అవసరా న్ని బట్టి మరోసారి సమావేశమై తదు పరి చర్యలు తీసుకో వాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ప్ర జాస్వా మ్యం లో నాలుగో స్థంభంగా ఉన్న మీడియా ప్రతినిధుల గౌర వం, భద్రత, సంక్షేమం ప్రభు త్వా నికి అత్యంత ప్రాధాన్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.