Praja Deveena
Newspaper Banner
Date of Publish : 03 March 2026, 2:31 am Posted by : praja deveena

Crude oil prices : భవిష్యత్‌ తుఫాన్ లా క్రూడాయిల్‌, భారత్‌కు భారీసవాల్‌

 

Crude oil prices : ప్రజా దీవెన న్యూ ఢిల్లీ: ఆధునిక సాంకే తికత ప్రపంచాన్ని శాసిస్తున్న సందర్భం, 2040 దిశగా ప్రపం చం పరుగులు తీస్తున్న వేళ పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ మేఘాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కొత్త కారు చీకట్లు కమ్ముకాబోతున్నాయి. కీల క సముద్ర మార్గమైన Strait of Hormuz మూసివేతతో గ్లోబల్‌ చమురు సరఫరా గొలుసు ఒక్కసా రిగా దెబ్బతింది. ఇరాన్‌ తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్యానికి పెనుసవాల్ గా మారింది.

గల్ఫ్‌ దేశాల నుంచి ఆసియా, యూరప్‌, అమెరికాలకు వెళ్లే కోట్ల బ్యారెళ్ల చమురు రోజూ ఈ జల సంధి ద్వారానే ప్రయా ణిస్తుంది. అ యితే యుద్ధ పరిస్థితుల్లో చమురు రవాణా నౌ కలపై దాడుల వార్తలు మార్కెట్లలో భయాందోళనలు రేకె త్తించాయి. ఒక్కసారిగా అంతర్జాతీ య మార్కెట్లో ఏప్రిల్‌ కాంట్రాక్ట్‌ ధర లు దాదాపు 10 శాతం ఎగసిపడ్డాయి.

ఈ పెరుగుదల కేవలం సంఖ్యల్లోనే కాదు దేశాల ఆర్థిక వ్య వస్థలపై ప్రభావం చూపే శక్తిగా మారింది. రవాణా ఖర్చులు పెరిగాయి. విద్యు త్‌ ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగింది. పరి శ్రమల ఉత్పత్తి ఖర్చులు కూడా పెరిగి వినియోగదారులపై భారం పడే పరిస్థితి ఏర్పడింది.

భారత్‌కు ఇది మరింత గంభీర హె చ్చరిక గా పరిశీలకులు భావిస్తు న్నారు. బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా దేశానికి సంవత్సరానికి సుమారు రూ.13 వేల కోట్ల అద నపు భారం పడుతుందని ఆర్థిక ని పుణులు అంచనా వేస్తున్నారు. ఇం ధన ధరలు పెరిగితే ద్రవ్యో ల్బ ణం మరింత వేగంగా పెరిగి సాధా రణ ప్రజల జీవన వ్యయాన్ని ప్రభా వితం చేసే ప్రమా దం ఉంది.

ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యవ సర సమీక్షలు ప్రారంభించింది. ప్రత్యామ్నాయ సరఫరా మా ర్గాలు, వ్యూహాత్మక చమురు నిల్వలు, పునరుత్పాదక శక్తి వనరుల వినియోగాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించి నట్లు సమాచారం. యుద్ధం కేవలం సరిహద్దుల్లోనే కాదు, మార్కెట్లలో ఇంధన పంపుల్లో సాధారణ ప్రజల జేబుల్లో కూ డా కొనసాగుతోంది. క్రూడాయిల్‌ ధరల ఈ తుఫాను భవి ష్యత్తులో దేశాల ఆర్థిక విధానాలను పూర్తిగా మార్చే దిశగా దూసుకెళ్తోంది.