Praja Deveena
Newspaper Banner
Date of Publish : 18 February 2026, 12:52 pm Posted by : praja deveena

District Collector Badugu Chandrashekhar : జిల్లాలోని రైతులందరూ“ఫార్మర్స్ రిజిస్ట్రేషన్” చేయించుకునేలా చూడాలి 

 

District Collector Badugu Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తు న్న వివిధ పథకాల లబ్ధిని పొందేందు కు జిల్లాలో ఉన్న రైతులందరూ త ప్పనిసరిగా “ఫార్మర్స్ రిజిస్ట్రేషన్” చేయిం చుకునేలా అవగాహన క ల్పించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్ర శేఖర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వ్యవసాయ అధి కారులతో నిర్వ హించిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ జిల్లాలో మొత్తం 5, 54,347 మంది పట్టాదారు పాసు పుస్తకాలు కలిగిన రైతులు ఉన్నా రని, ఇప్పటివరకు 2 లక్ష ల 41 వేల 39 మంది రైతులు మాత్రమే ఫార్మ ర్స్ రిజిస్ట్రే షన్ చేయించుకున్నా ర ని, తక్కిన రైతులందరూ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఇందుకుగాను రైతులకు అవగాహ న కల్పించాలని, మీ-సేవ లేదా వ్య వసాయ విస్తరణ అధికారుల దగ్గర లాగిన్ చేసు కోవాలని చెప్పారు. దీ నివలన కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాల కింద రైతులు లబ్ది పొం దేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. రాను న్న కాలంలో వ్యవ సాయ రంగం మొత్తం డిజిట లైజే షన్ చేయనున్న దృష్ట్యా ఫార్మర్ రి జిస్ట్రేషన్ తప్పనిసరి అవు తుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని క్షే త్ర స్థాయిలో రైతుల కు అవగాహన క ల్పించి అందరూ ఫార్మ ర్స్ రిజిస్ట్రేషన్ అ య్యేలా చూడాలని ఆదేశించారు.జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, మండల వ్యవసాయ అధి కారులు ఈ సమావేశానికి హాజర య్యారు.