Big Breaking : ప్రజా దీవెన, నల్లగొండ: ప్రజా పాల న, ప్రగతి ప్రణాళిక అమలులో న ల్గొండ జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచాలని నల్గొండ జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర ఎస్సీ ,ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు ల క్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రం లోని ఉద యాదిత్య భవన్ లో ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికపై నిర్వ హించిన ఉ మ్మడి నల్లగొండ జిల్లా సన్నాహక సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చే ప ట్టిన ప్రజా పాలన, ప్రగతి ప్రణా ళిక కార్యక్రమంలో రాష్ట్ర ప్ర భుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల అ భివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడంతో పా టు, గ్రా మాలలో ఉన్న సమస్యల ను తెలుసుకొని పరిష్క రించేందు కు కృషి చేయాలని చెప్పారు. అ లాగే అర్రలైన లబ్ధిదా రుల కు పథ కాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ, సిని మాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటి రె డ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ రా ష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక పేరుమీద ముఖ్యమైన 10 అం శాల వారిగా కార్యక్రమా ల ను నిర్వహిస్తు న్నదని ,పరిస రాల పరిశుభ్రత, పెండింగ్ ఫైల్ పరిష్కారంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అ న్ని ప్రభుత్వ కార్యాలయంలో పరి సరాలను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా పెండింగ్ ఫైల్లను సైతం ప రిష్కరించాలన్నారు.రైతులకు సం బంధించిన అంశాలు, సంక్షేమ కా ర్యక్రమాలు, మహిళలు, చిన్న పి ల్ల ల భద్రత, రోడ్డు ప్రమాదాలు తది తర అంశాలపై ప్రజలకు స్పష్టంగా అవగాహన కల్పించాలని చెప్పా రు. ప్రతినిత్యం జరిగే రోడ్డు ప్రమా దాలలో అనేక మంది చనిపోతు న్నారని, అలా జర గ కుండా ముం దు జాగ్రత్త చర్యగా అవగాహన క ల్పించా ల న్నారు. ఇందిరమ్మ ఇం డ్ల కు సంబంధించి పెండింగ్లో ఉన్న బి ల్లులన్నిటిని సోమవారం లోపు రా ష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేయ నుం దని మంత్రి వెల్లడించారు.
ఏప్రిల్ నుండి మరో విడత ఇందిరమ్మ ఇం డ్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. వ్యవసాయంలో భాగంగా సోలార్ విద్యుత్ వినియోగించుకో వాలని, ప్రతిక్ ఫౌండేషన్ ద్వారా ఐ టిపా ముల గ్రామంలో 50 మంది స్వ యం సహాయక మహిళా సంఘ లబ్ధిదారులకు 50 లక్షల రూ పా యలను ఇచ్చి వారికి స్వయం ఉ పాధి కల్పిస్తున్నామని చెప్పారు. 2028 జూన్ నాటికి ఎస్ఎల్ బిసీ ద్వారా సాగునీటి అందిస్తామని, డిండి ఎత్తిపోతల పథకం ద్వారా మునుగోడు, దేవరకొండ నియోజక వర్గా లకు సాగునీరు అందించే ప్ర ధాన కాలువల ఎత్తు 436 స్థాయి ఉండేలా చర్యలు తీసుకుంటామని, మూ సిని ప్రక్షాళన చేసి తీరుతామని, జిల్లా కలెక్టర్లు నెలలో 15 రో జులు క్షేత్ర స్థాయిలో ఉండాలని, ని రంతరం తనిఖీలు ,పర్య వేక్షణ చేస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్ర జలకు అందేలా చూడాలని, రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకంగా చే పట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్ర మంలో గ్రామాల లో పారిశుధ్యం, తాగునీరు, ఇతర కార్యక్రమాలను సవ్యంగా అమలు చేసేలా చూడాలని, పాఠశాల లు, సంక్షేమ వసతి గృహాలను సంద ర్శించాలని చెప్పారు.
ఇప్పటివరకు గ్రామాలు ,మున్సిపాలిటీలలో ప్రజాప్రతి నిధు లు లేని కారణంగా అ నేక సమస్యలు ఉన్నాయని వాటి ప రిష్కారానికి కృషి చేయాలని, మహిళలు, పిల్లలు ,బాలికల స మ స్యలను పరిష్కరించాలని తెలిపా రు. తమ ప్రభు త్వం ప్రజల కోసం అంకితమై పనిచేస్తుందని, ఎల్లప్పుడూ తాము ప్రజలకు అందు బాటులో ఉంటామని, ఏ సమస్య వచ్చినా గ్రామ సభల ద్వారా తమ దృష్టికి తీసుకు రావాల ని,తాము ప్రజలకు అండగా నిలుస్తామని మంత్రి వెల్లడిం చారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర ఎస్ సి,ఎస్టీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లా డుతూ రాష్ట్రప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ ప థ కాలాన్ని ప్రజలకు చేరాల్సిన అ వసరం ఉందని, అధికారు లు, ప్ర జాప్రతినిధుల సమన్వయంతో పథకాలను పేదప్ర జలకు అందేలా చూడాలని, ప్రభుత్వ ఆదేశాలను ఎవరు ఉల్లంఘించవద్దని, ప్రజాపా లన- ప్రగతి ప్రణాళిక అమ లు పట్ల నిర్లక్ష్యం వహించవద్దని, ప్ర భుత్వం పేద ప్రజల కోసం రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఉచిత విద్యుత్తు, రైతు బం ధు, రైతు బీమా, రైతు భరోసా వంటి కార్యక్రమాలను అ మలు చేస్తున్నదని, ఇవన్నీ కూడా ప్రజల వద్దకు నేరుగా వె ళ్లేలా కార్యక్రమాలు రూపొందించడం జ రిగిందని తెలిపారు.
