Telangana Police SpecialLeave Go : ప్రజా దీవెన, హైదరాబాద్: అహ రహం విధులు, అలుపెరుగని పోరాటం కుటుంబానికి దూ రంగా సమా జ రక్షణే ధ్యేయంగా బతికే ‘ఖాకీ’లకు తెలంగా ణ ప్రభుత్వం ఒక తీపికబురు అందించిం ది. ఇకపై పోలీస్ సి బ్బంది తమపుట్టినరోజుతో పాటు వివా హవార్షికోత్సవాలను కు టుంబ సభ్యులతో కలిసి సంతోషం గా జరుపుకోవచ్చన్న శుభవార్త అం దించింది. సమాజం నిద్ర పోతున్న వేళ మన రక్షణ కోసం నిద్రాహారాలు మాని విధి ని ర్వహణలో నిమ గ్న మయ్యే పోలీసులు కూడా మ నుషులే, వారికి కూడా సంతో షాలు ఉంటాయి, కుటుంబ బాధ్యతలు ఉంటాయి. నిరంత రం ఒత్తిడిలో ఉండే పోలీస్ సిబ్బందికి కొంత మానసిక ప్రశాం తతను, కుటుంబంతో గడిపే సమ యాన్ని కల్పించాలనే గొప్ప లక్ష్యంతో తెలంగాణ పోలీస్ శా ఖ సరికొత్త సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
పోలీస్ శాఖ తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఇకపై రాష్ట్రం లోని ప్రతి పోలీస్ అధికారి, సిబ్బం దికి తమపుట్టిన రోజు వివాహ వా ర్షికోత్సవం రోజున సెలవు పొందే అ వకా శం ఉంటుంది. హోదాతో సం బంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వెసులుబాటును పొందవచ్చు. పో లీస్ వృత్తి అత్యంత కఠినమైనది. సెలవుల గురించి ఆలోచించే తీరిక కూడా లేని ఎంతో మంది సిబ్బంది తమ వ్యక్తిగత జీవితాన్ని పణంగా పె ట్టి విధిని నిర్వహిస్తుంటారు.
ఈ అంకితభావానికి ప్రశంసాసూచికగా వారి పని-జీవిత స మతుల్యతను (Work-Life Balance) మెరుగుపరిచేందు కు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నా రు. కుటుంబంతో కలిసి ఈ ముఖ్యమైన రోజులను జరు పు కోవడం వల్ల సిబ్బందిలో నైతిక స్థైర్యం పెరుగుతుందని, పని లో మరింత ఉత్సాహంగా పాల్గొంటారని ప్రభుత్వం భావి స్తోంది.ఈ వెసు లు బాటు పొందేటప్పుడు సిబ్బంది కొన్ని ని బంధనలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.
సెలవు కావాలనుకునే సిబ్బంది తమ అధికారులకు ముంద స్తుగా లిఖితపూర్వక అభ్యర్థనను సమర్పించాలని, సర్వీస్ రిజిస్టర్‌లో ఉ న్న వివరాల ఆధారంగానే సెలవు మంజూరు చేస్తారు. అయితే దీనిని హక్కుగా పరిగణించరాదని, అత్య వసర పరిస్థితులు (ఉదాహరణకు శాంతిభద్రతల సమస్య లు, ప్రధాన బందోబస్తులు) ఉంటే తప్ప, ఉన్న తాధికారులు ఈ సెలవును నిరాకరించకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉ న్నాయి.
“సిబ్బంది ఆరోగ్యమే.. శాఖ బలం” అనే నినాదంతో తెలంగా ణ ప్రభు త్వం తీసుకున్న ఈ నిర్ణయం పోలీ సు వర్గాల్లో హ ర్షాతిరేకాలను నిం పుతోంది. కఠినమైన ఖాకీ దుస్తుల వెనుక ఉండే మనిషిలోని భావోద్వే గాలను గుర్తించి, వారికి చిన్న పాటి సంతోషాన్ని అందించే ప్రయత్నంగా అభివర్ణిస్తున్నారు.
