Praja Deveena
Newspaper Banner
Date of Publish : 02 May 2026, 8:47 am Posted by : praja deveena

SP Sharath Chandra Pawar : నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ కీలక వ్యాఖ్య, భవిష్యత్తును మింగే సే నిశ్శబ్ద శత్రువు డ్రగ్ మహమ్మారి 

SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ:ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కా ర్య చరణలో భాగంగా మాదకద్ర వ్యాల దుర్వినియోగం నివారణపై అవగా హన కల్పించేందుకు పోలీస్ శాఖ, ఉమెన్ & చైల్డ్ సేఫ్టీ విభాగం ఆధ్వ ర్యంలో నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద అవగాహన సద స్సు నిర్వహించబడింది.ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ జిల్లా ఎస్పీ శర త్ చంద్ర పవార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చం ద్ర పవార్ మాట్లాడుతూ మాదకద్ర వ్యాల వినియోగం వ్యక్తిగత ఆరో గ్యానికే కాకుండా కుటుంబం మరి యు సమాజానికి తీవ్ర హానిని కలి గిస్తుందని తెలిపారు. ముఖ్యంగా యువత చెడు స్నేహితుల ప్రభా వం, ఆసక్తి లేదా ఒత్తిడి కారణంగా డ్రగ్స్ వైపు మళ్లడం ప్రమాదకర మని హెచ్చరించారు.

డ్రగ్స్ వినియోగం వల్ల మెదడు, గుండె, కాలేయం వంటి ముఖ్య అ వయవాలు దెబ్బతింటాయని, మా నసికంగా ఆందోళన, డిప్రెషన్ వం టి సమస్యలు తలెత్తుతాయని పే ర్కొన్నారు.అలాగే చదువుపై దృష్టి కోల్పోవడం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, నేరాలకు దారి తీసే పరిస్థితులు ఏర్పడవచ్చని తె లిపారు. ఎవరైనా డ్రగ్స్ ఆఫర్ చేసి నప్పుడు స్పష్టంగా “కాదు” అని చె ప్పాలని, చెడు స్నేహితులను దూ రంగా ఉంచుకోవాలని సూచించా రు. అనుమానాస్పద కార్యకలాపా లు గమనించినప్పుడు వెంటనే 10 0 లేదా 1908 నంబర్లకు సమాచా రం ఇవ్వాలని కోరారు. డ్రగ్స్ విని యోగం చట్టపరంగా నేరమని, దీని పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలంటే చెడు అలవాట్లు, వ్యసనాలను దూరంగా ఉంచుకోవాలని సూచించారు. యువత క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలని, ఆరోగ్యకర మైన జీవనశైలిని అలవాటు చేసు కుంటేనే విజయాన్ని సాధించగల రని తెలిపారు. సమాజ అభివృద్ధి లో యువత కీలక పాత్ర పోషిస్తార ని పేర్కొన్నారు. అనంతరం డ్రగ్స్ వినియోగం పై వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, టూ టౌన్ సిఐ రాఘవరావు, వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ట్రా ఫిక్ సిఐ మహాలక్ష్మయ్య, ఉమెన్ & చైల్డ్ సేఫ్టీ అధికారి కృష్ణవేణి, సి బ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.