Praja Deveena
Newspaper Banner
Date of Publish : 15 March 2026, 1:37 am Posted by : praja deveena

firing in moinabad farmhouse drug party : మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో అర్ధరాత్రి డ్రగ్స్ పార్టీ, పోలీసులపై కాల్పులు, రాజకీయనాయకుల హడావిడి ?

 

firing in moinabad farmhouse drug party: ప్రజా దీ వెన హైదరాబాద్: హైదరాబాద్‌ నగరానికి దగ్గరలోని మొ యినాబాద్ ప్రాంతం అర్ధరాత్రి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రశాంతంగా కనిపించే ఓ విలాసవంతమైన ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న గోప్యమైన పార్టీ భారీ సంచలనానికి దారి తీ సింది. అక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టు వచ్చిన విశ్వస నీ య సమాచారం ఆధారంగా పోలీసులు దాడి చేశారు. కానీ అక్కడ వారిని ఎదుర్కొన్నది అసాధారణం పరిస్థితులు అని తెలుస్తోంది.

సోదాలకు వెళ్లిన ఈగల్ టీమ్ పోలీసులు ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించగానే అక్కడ ఉన్న కొందరు యువకులు హడావుడి సృష్టించారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారి, ఒక్కసారి గా కాల్పులు కూడా జరిగినట్టు పోలీసులు అనుమానిస్తు న్నారు. సుమారు మూడు రౌండ్ల వరకు కాల్పులు జరిగాయ ని సమాచారం.ఈ ఫామ్‌హౌస్ తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. అ క్కడ జరిగిన పార్టీ సాధారణ పార్టీ కాదని, డ్రగ్స్ వినియో గం తో జరిగిన ప్రత్యేక సమావేశమని అధికారులు చెబుతున్నా రు.

పోలీసులు ఫామ్‌హౌస్‌లో సోదాలు నిర్వహించగా కొకైన్‌తో పాటు ఒక రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోం ది. డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానిస్తున్న ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ పా ర్టీకి వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు కూడా హాజర య్యారని అనుమానం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ గోదా వరి జిల్లాకు చెందిన ఒక ఎంపీ, అలాగే రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే కూడా అక్కడ ఉన్నట్టు సమాచా రం బయటకు వచ్చింది. దీంతో కేసు మరింత రాజకీయ రంగు దాల్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

పోలీసుల ఈగల్ టీమ్‌కు సహాయంగా ఎస్వోటీ బలగాలు కూడా రంగంలోకి దిగాయి. ఫామ్‌హౌస్ మొత్తం తనిఖీ చేసి మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. పార్టీలో రాజకీయ నా యకులు మరియు వీఐపీలు పాల్గొన్నారనే అనుమానంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మొయి నాబాద్‌లో జరిగిన ఈ అర్ధరాత్రి డ్రగ్స్ పార్టీ, కాల్పుల కలక లం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. అసలు అక్కడ ఏమి జరిగింది? ఇంకా ఎవరు ఎవరు పా ల్గొన్నారు? అన్నది పోలీసుల దర్యాప్తులో బయటపడాల్సి ఉంది.