Tahsildar Arrest Warrant : ప్రజా దీవెన, తి రుమలగిరి సాగర్: నల్లగొండ జిల్లాలోని తిరుమలగిరి (సాగర్) మండ లంలో ఓ భూవివాదం కేసు పెద్ద దుమారం రేపింది.ఈ కే సులో మండల తహసీల్దార్ అనిల్‌పై హెచ్చార్సీ (Human Rights Commission) సీరియస్‌గా స్పందిస్తూ అరెస్ట్ వా రెంట్ జారీ చేయ డం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మా రింది.ఈ వివాదం ఎలా మొదలైంది అంటే, పూర్వాపరాలు ఇలా ఉన్నాయి…
ఓభూమి తగాదాలో తహసీల్దార్ అనిల్ పక్షపాతంగా వ్య వ హరించారని ఆరోపిస్తూ బాధితుడు హెచ్చా ర్సీని ఆశ్ర యిం చాడు. కేసును విచా రించిన కమిషన్, పూర్తి వివరాల తో నివేదిక సమర్పించాలని అప్పటికే తహసీల్దార్‌కు ఆదే శా లు జారీ చే సింది.అయితే ఆ ఆదేశాలను అనిల్ బేఖాతర్ చేయడమే కాకుండా ఒకసారి కాదు, రెండు కాదు పలు మా ర్లు రిమైండర్లు పంపినా స్పందన లేకపోవడంతో కమిషన్ అ సహనం, ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇక చివరిగా 09 డిసెంబర్ 20 25 న షరతులతో కూడిన ఉత్తర్వు జా రీ చేస్తూ 18 ఫిబ్రవరి 2026 ఉదయం 11 గంట లకు కమిషన్ ముం దు నివేదిక సమర్పించాలని స్ప ష్టంగా ఆదేశించింది. కానీ ఆ తేదీకి కూడా నివేదిక ఇవ్వకపో వ డం తో హెచ్చార్సీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చే సింది. అధికారుల నిర్ల క్ష్యాన్ని తేల్చి చెబుతూ చివరికి తహసీల్దార్ అనిల్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
పోలీసులకు కమిషన్ స్పష్టమైన ఆదేశాలు
తిరుమలగిరి సాగర్ మండల తహసీల్దార్‌ను అరెస్ట్ చేయా లని కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 13 ఏప్రిల్ 2026 ఉదయం 11 గంటలకు కమిషన్ ముందు హాజరు ప రచాలని కూడా అందులో పేర్కొంది.ఈ క్రమంలోనే కమిషన్ ఒక షరతు కూడాపెడుతూ తహసీల్దార్ సరైన పూచీకత్తులు సమర్పిస్తే అరెస్ట్ అవ సరం ఉండకపోవచ్చని తెలిపింది.ఇక ఈ వారెంట్ అమలు చేసిన వి వరాల్లో భాగంగా ఎందుకు అమలు కాలేదో తెలియజేస్తూ 13 ఏప్రిల్ 2 026 లోపు కమి షన్‌కు నివేదిక ఇ వ్వాలని పోలీసులకు ఆదేశాలు జారీ చే సింది.
ఈ ఘటనతో జిల్లాలోని అధికార వర్గాల్లో కలకలం రేగింది. హెచ్చా ర్సీ ఇంత కఠినంగా వ్యవహరించ డం వల్ల ప్రభుత్వ అధికారుల్లో కూ డా టెన్షన్ మొదలైనట్టు తెలుస్తోం ది. భూ వివాదo అధికారుల నిర్ల క్ష్యo చివరికి అరెస్ట్ వారెంట్ గా తయారైన ఈ కేసు ఎలాంటి మ లుపు తిరుగుతుందో ఇ ప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమై చర్చోపచర్చలు కొనసా గుతున్నాయి.