Praja Deveena
Newspaper Banner
Date of Publish : 08 June 2026, 2:36 pm Posted by : praja deveena

Vizag SteelPlant Trogedy : బిగ్ బ్రేకింగ్, విశాఖ ఉక్కు గర్భం లో సెగలు, ల్యాడల్ పేలి తొమ్మిది మంది కార్మికులు సజీవ దహనం

Vizag SteelPlant Trogedy : ప్రజా దీవెన, విశాఖపట్నం: ఆ సమయానికి స్టీల్‌ మెల్టింగ్‌ స్టేషన్‌-2 (S MS-2) ఎప్పటి లాగే పనులతో రొదగాఉంది. నిప్పులు చెరిగే కొలిమిల మ ధ్య కార్మికులు తమ విధుల్లో నిమగ్నమైఉన్నారు. ద్రవరూ పంలో ఉన్న ఉక్కును (లిక్విడ్ స్టీల్) బీమ్స్‌గా మార్చే విభా గంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

దాదాపు 150 టన్నుల మరుగుతున్న ద్రవ ఉక్కుతో ఉన్న భారీ ల్యాడల్ నె మ్మదిగా కదులుతోంది. మరికొద్ది నిమిషా ల్లో ఆద్రవం అచ్చు లుగా మారాల్సింది. కానీ, కాలం మరోలా రాసిపెట్టింది. ఒక్క సారిగా ఊహిం చని విపత్తు సం భవిం చింది. తీవ్ర మైన ఒత్తి డితో కూడిన భారీ శబ్దంతో ల్యాడల్ ఒక్కసారిగా పేలిపోయింది (లాడల్‌ బ్లాస్ట్). మరుగుతున్న హాట్‌మెటల్‌ బకెట్లు కుప్ప కూలడంతో, వెయ్యి డిగ్రీలకు పై గా ఉష్ణోగ్రతతో ఉన్న ఎర్రటి ద్రవ ఉక్కు కార్మికులపై లావా ప్రవాహంలా విరుచుకుపడింది.

అసలేం జరుగుతుందో తెలుసుకునేలోపే ఆ ప్రాంతమంతా నరకప్రాయంగా మారింది. ఈ ఘోర ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ప్రమాద తీవ్రత ఎం త దారుణంగా ఉందంటే, ఇప్పటివరకు కేవలం నలుగురి మృతదేహాలను మాత్రమే గుర్తించగలిగా రు. మిగిలిన వారి శరీరాలు ఆవేడికి గుర్తుపట్టలేనంతగా మారిపోవడంతో ప్లాంట్ లోపల హృదయవిదారక దృశ్యా లు కనిపిస్తున్నాయి.

 

ప్రమాదం జరిగిన వెంటనే అలర్ట్ అయిన ఫైర్ సిబ్బంది భా రీగా ఎగసి పడుతున్న మంటలను అదుపు చేయడానికి శ్ర మిస్తున్నారు. దట్టమైన పొగ, సెగలు కక్కుతున్న వేడి కార ణంగా సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగు తోం ది. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి ని సమీక్షిస్తున్నారు.

 

అసలు ఈ 150 టన్నుల లిక్విడ్ స్టీ ల్ ల్యాడల్ ఎందుకు బ్లాస్ట్ అయింది? సాంకేతిక లోపమా లేక నిర్వహణ లోప మా? అనే కోణంలో ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారం భిం చారు. ఈ ప్రమాదం ఉక్కునగరాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తమ తోటి కార్మికులు కళ్లముందే బూడిదైపోవడం తో ప్లాంట్‌లో విషాదఛాయలు అలముకున్నాయి.