Praja Deveena
Newspaper Banner
Date of Publish : 24 May 2026, 4:29 pm Posted by : praja deveena

Nalgonda Employees Transfers transparency : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక ప్రకటన, పారదర్శకంగా జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు 

Nalgonda Employees Transfers transparency :  ప్రజా దీవెన నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా లో ప్రభుత్వ ఉద్యో గుల బదిలీలను పారద ర్శకంగా నిర్వహిస్తున్న ట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలి పారు. ఆదివారం ఉదయా ది త్య భవన్లో నిర్వహించిన గ్రేడ్ వన్, గ్రేడ్ 2 ,గ్రేడ్ 3 పంచాయతీ కార్యదర్శుల బదిలీల కార్య క్రమానికి ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా బదిలీల ప్రక్రియపై పంచాయతీ కార్యదర్శు లకు ఆయ న క్షుణ్ణంగా వివరించారు.రాష్ట్ర ప్ర భుత్వం ప్రభు త్వ ఉద్యోగుల బది లీలపై జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం బ దిలీలకు అర్హత ఉన్న ఉద్యో గుల జాబితాను రూపొందిం చడం జరిగిందని,వారు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ప్రత్యేక కేట గిరీలకు ప్రాధా న్యత ఇస్తూ బదిలీలు చేపట్టినట్టు వెల్లడించా రు.

జిల్లాలోని అన్ని శాఖలలో బదిలీల ను పూర్తి పారదర్శకంగా, నియమ నిబంధనల ప్రకారం నిర్వహించడం జరుగుతున్న దని తెలిపారు . బదిలీల సందర్భంగా భార్యాభర్తల కేసులు, వైద్య కారణాలు, ఇతర అన్ని రకాల కేటగిరీలను పరిగణన లోకి తీసుకొని బదిలీలు చేపట్టడం జరిగిందని ,ఎలాంటి బం ధుప్రీతి, ఎలాంటి ఆశ్రిత పక్షపాతం లే కుం డా పూర్తి పారద ర్శకంగా బదిలీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. అదే విధంగా పంచాయతీ కా ర్యదర్శుల బదిలీలను సైతం చేప ట్టడం జరిగిందని చెప్పారు.

స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు క లెక్టర్ వై. అశోక్ రెడ్డి, జి ల్లా పంచా యతీ అధికారి శంకర్ నాయక్, తదితరులు ఉ న్నారు. అనంతరం జి ల్లా పరిషత్ లో నిర్వహించిన ఉద్యో గుల బదిలీల ప్రక్రియకు జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. జడ్పి సిఓ ప్రేమ్ కరణ్ రెడ్డి ఉన్నారు.

మహిళా వారోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

నల్లగొండ: ప్రజా పాలన ప్రగతి ప్ర ణాళిక 99 రోజుల కార్యక్ర మంలో భాగంగా ఈనెల 25 నుండి 30 వరకు నిర్వహించ నున్న మహిళా వారోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చాలని రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చెప్పారు.ఆదివారం ఆమె హైదరా బాద్ నుండి మహిళా వారోత్సవం పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించా రు.

మహిళల అభివృద్ధికి రాష్ట్ర ప్రభు త్వం కట్టుబడి ఉందని, మహిళా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణా లు అందిస్తున్నద ని తెలిపారు.మహిళా వారోత్సవం సంద ర్భంగా వివో భవనాలు, అంగ న్‌వాడీ భవనాల ప్రారంభోత్స వా లు చేపట్టాలని తెలిపారు. సెర్ప్ ద్వారా 300 మంది మ హిళలకు రుణాలు అందించనున్నమని, స్త్రీ నిధి ద్వారా రూ. 20 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపా రు.

మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టాలని, మ హిళా సం ఘాలకు మరింత ఆర్థిక ప్రోత్సా హం అందిం చాల ని అధికారులకు ఆదేశించారు. మహిళా వారోత్సవాన్ని విజ యవంతం చేయాలని మం త్రి కోరారు. జిల్లా కలెక్టర్ బి చం ద్ర శేఖర్, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణ వేణి, డి ఆర్ డిఓ శేఖ ర్ రెడ్డి, మె ప్మా పిడి శ్రీ నివాస్ తదితరులు ఈ వీడియో కా న్ఫరెన్స్ కు హాజరయ్యారు.