Praja Deveena
Newspaper Banner
Date of Publish : 11 March 2026, 11:25 am Posted by : praja deveena

Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ జిల్లా కలెక్టర్ కీలక వ్యా ఖ్య,దేశంలో జనాభానే అన్నింటికీ ప్రామాణికం కానుంది 

Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: జనాభా అన్నింటికీ ప్రామాణికం కానుందని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ కీలక వ్యాఖ్య చేశారు.బుధవారం జి ల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మం దిరంలో 2027 జనగ ణనపై ఏర్పా టు చేసిన 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కలె క్ట ర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లా డు తూ ఒక దేశానికి జనగణన అతి ముఖ్యమని, ముఖ్యంగా దేశ అభివృద్ధి జనాభాపైనే ఆధారపడి ఉంటుందని, ప్రజల కు అవసరమైన పథకాల రూపకల్పనలో అలాగే ఇతర అం శాలలో జనాభా కీలక పా త్ర వహిస్తుందన్నారు. అన్నింటికీ ప్రామాణికం జనాభానే అని, ఆ ప్రాంత జనాభాను బట్టి ని ధుల కేటాయింపు, అభివృద్ధి ఆధారపడి ఉoటుందని, అం దువల్ల జనగణ ను అందరూ సీరియస్ గా తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన త ర్వాత మొదటిసారిగా జన గణన చేపట్టడం జరుగుతున్నదని, జనగణకై ప్రభుత్వం జా రీ చేసిన నియమ నిబంధనలు, హ్యాండ్ బుక్స్ అన్నిటిని జా గ్రత్తగా చదువుకోవాలని చెప్పారు. జనగణన రెండు వి భా గాలుగా నిర్వహించడం జరుగు తుందని,కుటుంబాలు, మ నుషుల లెక్కలు సేకరించడం జరుగుతుందన్నారు.

2027 జనగణనలో భాగంగా డిజిటల్ పద్ధతిలో జనగణన నిర్వహిం చడం జరుగుతుందని, సరైన సమాచారంతో జన గణన చేపట్టాలని ఆయన కోరారు. జిల్లాలోని తిప్పర్తి మం డలంలో పైలట్ ప్రాజెక్టు పద్ధతిన జనగణన నిర్వహించడం జరిగిందని, ఎన్నికల మాదిరిగానే జనగణనను నిర్వహిం చాల్సిన అ వసరం ఉందని తెలిపారు. జనగణనకు గాను అవసరమైన టెక్నిక ల్ అసిస్టెంట్లు, సూపర్వైజర్లు, ఎ న్యు మరేటర్లను నియమించాలని, చురుకైన వ్యక్తులను నియ మించాలని ఆయన ఆదేశించారు.

రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మాట్లాడుతూ తహ సిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు చార్జ్ ఆఫీసర్లుగా ఉన్నం దు న సరైన వ్యక్తులను సూపర్వైజర్లుగా నియమించాలని, ఆ రుగురు ఎన్యూమరేటర్లకు ఒక సూపర్వైజర్ ను నియమిం చాలని, మార్చి 31 నాటికి వీరిని నియామకం పూర్తిచేయా లని, అలాగే ఈ నెల 12లోగా టెక్నికల్ అసిస్టెంట్లను నియ మించాలని, ఈనెల 21 నుంచి 23 వరకు టెక్నికల్ అసిస్టెం ట్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి 600 నుండి 700 జనాభాకు ఒక ఏన్యూమరేటర్ ను నియమిం చడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.

రాష్ట్ర సెన్సెస్ డైరెక్టర్ కార్యాలయ జాయింట్ డైరెక్టర్ రఘు మాట్లాడు తూ జనగణనలో సూపర్వైజర్ తో పాటు, ఎ న్యూమరేటర్లు, చార్జ్ ఆఫీ సర్ల పాత్ర కీలకమని అన్నారు. జనగణనను ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు ఎప్పటిక ప్పుడు మానిటర్ చేయాలని, 2011లో నిర్వహిం చిన జనగణన 16 సంవత్సరాల తర్వాత తిరిగి ఇప్పుడు నిర్వహించడం జరుగుతున్న దని, ఈ విడత యాప్ లో ఎ న్యుమరషన్ చేయడం జరుగుతుందని, సూపర్వైజర్లు కూ డా ఆన్లైన్లో నే వీటిని సరి చూసుకోవచ్చు అని, పోర్టల్ లో డీ టెయిల్స్ అన్ని నమోదు చేయవలసి ఉంటుందని, జన గణ న డేటా కరెక్ట్ గా ఉండేలా చూ సుకోవాల్సిన బాధ్యత అం దరిపై ఉందని తెలిపారు. ఈ శిక్షణ కార్య క్రమంలో ఆర్డీవో లు, మున్సిపల్ క మిషనర్లు, ఎంపీడీవోలు, తాసిల్దార్లు తది తరులున్నారు.