Praja Deveena
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 3:22 pm Posted by : praja deveena

Nalgonda Collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్, ఎస్పీల కీలక ఆ దేశాలు, జిల్లాలో అక్రమ ఇసుక, చె రువుల మట్టి తవ్వకాలపై కఠిన చ ర్యలు తీసుకోవాలి 

Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో అక్రమ ఇసుక, చెరువుల మట్టి తవ్వకాలపై కఠిన చర్యలు తీ సుకోవాలని జిల్లాకలెక్టర్ బడు గు చంద్రశేఖర్ అధికారులను ఆదేశిం చారు. శుక్రవారం కలె క్టరేట్ వీడి యో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ చంద్ర శేఖర్, జి ల్లా ఎస్పీ శరత్ చం ద్ర పవార్ లు సంయుక్తంగా ఆర్డిఓ లు, తహసిల్దారులు డీఎస్పీలు, ఎంపీడీవోలు, ఎస్‌ఎస్‌వోలతో ని ర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ ని ర్వహించారు.

జిల్లా కలెక్టర్ చంద్ర శేఖర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా పర్మిషన్ లేకుండా ఇసుక తవ్వకాలు నిర్వ హిస్తే సంబంధిత వాహనాలను త క్షణమే సీజ్ చేయాలని స్పష్టం చేశారు. చె రువుల నుండి మట్టి తీస్తే కూ డా అనుమతి లేకుండా చేస్తే వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. ప్రభుత్వ అవసరాల కోసం మట్టి తీసుకో వాలంటే తప్పనిసరి గా అనుమతులు తీసుకోవాలని పేర్కొ న్నారు.ప్రజలకు అవసరమైన మేరకు ఇసుకను లీగల్‌గా అందుబాటులో ఉంచాలని, కొత్తగా అవసరమైన ప్రాంతాల్లో ఇసుక రీచ్‌ల ను ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు. అనేశ్వరం గుట్ట చెరు వు, కనగల్లు తిమ్మన్నగూడెం చెరు వు ల వద్ద అక్రమ తవ్వకాలపై ప్ర త్యేక నిఘా ఉంచి కఠిన చర్య లు తీసుకోవాలని హెచ్చరించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవస రమైన ఇసుకను ప్రభుత్వ నిబంధ నల ప్రకారం,రవాణాతో అందించే విధంగా చర్యలు చేపడతామని తె లిపారు. అలాగే వేములపల్లి మం డలం బొమ్మకల్లు, రావులపెంట ప్రాంతాల్లో కొత్తగా రెండు ఇసుక రీ చ్‌లను ఏర్పాటు చేయాలని సూ చించారు. దేవరకొండలో కూడా ఇ సుక రీచ్ అవసరాన్ని పరిశీలించి ఏర్పాటు చేయాలని తెలిపారు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మా ట్లాడుతూఅక్రమ తవ్వ కాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించవద్దని స్పష్టం చేశా రు. ఎక్కడైనా అక్రమ ఇసుక రవాణా లేదా మట్టి తవ్వ కా లు కనిపిస్తే వెంటనే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటా రని హెచ్చరించారు. సంబంధిత వాహనా లను సీజ్ చేసి, ని బంధనల ప్రకా రం కేసులు నమోదు చేస్తామని తెలిపారు. డ్రైవర్లతో ప్రత్యేక సమా వే శాలు నిర్వహించి లీగల్ విధా నా లపై అవగాహన కల్పించాలని అధి కారులకు సూచించారు. రెండు మూడు రోజుల్లో జిల్లాలో పూర్తిగా అక్రమ తవ్వకాల ను నియంత్రించే లా పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వ యంతో పనిచేయాలని ఆదేశించారు.

జిల్లా అభివృద్ధి, ప్రజల అవసరాల దృష్ట్యా ఇసుక సరఫరా పూర్తిగా చ ట్టబద్ధంగా జరగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసు కుంటామని ఎస్పీ పే ర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రెవిన్యూ అదనపుకలెక్టర్ జె శ్రీ నివాస్. స్థానిక సంస్థల ఇం చార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి మైనింగ్ జిల్లా అధికారి శ్రీనివాస్ పా ల్గొన్నారు.