Praja Deveena
Newspaper Banner
Date of Publish : 03 March 2026, 4:25 pm Posted by : praja deveena

CM Revanth Reddy Collectors conference : బిగ్ బ్రేకింగ్, కలెక్టర్ ల సమావేశం లో కీలక నిర్ణయం, మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల ప్రజా శక్తి యాత్ర

CM Revanth Reddy Collectors conference : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తూ రేవంత్ రెడ్డి కలెక్టర్ల సమావేశంలో కీలక ఆదేశాలు జా రీ చేశారు. 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను కేవలం ప్రభు త్వ కార్యక్రమంగా కాకుం డా “ప్రజల ఉద్యమంగా” మార్చా లని ఆయన స్పష్టం చేశారు. మార్చి6 ఉదయం ప్రారంభ మ య్యే ఈ మహత్తర కార్యక్రమం జూన్ 12న ప్రజల ఆశయా లతో పరిపూర్ణంగా ముగియనుంది. అయిదు దశల్లో, పది ప్రధాన థీమ్‌లతో, గ్రామం నుం చి రాష్ట్ర స్థాయి వరకు అభి వృద్ధి పరుగులు తీసే 99 రోజుల యాక్షన్ ప్లాన్ కానుంది. ఈ కార్యక్రమానికి ప్రణాళిక శాఖ నోడల్ శాఖగా వ్య వహరిస్తూ, ప్రతి శాఖను ఒకే లక్ష్యా నికి అనుసంధానించనుంది. కాగా వార్డు సభ్యులు, సర్పంచులు, కా ర్పొరేటర్లు, మేయర్లు తప్ప నిసరిగా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సీఎం ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో ఒకరోజు ప్రత్యేక శిక్షణ శిబిరా లు నిర్వహించి స్థానిక నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు.

*గ్రామాలకు సోలార్ శక్తి అందించాలి*

ప్రతి గ్రామంలో సోలార్ విద్యుత్ వి నియోగంపై అవగాహన కార్యక్ర మాలు చేపట్టాలని, రైతులకు సో లార్ పంప్ సెట్లను ప్రోత్సహిస్తామ ని ప్రకటించారు. భూసార పరీక్షల ఆధారంగా సరైన పంటలపై మార్గ దర్శనం ఇవ్వాలని కలెక్టర్లకు సూ చిం చారు. యూరియా యాప్‌ను సులభతరం చేసి, నానో యూ రియా ప్రయోజనాలపై క్షేత్ర స్థాయి ప్రదర్శనలు నిర్వహించా లి. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను గ్రామ, వార్డు సభల్లో బహిరంగంగా ప్రకటించాలని సీఎం సూచించారు. అన్ని సంక్షేమ పథకాలలో ఫేషియ ల్ రికగ్నిషన్ అమలు చేసి అనర్హులను తొలగించాలని స్పష్టం చేశారు.

       వైద్యం, విద్యలో నాణ్యత

రాష్ట్రంలోని 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీల సేవలు ప్రజలకు పూర్తిస్థా యిలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన బిల్లులు ప్రతి నెలా స మయానికి చెల్లించాలని చెప్పారు. ప్రైవేట్, కార్పొరేట్ వి ద్యాసంస్థల్లో సైకాలజిస్టులు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకో వా లని, డ్రగ్స్, గంజాయి వినియోగం పై కఠిన చర్య లు తీసుకోవాలని స్ప ష్టం చేశారు. రవాణా శాఖ డేటాను పూర్తిగా ఆన్‌లైన్ చేయాలని, డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వ హించాలని ఆదేశించారు. రోడ్లగుంతల సమాచారం కోసం ప్రత్యేక వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేయాలని, ఓ ఆర్ఆర్ మరియు సర్వీస్ రోడ్లపై చె త్త డంపింగ్‌పై కఠిన చర్యలు తీ సుకోవాలని తెలిపారు.

వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ లు సమన్వయంతో పని చేయాల ని సీఎం ఆదేశించారు. జిల్లాల వారీగా పంటల వై విధ్యంపై కలెక్టర్లు ని వేదికలు సమర్పించాలని స్పష్టం చే శా రు.సారాంశంగా, పరిపాలనలో పారదర్శకత, సాంకేతికత వి నియో గం, గ్రామాభివృద్ధి, వ్యవసాయ సంస్కరణలు—ఇవి అన్నీ సమ గ్రం గా అమలు చేస్తేనే “బంగారు తెలం గాణ” ల క్ష్యం సాధ్యమని సీఎం రే వంత్ రెడ్డి కలెక్టర్లకు దిశానిర్దేశం చే శారు.

