Praja Deveena
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 5:19 pm Posted by : praja deveena

Mla Komatireddy rajgopalreddy : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలకవ్యాఖ్య, మునుగోడు ఓటుకు బ్రాండ్ వాల్యూ, ఆఒక్కఓటే వజ్రాయుధం

 

Mla Komatireddy rajgopalreddy : ప్రజా దీవెన, మును గోడు : మునుగోడులో ఓటుకు డిమాండ్ పెరిగింది.. ఇక్కడ ఓటు ఉండటమే ఒక ప్రత్యేక బ్రాండ్!” అంటూ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యా ఖ్యలు చేశారు. సామాన్యుడి చేతి లో ఓటు అనేది ఒక వజ్రా యుధమని, ని యోజకవర్గ అభివృద్ధి జరగాలంటే అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు ఉం డాలని ఆయన స్పష్టం చేశా రు.ఈ నెల 25 నుంచి తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభం కాను న్న ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ పై మును గోడు క్యాంపు కార్యాలయంలో బూత్ లెవెల్ ఏజెంట్స్ (BL As) శిక్షణ కార్యక్రమం నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై దిశాని ర్దేశం చేశారు.

 

ఓటర్ల సవరణ ప్రక్రియలో ఎవరూ కూడా అజాగ్రత్తగా ఉండొ ద్దని, క్షేత్ర స్థాయిలో బిఎల్ఏలు అత్యంత సీ రియస్‌గా పని చేయాలని అప్పీల్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓ టును కాపాడాలని, ఇతర ప్రాంతా ల్లో ఓటు ఉన్నా మునుగోడులో నే ఉంచుకునేలా ఇక్కడి ఓటుకు ప్ర త్యేక క్రేజ్ క్రియేట్ అ యిందని, దా న్ని నిలబెట్టాలని పిలుపునిచ్చారు. మంచి నా యకుడిని ఎన్నుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, అందుకు ఓటే కీలకమని గుర్తుచేశారు.

ఈ శిక్షణలో పీసీసీ నియమించిన మాస్టర్ ట్రైనర్ నుమాన్ పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బిఎల్ ఏలకు అవగా హన కల్పించారు. కొ త్త ఓటర్ల నమోదు ఎలా చేయాలి,
మ్యాపింగ్, అన్-మ్యాపింగ్ ఓటర్ల విషయంలో తీసుకోవాల్సి న జాగ్రత్తలు ఏంటి,ఓట్లు తొలగించకుండా ఎలాంటి చర్య లు తీసుకోవాలి? అ నే అంశాలపై బిఎల్ఏలకు ఉన్న అ న్ని సందేహాలను ఆయన నివృత్తి చేశారు.

   91 వేల ఓట్లపై స్పెషల్ ఫోకస్

నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్న కైలాస్ నేత అధ్యక్షతన జ రిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ కోఆర్డినేటర్ రుద్ర సంతోష్ కీలక గణాంకాలను వెల్లడించారు. మునుగోడు నియో జక వర్గవ్యాప్తంగా అన్-మ్యాపింగ్ ఓట్లతో కలిపి,మార్పులు-చేర్పులు, తప్పులు ఉన్న ఓటర్ల సంఖ్య దా దాపు 91 వేల వరకు ఉందని తెలిపారు. ఈ వ్యవహారాన్ని బిఎల్ఏ లు స వాల్‌గా తీసుకోవాలని, ఒక్క అర్హుడి ఓటు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా పకడ్బందీగా వ్యవహరించాలని కోరా రు.ఈ హై -లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో ము నుగోడు నియోజకవర్గ వ్యా ప్తంగా ఉన్న బిఎల్ఏలతో పాటు మున్సి పల్ చైర్మన్లు, మాజీ జెడ్పీ టీసీలు, మాజీ ఎంపీపీలు మరి యు ముఖ్య నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.