Praja Deveena
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 1:43 pm Posted by : praja deveena

Nalgonda MLC Nellikanthi Satyam : నల్లగొండ ఎమ్మెల్సీ నెల్లికంటి స త్యం కీలక వ్యాఖ్య, వాణిజ్య పం టల సాగువైపు రైతు పయనo 

Nalgonda MLC Nellikanthi Satyam : ప్రజా దీవెన, మునుగోడు: ప్రజా పా లన ప్రగతి ప్రణాళికలో భాగంగా ము నుగోడు నియోజకవర్గంలో రై తు వారోత్సవాలు ఘనంగా నిర్వ హించారు. మునుగోడు నియోజ క వర్గ రైతుల భవి ష్యత్తును లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన అవగాహన కా ర్యక్రమం కొత్త ఆలోచనలకు నాంది పలికిందని చెప్పవచ్చు. ము నుగోడు నియోజకవర్గo లెంకలప ల్లి గ్రామంలోని ఓ ఫం క్షన్ హాల్‌లో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మంగళవారo జరి గిన సమావేశంలో సం ప్రదాయ పంటల నుంచి ఆధునిక మ రియు లాభదాయక వ్యవసా య విధానాల వైపు రైతులను మళ్లించే దిశగా కీలకంగా నిలిచింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనమండలి స భ్యు లు నెల్లికంటి సత్యం ఈ సందర్భంగా మాట్లాడుతూ మునుగోడు ప్రాంతానికి ఉన్న ప్రత్యేక అవకాశాలను రైతు ల కు గుర్తుచేశారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న ఈ ప్రాం తం, కూరగాయలు, పండ్లు, పూల సా గుకు అనుకూలమని పేర్కొన్నారు. స్థానికంగా ఉత్పత్తి పెంచితే ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన అవస రం తగ్గుతుందని చెప్పారు.

ఆయి ల్ పామ్ సాగు రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అం దించగలదని, నీటి వనరులు ఉన్న రైతులు ఈ పంటపై దృ ష్టి పెట్టాలని సూచించారు.చండూర్ మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఇంటి కీ అవసరమైన కూరగా యల కోసం రైతులు ముందుకు రావాలని పిలు పునిచ్చా రు. ప్రత్యేకంగా వాణిజ్య పంటల సాగు పై రైతులు దృష్టి సారిస్తే ఆదాయ మార్గాలు అంత కంతకు పెరుగుతాయని వివరిం చారు.

మునుగోడు ఆత్మా చైర్మన్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లా డుతూ సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యత ను వివరించి, ఆరోగ్యకరమైన ఆ హారం కోసం రైతులు సహజ పద్ధ తుల ను అనుసరించాలని సూచించారు. రాష్ట్ర రాజధాని హైద రాబాద్ కు సమీపంలో ఉన్నందున కూ రగాయలు, పండ్లు సాగు ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని సూ చించారు. ఉద్యాన అధికారి రావుల విద్యాసాగర్ మాట్లా డుతూ ఉద్యాన పంటలు రైతుల కు అధిక లాభాలను అం దిస్తాయ ని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం సాధ్యమ ని వివరించారు. ప్ర భుత్వ పథకాలు, సబ్సిడీలు రైతు లకు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు.

వ్యవసాయ శాఖ ఏడిఏ వేణుగోపాల్ పత్తి మరియు వరి పంటలతో పాటు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగు ద్వారా స్థిరమైన ఆదా యం పొందవచ్చని వివరించారు. ఉ ద్యాన శాస్త్రవేత్త జి. విజయ్ కృష్ణ ఆయిల్ పామ్ పై ప్రభు త్వం అంది స్తున్న సబ్సిడీలను వివరించడంతో పాటు, కొండ మల్లేపల్లి పరిశోధన కేంద్రంలో నాణ్యమైన మొక్కలు అందు బాటులో ఉన్నాయని తెలి పారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్ర తి నిధులు, అధికారులు, పతంజలి సంస్థ ప్రతినిధులు మరి యు పెద్ద సంఖ్య లో రైతులు పాల్గొని, భవిష్యత్ వ్యవ సా యంపై ఆసక్తికర మై న చర్చలు జరిపారు.