Praja Deveena
Newspaper Banner
Date of Publish : 03 May 2026, 3:35 pm Posted by : praja deveena

Five states elections results : బిగ్ బ్రేకింగ్, ఐదురాష్ట్రాల ఎన్నికల కౌంట్ డౌన్ ప్రారంభం, దేశవ్యాప్తంగా ఉత్కంఠభరితం

 

Five states elections results : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశ వ్యా ప్తంగా ఐదు రాష్ట్రాల్లో తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది. రేపు ఉదయం 8 గంటలతో భారత రాజకీ యాల్లో మరో కీలక మలుపు తి రగబోతోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లె క్కిం పు ప్రారంభమై దేశ రాజకీయ భవిష్యత్తును కొత్త దిశలో న డిపే ఫలితాలు వెలువడనున్నాయి.

మమతా బెనర్జీ(Mamata Banerjee), ఎంకె స్టాలిన్(M. K. Stalin), మమత బిశ్వశర్మ (Himanta Biswa Sarma), పి నరయి విజయన్ (Pinarayi Vijayan) వంటి కీలక నేతల రాజకీయ భవితవ్యం ఈ కౌంటింగ్‌తో స్పష్టమవుతుంది. ప్ర జలతీర్పు ఎవరి పక్షాన నిలుస్తుందో అన్న ఉత్కంఠ దేశవ్యా ప్తంగా పెరిగింది.

పశ్చిమ బెంగాల్, తమిళనాడు రా ష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ వి భిన్న సంకే తాలు ఇవ్వడంతో ఈ రెండు రా ష్ట్రాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకృత మైంది. ఎవరు అధికారం చేపడతారన్న ప్ర శ్నకు సమాధానం రేపటితో లభించనుంది.

మొత్తం సీట్ల పరంగా చూస్తే పశ్చి మ బెంగాల్‌లో 294, తమిళనాడు లో 234, అస్సాంలో 126, కేరళలో 140, పు దుచ్చేరిలో 30 స్థానాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ప్రతి సీటు వెనుక రాజకీయ సమీకరణాలు, వ్యూహాలు, ప్రజల ఆశలు దా గి ఉన్నాయి.ఇదిలా ఉండగా కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను అమలు చేసింది.

ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో రి కార్డు స్థాయిలో నమోదైన 93% పో లింగ్ ఈ ఎన్నికలకు మరింత ప్రా ముఖ్యతను తె చ్చింది. ఇదే సమ యంలో కౌంటింగ్ సూపర్వైజర్ల ని యా మకంపై వచ్చిన అభ్యంతరాల ను సుప్రీంకోర్టు తిరస్కరిం చడం కూడా చర్చనీయాంశమైంది. ఎన్నికల ప్రక్రియ పారద ర్శకతపై దేశవ్యాప్తంగా దృష్టి నిలిచింది.

ఇప్పుడు ప్రశ్న ఒక్కటే ఓట్ల మా ర్పులు, వ్యూహాలు, ప్రజాభి ప్రాయం చివరకు ఎవరి వైపు మొగ్గు చూపుతాయి. రేపటి ఫలితాలు కే వలం ప్రభుత్వాలను మాత్రమే కాదు, భవిష్యత్ రాజకీయ సమీకరణాలను కూడా మలిచే శక్తిగా నిలవను న్నాయి.