Praja Deveena
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 3:14 pm Posted by : prajadeveena.com

Telangana DGP Launches Stree Rides Project : మహిళల సాధికారతకు ‘స్త్రీ రైడ్స్’ ప్రారంభం

Telangana DGP Launches Stree Rides Project : హైదరాబాద్‌లో మహిళల భద్రతతో పాటు వారి ఆర్థిక స్వా వలంబనను ప్రోత్సహించే దిశగా తెలంగాణ పోలీస్ శాఖ కీ లక అడుగు వేసింది. రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ శనివారం ‘స్త్రీ రైడ్స్’(Stree Rides)ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ కా ర్యక్రమం ద్వారా మహిళల(Womens)ను రవాణా రంగం లోకి తీసుకువచ్చి వారికి కొత్త ఉపాధి అవకాశాలు కల్పించ డమే ప్రధాన ఉద్దేశంగా అధికారులు తెలిపారు.

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళ సాధికార తను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు ను అమలు చేస్తున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV An anad) పేర్కొన్నారు. మహిళలు స్వయంగా వాహనాలు న డపడంతో పాటు ఇతర మహిళలకు సురక్షిత రవాణా సేవ లు అందించేలా వారిని తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.

Also Read:ACB surprise rides in Miryalaguda : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ వక్ఫ్ బోర్డ్ కార్యాలయంపై ఏసీబీ మెరుపు దాడి, చిక్కిన ‘పెద్దతిమింగలం’

తొలి విడతలో ఎంపికైన 55 మంది మహిళలకు అంబర్‌పేట్ పోలీస్ లైన్స్‌లో ప్రత్యేక డ్రైవింగ్ శిక్షణ  అందిస్తున్నారు. ఉ మెన్ సేఫ్టీ వింగ్ (Women Saftey Wing) ఆధ్వర్యంలో ని ర్వహిస్తున్న ఈశిక్షణలో రెండు చక్రాల, మూడు చక్రాల వా హనాల నిర్వహణపై ప్రాయోగిక అవగాహన కల్పిస్తున్నా రు. రవాణా రంగంలో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులు, వేధింపులను తగ్గించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషి స్తుందని అధికారులు భావిస్తున్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలు భవిష్యత్తులో సురక్షిత రవాణా సేవలు అంది స్తూ ఇతర మహిళలకు కూడా భరోసా కల్పించే అవకాశం ఉందని పేర్కొన్నారు.