ఆయా షె డ్యూల్ తేదీలవారీగా కార్యక్రమా న్ని పకడ్బందీగా అమలు చేయా లని, అధికారులు అందరూ బాధ్య తతో పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని, ప్రజాపా లన- ప్ర గతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక వాట్సాప్ ను కూ డా ఏర్పాటు చే యడం జరిగిందని, కార్యక్రమం విజయ వం తం అయ్యేందుకు అ ధికారులందరూ సమన్వయంతో ప నిచేయాల్సిన అవసరం ఉందని, అలాగే జిల్లా కలెక్టర్లు సై తం కార్య క్ర మాన్ని ప్రతిరోజు పర్యవేక్షణ చే యాలని, ఏ రో జు చేసిన కార్యక్ర మాలు ఆ రోజు నివేదిక రూపంలో రూ పొందించాలని చెప్పారు.
రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లా డుతూ ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక అమలు లో భాగంగా మొదటి అంశమైన ప రిశుభ్రత లో భాగంగా గ్రామపంచా య లతీలకు గతంలో ఇచ్చిన ట్రాక్టర్లన్నీ సద్వినియోగం అ య్యేలా వి నియోగంలోకి తీసుకురావాలని, రాబోయే వేస విని దృష్టిలో ఉంచు కుని తాగునీటి సమస్య రాకుండా జి ల్లా కలెక్టర్లు, ఆర్డబ్ల్యూఎస్ అధి కారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకో వా ల ని పాఠశాలల్లో విద్యార్థులు ,టీచర్ల సంఖ్య క్రమ బద్ధీక రించాలనిజ్ రై తులకు యూరియా సమస్య లేకుండా సక్ర మంగా యూరియా అందేలా చూడాలని, సోలార్ విద్యుత్ పై ప్రజలు, రైతులను చైతన్యం చేయాలని చెప్పారు.
వేసవిలో విద్యుత్ కొరత రాకుండా సోలార్ విద్యుత్ ఉప యోగపడు తుందని, అధికారులు, ప్రజాప్రతినిధులు చిత్త శుద్ధితో పని చేస్తే ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో సరైన ఫ లితాలను రావడంతో పాటు ,ప్రజల నుండి మంచి ఆదరణ వస్తుందని తె లిపారు.
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు , అధికారుల సమన్వయంతోనే ప్రజాపా లన- ప్రగతి ప్రణా ళిక కార్యక్రమం విజయవంతమవుతుందని, ప్రతి గ్రామంలో ప్రభుత్వం అమలు చే యనున్న పది అంశాలు ప్రజల వ ద్ద కు తీసుకువెళ్లేలా చూడాలని, ప్ర భుత్వ పథకాలన్నీ పేదల కు అందే లా చూడాలని ,గ్రామాలలో లో వో ల్టేజ్ సమస్య ,తాగునీటి సమస్య రాకుండా చూడాలని, ఇందిరమ్మ ఇళ్లలో ఎల్ వన్, ఎల్ టు, సమ స్యలను పరిష్కరించాలని ,మిషన్ భగీరథ కింద అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందిం చు కుని తాగు నీటి సమస్య లేకుండా చూడాలని సూచించారు.
ఎమ్మెల్సీ నెల్లికంట సత్యం, శంకర్ నాయక్ నకిరేకల్ శాస నసభ్యులు వేముల వీరేశం, దేవరకొండ శా స నసభ్యులు బాలు నాయక్, తుం గ తుర్తి శాసనసభ్యులు మందుల సా మేలు, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి నల్గొండ మేయర్ చైతన్య బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లా డా రు.
ఈ సమావేశం ప్రారంభమైన వెంటనే నల్గొండ జి ల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 6 నుండి, జూన్ 12 వరకు ప్రజా పా లన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కా ర్యక్రమాన్ని అమలు చేసేందుకు ఆ దేశించడం జరిగిందని ఇందులో భాగంగా 5 స్థాయిలలో కార్యక్రమా న్ని నిర్వహించడం జరుగుతుందని, గ్రామ, మండల, నియో జక వర్గ, జిల్లా, రాష్ట్రస్థాయిలో కార్యక్రమాలు ఉంటాయని తెలి పారు. అంతే కాకుండా 10 ప్రధాన అంశాలపై కార్యక్రమా ల ను నిర్వహించడం జరు గుతుందని పవర్ పాయింట్ ప్రజెం టేషన్ ద్వారా వివరించారు.
సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, యా దాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ పవార్ లు మాట్లాడారు. ఈ సమా వేశానికి నాగార్జునసాగర్ శా సనస భ్యులు కుందూరు జైవీర్ రెడ్డి, న ల్గొండ, యాదాద్రి భువనగిరి, సూ ర్యాపేట జిల్లాలో అదనపు కలె క్ట ర్లు, అన్ని జిల్లాల అధికారులు, త దితరులు హాజరయ్యారు. అనంత రం జిల్లా కలెక్టర్ సమావేశానికి హా జరైన వారందరి చేత ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై ప్రతిజ్ఞ చేయిం చారు.




