Praja Deveena
Newspaper Banner
Date of Publish : 04 April 2026, 1:23 pm Posted by : praja deveena

Cm Revanth Reddy: బిగ్ బ్రేకింగ్, ఈనెల 6న బాసరలో శ్రీజ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధికి సీఎం శంకుస్థాపన

 

Cm Revanth Reddy :ప్రజా దీవెన, హైదరాబాద్: బాసర లోని పవిత్ర శ్రీ జ్ఞాన సరస్వతి దే వ స్థానం అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను ముఖ్య మం త్రి ఎ. రేవంత్ రెడ్డి పరిశీలించారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, ఆ గ మ శాస్త్రం ప్రకారం ఆలయ అభి వృద్ధి జరగాలని చెప్పారు.

నిర్మల్ జిల్లా గోదావరి నది ఒడ్డున ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని ప్రభుత్వం 225 కోట్ల రూపాయల తో అభివృద్ధి చేస్తోంది. ఇందుకు సం బంధించిన మాస్టర్ ప్లాన్‌ ను అధికా రులు వివరించగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఈ నెల 6వ తేదీన ఈ ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్య మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.

భవిష్యత్ అవసరాలకు అనుగు ణంగా, భక్తుల రద్దీని దృష్టి లో ఉంచుకుని సువిశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసు కోవాలని చెప్పారు. భక్తుల విశ్వాసాలు దెబ్బతిన కుండా ఆ లయ అభివృద్ధి అద్భు తంగా ఉండాలని, ఆలయ పవిత్ర త కు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశించారు.

తిరుమల తిరుపతి తరహాలో అన్ని ఆలయాల పరిసరాల్లో ఎలాం టి రాజకీయ కార్యకలాపాలకు తావు లేకుండా నిబం ధనలు ఉండాలని చెప్పారు. ఆలయ పరిసరాల్లో ఈవీ వా హనాలను మాత్రమే వినియోగించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదా రు సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీని వా సరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామ య్యర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.