    ఐదు దశలు అభివృద్ధి పాద యాత్ర

*మార్చి 6* – అన్ని ఉమ్మడి జిల్లా ల్లో మంత్రుల ఆధ్వ ర్యం లో సన్నా హక సమావేశాలు
*ఏప్రిల్* 2– గ్రామ సభల ద్వారా గ్రామ స్థాయి సమీక్ష
**ఏప్రిల్ 16** – మండల స్థా యి కార్యక్రమం
**మే 2** – నియోజకవర్గ స్థాయి సమీక్ష
**మే 22** – జిల్లా స్థాయి సమగ్ర సమీక్ష
**జూన్ 2** – రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పురోగతి ప్రద ర్శనతో ఈ ఐదు దశలు కేవలం సమావేశా లు కాదు ప్రతి ద శలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, లబ్ధిదారుల వివ రాల వెల్లడి జరుగుతుంది.

పది థీమ్‌లు,  ప్రజల జీవితాల్లో మార్పు

1. పరిసరాల పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్

2. ఆరోగ్యం

3. అరైవ్… అలైవ్ (రోడ్డు భద్రత)

4. సంక్షేమం

5. పిల్లల భద్రత – డ్రగ్స్‌కు అడ్డుకట్ట

6. రైతు సంక్షేమం – వ్యవసాయం

7. విద్య

8. యువత – క్రీడలు

9. మహిళలు

10. పర్యావరణం

ప్రతి శాఖ తమ పరిధిలో 99 రోజు ల్లో స్పష్టమైన ఫలితాలు చూప నుంది. ప్రతి కార్యక్రమం పురోగతి ని ట్రాక్ చేయడా ని కి ప్రత్యేక మొబై ల్ యాప్ రూపొందించబడుతుంది. పారద ర్శకత, వేగం, సమన్వయం – ఈ మూడు లక్ష్యాలు దృష్టిలో

*సచివాలయంలో కలెక్టర్ల సద స్సులో ముఖ్యమంత్రి స్పష్టమైన సందేశం…*

–IAS అవ్వడం గొప్ప కాదు ప్రజ లకు ఉపయోగపడే పని చేయడం గొప్ప.

కలెక్టర్లు నెలకు కనీసం 10 రో జులు క్షేత్రస్థాయిలో పర్యటిం చాలి.

* ప్రభుత్వానికి కళ్లు, చెవులు అధికారులే.

* ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలి.

సంక్షేమం, గ్రామసభలలోనే లెక్క లు

గ్రామాల వారీగా:  కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం,  ఇంది రమ్మ ఇళ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్,  రుణ మాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్

లబ్ధిదారుల వివరాలు గ్రామసభల్లో చదివి వినిపించాలి.

విద్య & పోషణ – 26 వేల పాఠ శా లలకు నూతన దిశ

* ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పర్యవేక్షణకు ఒక అధికారి

* కలెక్టర్లు వారానికి ఒకసారి పాఠశాలలో భోజనం చేయాలి

 ఫుడ్ పాయిజన్ ఘటనలకు చెక్

 100 నియోజకవర్గాల్లో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, పౌష్టికాహారం – ఇదే లక్ష్యం.

ఆరోగ్యం – మెడికల్ కాలేజీల సమగ్ర వినియోగం

రాష్ట్రంలోని 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీల సేవలను ప్రజలకు అందే లా చర్యలు. భవిష్యత్‌లో అన్ని ప్ర భుత్వ ఆసుపత్రులను మెడికల్ కాలేజీలతో ఇంటిగ్రేట్ చేయాలనే ప్రణాళిక.

భూసార పరీక్షలు

మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలకు ప్రోత్సాహం

పంట మార్పిడి, వైవిధ్యంపై అవగాహన

 యూరియా యాప్ సులభతరం

నానో యూరియా ప్రదర్శనలు

 వ్యవసాయ & పౌర సరఫరాల శాఖల సమన్వయం

కఠిన చర్యలు – అవినీతి, అక్రమాలపై నిఘా

 బోగస్ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై కఠిన చర్యలు

 ధాన్యం మోసాలపై మిల్లర్లపై చర్యలు

 ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్‌పై నిర్లక్ష్యం చేస్తే కలెక్టర్, ఎస్పీ సస్పెన్షన్

ఈ ప్రభుత్వం నిశితంగా గమని స్తుంది. మంచి పని చేస్తే అభినంది స్తుంది” — ముఖ్యమంత్రి స్పష్టం.జూన్ సమీక్ష పనితీరు ఆధారంగా అంచనా…జూన్‌లో కలెక్టర్ల పనితీ రుపై సమీక్ష సమావేశం. వార్షిక ప ర్ఫామెన్స్ రిపోర్ట్ ఆధారంగా అంచనా.99 రోజులు…ప్రతి గ్రామం మార్పు చూడాలి.ప్రతి పథకం లబ్ధి చేరాలి. ప్రతి అధికారి బాధ్యతగా పనిచేయాల ని సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టరు లకు దిశానిర్దేశం ద్వారా సుస్పష్టం చేశారు.