Praja Deveena
Newspaper Banner
Date of Publish : 28 May 2026, 8:26 am Posted by : praja deveena

Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీల క వ్యాఖ్య,త్యాగానికి, విశ్వాసానికి ప్రతీక బక్రీద్ పర్వదినం 

Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: త్యాగానికి, విశ్వాసానికి ప్రతీక బక్రీ ద్ అని రా ష్ట్ర రోడ్లు, భవనాలు, సి నిమాటోగ్ర ఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ పట్టణంలో ము నుగోడు రోడ్ లో ఉన్న ఈద్గాలో ముస్లింల ప్రార్థన అనంత రం వారిని కలిసిబక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పండుగ శుభాకాం క్షలు తెలిపారు.

ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం త్యా గం, విశ్వాసం, మానవ తా విలువ లను స్మరించుకుంటూ జరుపుకునే బక్రీద్ పండు గ సమాజానికి ఐక్యత, సహనం, పరస్పర ప్రేమాభిమా నాల సందేశాన్ని అందిస్తుందని మంత్రి అన్నారు. బక్రీద్ పవిత్ర పం డుగ అని, బక్రీద్ పండుగ ప్రతి కుటుంబంలో ఆనందం, శాం తి, సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు.

రాష్ట్ర ప్రజ లంతా సుఖసంతోషా ల తో, ఆరోగ్యంగా ఉండా లని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్ర జలు సోదరభావం తో కలిసి జీవించడం రాష్ట్ర ప్రత్యేక త అని, ఆ స్ఫూర్తి మరింత బల ప డాలని మంత్రి ఆకాంక్షిం చారు. గతంలో తమ ప్రభుత్వం అధికారం లో ఉన్న సమ యంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించామని, వి ద్య మరియు ఉపాధి రంగాలలో అవకాశాలు అందించామ ని తెలిపారు.

ముస్లింల కోసం పట్టణ ప్రాంతాల్లో షాదీఖానాల నిర్మాణం చేపడతామని,ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలలో కూడా అవకాశా లు కల్పించామని తెలిపారు.నల్గొండ పట్టణంలో గత 30 సంవత్సరాలుగా ఎలాంటి మ త ఘర్షణలు లేకుండా అన్ని వర్గా ల ప్రజలు కలిసిమెలిసి సోదరభావంతో జీవిస్తున్నారని అన్నారు. ముస్లింల అభివృద్ధికి ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని, ప్రజా ప్రభుత్వం అందరికీ సంక్షేమాన్ని అంది స్తుందని తెలిపారు. భవిష్య త్తులో కూడా ఎలాంటి ఘర్షణ లు లేకుండా ప్రజలంతా ఐక్యంగా జీవించాలని ఆకాంక్షిం చారు.

జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లా డుతూ త్యాగం మరియు సేవా మార్గాన్ని గుర్తు చేసే పండుగ బక్రీద్ అని అన్నారు. ముస్లింలకు ఆయ న బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియ జేశారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ జిల్లా ప్ర జలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్. వై .అశో క్ రెడ్డి ,ఏఎస్పి రమేష్, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, గ్రంథాలయ చైర్మన్ హఫీజ్ ఖాన్, కార్పొరేషన్ కమిష నర్ శరత్చంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి ,స్థానిక కార్పొ రేటర్ మామిడి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.