Praja Deveena
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 10:51 am Posted by : praja deveena

telangana arrive alive campaign : నల్లగొండ ఎస్పీ శరత్ పవార్ కీలకవ్యాఖ్య, గోల్డెన్ అవర్ లో సహాయ పడినవారికి నగదు ప్రోత్సాహం

 

telangana arrive alive campaign : ప్రజా దీవెన, మి ర్యాలగూడ: నల్ల గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక ఏఆర్సి ఫంక్షన్ హాల్‌ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఐదవ రోజు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భ ద్రతా వారో త్సవాల సందర్భంగా ప్రత్యేక అవగాహన కా ర్య క్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మిర్యా ల గూడ నియోజకవర్గ ఎమ్మెల్యే బ త్తుల లక్ష్మారెడ్డి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రజలకు రోడ్డు భద్రతా ని బంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రతి ఒక్క రూ బాధ్యతతో వ్యవహరిస్తేనే రో డ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రమాద రహిత సమాజాన్ని ని ర్మించవచ్చని పేర్కొన్నారు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ హెల్మెట్ ధరిం చడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, హెల్మెట్ లే కుండా వాహ నం నడిపితే ప్రమా దాల్లో ప్రాణ నష్టం జరిగే అవకాశా లు ఎక్కువగా ఉంటాయని హెచ్చ రించారు. గత ఏడాది జిల్లా లో జరి గిన రోడ్డు ప్రమాదాల్లో సుమారు 3 50 మంది మృతి చెందగా, వారిలో 90 శాతం మంది హెల్మెట్ ధరించని వారేన ని తెలిపారు. అవగాహన కా ర్యక్రమాల అనంతరం హెల్మెట్ లేని వారిపై జరిమానాలు విధించడంతో పాటు కేసులు న మోదు చేస్తామని స్పష్టం చేశారు.

గత ఏడాది మిర్యాలగూడ డివిజ న్‌లో 93 మంది రోడ్డు ప్ర మాదాల్లో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపా రు. అలాగే ఎక్క డైనా రోడ్డు ప్రమా దం జరిగితే తక్షణమే 100 లేదా 1 08 కు సమాచారం ఇవ్వాలని సూ చించారు. రోడ్డు ప్రమాదం జరి గిన వెంటనే మొదటి గంటను ‘గోల్డెన్ అవర్’ అని పిలుస్తా రని, ఈ సమ యంలో బాధితులకు తక్షణ వైద్య సేవలు అం దితే ప్రాణాలను కాపా డే అవకాశాలు ఎక్కువగా ఉంటా యని వివరించారు. ప్రమాదం జరి గిన వెంటనే బాధితు ల ను సమీప ఆసుపత్రికి తరలించడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు.

రోడ్డు ప్రమాద బాధితులను ఆసు పత్రికి తరలించిన వారికి రహవీర్ పథకం ద్వారా మొదటిసారి రూ. 25,000, రెండో సారి రూ.50,000, మూడోసారి రూ.1 లక్ష వరకు పరి హారం అందిస్తారని తెలిపారు. ఇటీ వల జిల్లాలో వెంకన్నకు రూ.2 5 వే ల పరిహారం అందిన విషయాన్ని కూడా వెల్లడించారు. రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలిస్తే పోలీసుల తో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లా డుతూ మిర్యాలగూడ పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరు గుతున్నందు న ట్రాఫిక్ సిబ్బంది సం ఖ్యను పెంచాల్సిన అవసరం ఉంద న్నారు. రోడ్డు ప్రమాదాల్లో బాధితు లకు సహాయం అందిం చడంలో పో లీస్ కేసులు అవుతాయని భయప డుతున్న ప్రజలకు ప్రభుత్వం భరో సా కల్పించాలని సూచించారు.
మిర్యాలగూడ పట్టణంలోని హైవేల వెంట ఉన్న మద్యం దుకాణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నందున వాటిపై తగిన చర్యలు తీసు కోవాలని కోరారు.

అలాగే మిర్యాలగూడలో ట్రాఫిక్ ని యంత్రణకు ట్రాఫిక్ సి గ్నల్స్ ఏర్పా టు చేయడానికి తమ వంతు స హ కారం అం దిస్తామని తెలిపారు. హె ల్మెట్ లేనివారికి జరిమానాలు వి ధించడం కంటే, హెల్మెట్ కొనుక్కొని వస్తేనే వాహనం ఇవ్వా లని ప్రజల్లో చైతన్యం తీసుకురావడం అవసర మని అభి ప్రాయపడ్డారు. రోడ్డు ప్ర మాదాల వల్ల అనేక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున ప్రతి ఒక్కరూ నిబంధన లు పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని పిలు పునిచ్చారు.

అలాగే ప్రమాదంలో గాయపడిన వారికి ఇవ్వవలసిన ప్రథ మ చికిత్స (First Aid) విధానాలను ప్రదర్శన ద్వారా చూ పించి ప్రజలకు అవగా హన కల్పించారు.అనంతరం రోడ్డు భద్రతా నిబంధనలు పాటించే వి ధంగా ప్రతిజ్ఞ చేయిం చారు.ఈ కా ర్యక్రమంలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, వన్ టౌన్ సీఐ నా గభూషన్, టూ టౌన్ సీఐ సోమనర సయ్య, రూరల్ సీఐ పీఎన్‌డీ ప్రసా ద్, మున్సిపల్ చైర్‌ప ర్సన్ చిలు కూరు సుధాబాలకృష్ణ, వైస్ చైర్‌ పర్సన్ గుడి పా టి శిరీష నవీన్, ఆ ర్టీవో, ఆర్టీసీ డీఎం, వైద్యాధికారులు, డ్రై వర్లు మరియు స్థానిక ప్రజ లు పాల్గొన్నారు.