Praja Deveena
Newspaper Banner
Date of Publish : 16 February 2026, 1:06 pm Posted by : praja deveena

CBSE Clarifies : సీబీఎస్ఈ స్పష్టీకరణ, మొదటి బోర్డు పరీక్షకు ప్రతి విద్యార్థి తప్ప నిసరిగా హాజరవ్వాల్సిందే

CBSE Clarifies : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశంలో 2 026 నుంచి అమలులోకి రానున్న పదో తరగతి రెండు బోర్డు పరీక్షల విధానంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకం డరీ ఎడ్యుకేషన్ (CBSE )తాజాగా సవివరమైన స్పష్టతనిచ్చింది. అని వార్య కారణాలతో నేరుగా రెండో బోర్డు పరీక్షకు అనుమతించాలన్న విద్యార్థుల అభ్యర్థనలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తి రస్కరించింది.

మొదటి బోర్డు పరీక్షకు ప్రతి విద్యా ర్థి తప్పనిసరిగా హాజరవ్వాల్సిందే నని పేర్కొంది. మొదటి పరీక్షలో ఉ త్తీర్ణత సాధించిన విద్యార్థులు సై న్స్, మ్యాథమెటిక్స్, సోషల్ సైన్స్, భాషలతో సహా గరిష్టంగా మూడు సబ్జెక్టుల్లో మార్కులు మెరుగుప ర్చుకునే అవకాశం ఉంటుందని తె లిపింది. అయితే మొదటి పరీక్షలో మూడు లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులకు హాజరుకాని విద్యార్థుల ను ‘ఎసెన్షియల్ రిపీట్’ కేటగిరీలోకి చేర్చుతామని, వారు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ప్రధాన పరీక్షకు మాత్రమే హాజరవ్వాల్సి ఉంటుం దని స్పష్టం చేసింది.

మొదటి పరీక్ష ఫలితాల్లో ‘కంపా ర్ట్మెంట్’ పచ్చిన విద్యార్థులకు రెండో బోర్డు పరీక్షకు అవకాశం ఉంటుంద ని బోర్డు తెలిపింది. పదో తరగతి పూర్తయ్యాక అదనపు సబ్జెక్టులను విడిగా రాయడానికి అనుమతి ఉం డదని పేర్కొంది. మూడు లేదా అం తకంటే ఎక్కువ సబ్జెక్టులకు హాజ రుకాని విద్యార్థులకు రెండో పరీక్ష కు ఎలాంటి మినహాయింపులు ఉండవని, ఈవిషయంలో అభ్య ర్థ నలను స్వీకరించబోమని సీబీఎస్ ఈ స్పష్టం చేస్తూ ఓ ప్రకటన విడు దల చేసింది.