Praja Deveena
Newspaper Banner
Date of Publish : 19 March 2026, 9:39 am Posted by : praja deveena

CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ రెడ్డి కీలకప్రకటన, తెలంగాణలో సాదాబైనామా భూములకు త్వరలో పరిష్కారం

 

CM Revanth Reddy:   ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణలో సాదాబైనామా భూములకు సంబంధించి తొందర లోనే పరిష్కా రం చూపించబోతున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభదినం సందర్భంగా ప్ర కటిం చారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతును రాజుగా నిల బెట్టాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నామని చె ప్పారు. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతి శాఖ, దేవా దాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ని ర్వహించిన శ్రీ పరాభవనామ ఉగాది వేడుకల్లో ముఖ్యమం త్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి పా ల్గొన్నారు.

శ్రీ పరాభవ నామ ఉగాది పంచాంగాన్ని ముఖ్యమంత్రి ఆవి ష్కరించా రు. ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ప్రజలు సుఖ శాంతులతో వర్థిల్లాలని ఈ సందర్భంగా భగవంతుడిని ప్రా ర్థించారు. ఈ నెల 22న రైతు భరోసా అందించబోతున్నా మ ని తెలియజేస్తూ రైతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రై తు సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ప్రభుత్వం పని చేస్తుం దని ముఖ్యమంత్రి పునరుద్ఘాటిస్తూ..“ధరణి రూపంలో భూ తమై రైతులను బాధ పెడుతున్న సందర్భంగా రైతులకు అం డగా దాన్ని తరిమేసి భూ భారతితో రైతాంగ సమస్యలను పరిష్కరిస్తున్నామని, సాదాబైనామాకు సంబంధించి తొంద రలోనే పరిష్కారం చూపించబోతున్నామని స్పష్టం చేశారు.

సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రైతాంగాన్ని గట్టెక్కించడా నికి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు బోనస్ కూడా ఇచ్చి ఆదుకుంటున్నామని, కేంద్ర ప్ర భుత్వం ప్రకటించిన లెక్కల మేరకు దేశంలో అతితక్కువ రు ణ భారం కలిగిన రైతులున్న రాష్ట్రా ల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉండటం గర్వకారణమన్నారు. పరిశ్రమలు ఎన్ని వచ్చినా, ఐటీ రం గాలు ఎంతగా రాణించినప్పటికీ రాష్ట్రం లో ఇప్పటికీ ప్రధాన జీవనాధారం వ్యవసాయమేనని, రైతు లు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుం టుందని, రాష్ట్రంలో 25. 35 లక్షల రైతు కుటుంబాలకు రూ. 20,616 కోట్ల మేరకు రు ణమాఫీ చేసి రైతు లను ఆత్మగౌరవంతో బతకడానికి ప్రభు త్వం ఎంతో కృషి చేసిందని వివరించారు.

ప్రతి ఎకరాకు రూ.12 వేల చొప్పున రైతు భరోసా అందిస్తు న్నామని, ఇప్పటికే ప్రభుత్వం 18 వేల కోట్ల రూపాయలు రై తు భరోసా కింద అందించిందని, పండించిన పంటలపై రై తుల్లో విశ్వాసం కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దే శం అని తెలిపారు. వ్యవసాయ రంగానికి ఉచిత కరెంట్, పంటలకు గిట్టు బాటు ధర కల్పించడం, రుణమాఫీ చేయ డం, రైతుభరోసా అందించ డంతో పాటు రైతు బీమా అమ లు చేయడం వంటివన్నీ రైతు సంక్షేమం, అభివృద్ధి కోసం తీ సుకున్న నిర్ణయాలని పేర్కొన్నారు.

ప్రభుత్వం రైతుల కోసం ప్రయత్నాలు, నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టు లు, సంక్షేమం కోసం అమలు చేస్తు న్న పథకాలన్నీ దేశంలో తెలంగాణ ప్రతిష్టను పెంపొదిస్తాయి. మన పొ లా ల్లో సమృద్ధిగా పంటలు పండిన ప్పుడే రాష్ట్రం సుఖశాంతు లతో విలసిల్లుతుందని అన్నారు.

ఈ వేడుక సందర్భంగా ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ బా చంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. కార్యక్రమంలో రా ష్ట్రంలోని వివిధ ఆలయాలకు చెం దిన అర్చకులను ముఖ్యమంత్రి స త్కరించారు. ఈ కార్యక్రమం లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగు లేటి శ్రీనివాస రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, పిసిసి అధ్య క్షుడు ఎమ్మె ల్సీ మహేష్ కుమార్ గౌడ్ , పలు వురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పా ల్గొన్నారు.