Monsoon Enters Andhra Pradesh: ఏపీలోకి నైరుతి రుతుపవనాల ఎంట్రీ

Monsoon Enters Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. దీంతో ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం లభించనుండగా, రైతాంగంలో కొత్త ఆశలు చిగురించాయి. వాతావరణ శాఖ (Weather Department) తాజా సమాచారం ప్రకారం జూన్ 4న కేరళను తాకిన రుతుపవనాలు వేగంగా ముందుకు కదులుతూ శనివారం ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోకి చేరుకున్నాయి. రాబోయే రోజుల్లో దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమ ప్రాంతమంతటా రుతుపవనాలు మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇందుకు అనుకూల వాతావరణ...