Tamil Nadu CM Vijay Honors Chess Star: ప్రజ్ఞానంద విజయానికి రాష్ట్ర సత్కారం.. రూ.50 లక్షల బహుమతి అందజేసిన సీఎం విజయ్

Tamil Nadu CM Vijay Honors Chess Star: భారత చెస్ ప్రపంచంలో మరో చరిత్రను సృష్టించిన యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద(Praggnanandhaa)కు తమిళనాడు ప్రభుత్వం ఘన సత్కారం నిర్వహించింది. నార్వే చెస్(Norway Chess) టోర్నీలో అద్భుత విజయం సాధించి దేశ ప్రతిష్ఠను అంతర్జాతీయ వేదికపై మరింత పెంచిన ఆయనను ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ (CM Vijay) ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా తమిళనాడు క్రీడాభివృద్ధి ప్రాధికార సంస్థ తరఫున ప్రజ్ఞానందకు రూ.50 లక్షల నగదు బహుమతి అందజేశారు. అలాగే జ్ఞాపికను బహూకరించి...