Praja Deveena
Newspaper Banner
Date of Publish : 04 March 2026, 12:46 pm Posted by : praja deveena

Tirupati Road Accident : ఏపీలో విషాదకర రోడ్డు ప్రమాదం, ఐదుగురి దుర్మరణం

Tirupati Road Accident : ప్రజా దీవెన, తిరుపతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా సమీపంలోని పలమనేరు వద్ద జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారు జామున జ రిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఐదు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.అతివేగంగా దూసుకెళ్తున్న కారు ముందుగా నిలి చి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొనడంతో ఈ దుర్ఘటన చో టుచేసుకుంది. ప్రమాద సమయంలో ఢీకొన్న వేగం అంత తీ వ్రమై ఉండటంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జ య్యింది.

కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు పు రుషులు, ముగ్గురు మ హిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయా రు. మృతు లం తా బెంగళూరు నగరంలోని రాజాజీనగర్ ప్రాంతానికి చెం ది న వారిగా పోలీసులు తెలిపారు. మృతులను మోహన్ దా స్ (71), నాగరాజరావు (61), కుసుమ (61), జయంతి (5 9) పూజ (33)గా గుర్తించారు. ప్రమాదం తీవ్రత వల్ల వాహ నంలో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

సమాచారం అందుకున్న వెంటనే పలమనేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ నిద్రమ త్తు, అతివేగం లేదా నియంత్రణ కోల్పోవడం వంటి కారణాలపై పో లీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం సమీప ప్రభుత్వ ఆసు పత్రికి తరలించి, బంధువులకు సమాచారం అందించారు. ఈ దుర్ఘటన స్థా నికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ మేరకు పలమనేరు పోలీసులు కేసునమోదు చేసుకుని ద ర్యాప్తు ప్రారంభించారు.