Minister Ponguleti : ప్రజా దీవెన, ఖమ్మం: రాష్ట్రంలోని జర్నలిస్టు యూనియన్ల ప్రతిపాదన మేరకే అక్రిడేషన్ కమి టీలు ఏర్పా టు చేస్తామని, వెబ్ సైట్ సమస్య లు పరిష్కరి స్తామని టీయూడ బ్ల్యూజె (ఐజెయు)ప్రధాన కార్యద ర్శి రామ్ నారాయణకు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సమస్యలు పరి ష్కరించాలని కోరి న టియుడబ్ల్యూజేఐజేయు బృం దం మంత్రిని ఆదివారం నాడు ఖ మ్మంలో మంత్రి క్యాంపు కా ర్యాలయంలో రామనారాయణ నేతృ త్వంలో కలిసి వినతి పత్రం అంద జేశారు.
కేబుల్ చానల్స్, చిన్న పత్రికలకు కూడా అక్రిడేషన్లు ఇవ్వా లని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. రామ్ నారాయణ ఈ సందర్భంగా మం త్రికి అన్ని విభాగాల జర్నలిస్టులు ఎదు ర్కొంటున్న సమస్యలను వి వ రించారు. రాష్ట్రంలో 44709 మం ది జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు లు ఇస్తామని చెప్పా రని, తమరు ఇచ్చిన జీవో ప్రకారం చూస్తే 50% కార్డులు కూ డా రావనే గందరగోళం జర్నలిస్టుల్లో నెలకొందని పేర్కొన్నా రు. ఫ్రీలాన్సర్, వెటరన్ జర్నలిస్టు లకు పెట్టిన నిబంధనలు ఇబ్బంది గా ఉన్నాయని, వెబ్ సైట్ ఓపెన్ చే స్తే అందులో అడిగే ప్రశ్నలు కార్డు లు ఇచ్చేలా లేవని అభిప్రాయాలు వ్య క్తమవుతున్నట్లు మంత్రి దృష్టికి తెచ్చారు.
వెబ్సైట్ ఫార్మేట్ సుల భ తరంగా లేదని ప్రస్తావించారు.జిల్లా అక్రిడేషన్ కమి టీలలో గత సాంప్ర దాయం ప్రకారం రిజిస్టర్డ్ యూని యన్ నుంచి లెటర్ పంపితే కమి షనర్ కార్యాల యం ఆమోదించి వారిని కమిటీ లో సభ్యులుగా తీ సుకు న్నారని, ప్రస్తుతం దానిని ప క్కన పెట్టి కలెక్టర్లకు అధికారం క ల్పించడాన్ని తప్పుపట్టారు. ఇది అ త్యంత విచారకర మన్నారు.
పాత పద్ధతినే కొనసాగించాలని వి జ్ఞప్తి చేశారు. ప్రస్తుత జీవో ప్రకారం కలెక్టర్ అందరిని నామినేట్ చేస్తా రనే ఉందని , ఇది సాధ్యం కాదని, కలెక్టర్ కు కొత్త చిక్కులు తెచ్చి పె డు తుందని పేర్కొన్నారు. మా వి న్నపాన్ని పరిశీలించి గతంలో అక్రి డేషన్ కమిటీలు ఏ విధంగా ఏ ర్పాటు చేశారో అదే సాం ప్రదాయా న్ని కొనసాగించాలని రామ్ నారా యణ మంత్రిని కోరారు. జీవో ప్రకా రం పెద్ద పత్రికలు, శాటిలైట్ చాన ల్స్, డెస్క్ జర్నలిస్టుల కార్డులు త గ్గించడం జరిగిందని, దీంతో ఇబ్బం దులు తప్పవనే ఆందోళనతో జర్న లిస్టులు ఉన్నా రని పేర్కొన్నారు.
చిన్న పత్రికల వారు కూడా తమ కు గతంలో మాదిరిగా కార్డులు రా వని ఆందోళనలో ఉన్నారని, కేబు ల్ చానల్స్ జర్నలిస్టులకు అన్యా యమే జరుగుతుందని వివరిం చా రు. గతంలో వారు కార్డులు పొంది నప్పటికీ , ఈసారి కార్డులు రావని ఆందోళన చెందుతున్నారని 20 ని మిషాల పాటు అన్ని అంశాలపై మంత్రికి వివరించారు. దీనిపై మం త్రి సానుకూలంగా స్పందించారు. యూనియన్ల ప్రతిపాదన మేరకే అక్రిడేషన్ కమిటీలు ఏర్పాటు చే స్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. అక్రిడేషన్ వెబ్ సైట్ ను సరళీకరణ చేస్తామన్నారు.
అక్రిడేషన్ల గడువు మరో నెల పొడి గింపు జరుగుతుందని, జర్నలిస్టు లు, సంఘాల నాయకులు ఆందోళ న చెందరా దన్నారు. అర్హులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇస్తామని మం త్రి పొంగులేటి స్పష్టం చేశారు. మం త్రిని కలిసిన వారిలో టీయూడ బ్ల్యూజే ఐజేయు జర్నలిస్టు యూని యన్ రాష్ట్ర కమిటీ సభ్యులు మా టేటి వేణుగోపాల్, మాజీ జిల్లా అ ధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, యూ నియన్ జిల్లా కార్యదర్శి మైస పా పారావు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడి యా అధ్యక్షులు మామిడాల భూ పాల్, జర్నలిస్టుల జిల్లా హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు కనకం సైదులు, యూనియన్ జిల్లా ఉపాధ్య క్షులు మోయినుద్దీన్, జిల్లా కోశాధికారి నాగండ్ల శివ, ఖమ్మం నగర కమిటీ అధ్యక్ష కార్యదర్శులు చెరుకుపల్లి శ్రీనివాస్, నంచర్ల జనార్ధన చారి, జి ల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ వేగినాటి మాధవరావు, జిల్లా నాయకులు ఏ లూరు వేణుగోపాలరావు తదితరు లు పాల్గొన్నారు.
