Praja Deveena
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 3:19 am Posted by : praja deveena

Sahara desert tragedy : బిగ్ బ్రేకింగ్, సహారాఎడారిలో నిశ్శబ్ద మృత్యువు, దాహార్తికి డిహైడ్రేషన్ తో 50 మంది ప్రయాణికుల బలి

Sahara desert tragedy :  ప్రజా దీవెన, సహారా ఎడారి: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఇసుక సముద్రం. అక్కడ అడుగు పెట్టడమంటేనే మృత్యువుతో జూదం ఆడ టమే. అలాంటిది, నైజర్ దేశంలోని సహారా ఎడారి మధ్యలో 50 మంది అమాయక ప్రాణాలు దాహార్తికి బలైపోయిన తీరని విషాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ దుర్ఘటన కు సంబంధించి పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. ఒక లారీ, కొందరు ప్రయాణికులు, గమ్యం చేరాలనే ఆశ కానీ, విధి ఆ డిన వింత నాటకంలో ఆ లారీ కాస్తా ఎడారి నడిబొడ్డున మొరాయించింది. చుట్టూ కిలోమీటర్ల మేర ఇసుక తిన్నెలు తప్ప మనుషులూ లేరు, మంచినీటి చుక్కా లేదు.

   మూడు రోజుల నరకయాతన

లారీ ఆగిపోయిన మొదటి రోజు ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది. రెండో రోజుకు వెంట తెచ్చుకున్న నీళ్లన్నీ అ యిపోయాయి. ఇక మూడో రోజు…నిలువెల్లా దహించి వేసే ఎడారి ఎండ, 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత, గొంతు దాటి దిగ ని పచ్చి వెలగకాయలాంటి పరిస్థితి. “ఒక్క చుక్కనీరు… కేవలం ఒక్క చుక్క నీరు దొరికితే ప్రాణాలు నిలుస్తాయని ఆ శగా ఎదురుచూసిన కళ్లు ఆ ఇసుకలోనే శాశ్వతంగా మూతపడ్డాయి.

దాహం తట్టుకోలేక, శరీరం డీహైడ్రేషన్‌కు గురై ఒకరి తర్వాత ఒకరుగా మొత్తం 50 మంది ప్రయాణికులు అక్కడికక్కడే నరకయాతన అనుభవిస్తూ కన్నుమూశారు. నైజర్ చరిత్ర లోనే ఇదొక అత్యంత ఘోర మైన ఎడారి విపత్తుగా నిలిచిపో నుంది.గమ్యం చేరని ప్రయాణం బ్రతుకుదెరువు కోసమో, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలనో లారీ ఎక్కిన ఆ వలస జీవులకు, తాము ప్ర యాణిస్తున్న వాహనమే చివరకు ఒక కదిలే శ్మశానంగా మారుతుందని ఊహించి ఉండరు.

ఈ ఘటన ఎడారి మార్గాల్లో ప్రయాణించేటప్పుడు ఉండా ల్సిన భద్రతా లోపాలను, రవాణా వ్యవస్థల వైఫల్యాలను మరోసారి ఎత్తిచూపుతోంది. ప్రకృతి విసిరిన వేడి గాలుల ముందు, దాహం అనే చిన్న అవసరం ముందు మనిషి ప్రా ణం ఎంత విగతజీవిగా మారిపోతుందో చెప్పడానికి ఈ స హారా విషాదమే ఒక నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది.