Praja Deveena
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 10:32 am Posted by : praja deveena

Surprise ACB Rides : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ సీక్రెట్ ఆపరేషన్ ల్యాండ్స్ డీడీ ఇంట్లో నోట్ల కుండపోత, సబ్జాలపై నుంచి నోట్లకట్టలు

Surprise ACB Rides : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలు గు సినిమా స్టైల్లో బెడ్‌రూమ్ బెడ్ కింద చూస్తే నోట్ల కట్టలు.. పైన సజ్జల మీద సంచులు తెరిస్తే గుట్టలకొద్దీ క్యాష్.. బీరు వా తెరిస్తే కళ్లు బైర్లు గమ్మేలా కిలోల కొద్దీ బంగారం, వెండి ఇ దీ మంగళవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ లో జరిగిన ఒక భారీ ఏసీబీ రైడ్‌లోని అసలు సీన్. తెలంగాణలో మరో అవినీతి తిమింగలం ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి (సరహరి) అవినీతి నిరోధక శాఖ (ACB) వలకు చి క్కాడు.

ఇటీవలే ఆర్ అండ్ బి ఈఎన్సీ మోహన్‌నాయక్‌ను పట్టుకు న్న వేడి తగ్గకముందే, ఏసీబీ అధికారులు మరో భారీ వేట ముగించారు. తెల్లవారుజామునే ఎంట్రీ ఇవ్వడం ద్వారా న రహరి అక్రమ సంపాదనపై గత కొంతకాలంగా ఏసీబీకి ఫి ర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో గుట్టు చప్పుడు కా కుండా ఆధారాలు సేక రించిన అధికారులు, ఇవాళ తెల్ల వా రుజామునే ఏకకాలంలో 11 ప్రాంతాల్లో విరుచుకుపడ్డారు. ఏసీ బీ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలోని ప్ర త్యేక బృందాలు పా తబస్తీ ఛత్రినా కలోని నరహరి ఇల్లు, నారా యణ గూడలోని సర్వే భవన్, క మిషనర్ ఆఫీసులతో పాటు ఆయన బంధు వులు, సన్నిహితుల ఇళ్ల తలుపులు తట్టారు.

  సోదాల్లో తేలిన షాకింగ్ నిజాలు

సోదాలు చేయడానికి వెళ్లిన అధి కారులకే మైండ్ బ్లాక్ అ య్యేలా అక్కడ దృశ్యాలు కనిపించాయి. ఇప్పటివరకు జ రి పిన తనిఖీల్లో దా దాపు రూ. 200 కోట్ల అక్రమాస్తులు ఉ న్నట్లు ప్రాథమిక సమాచా రం. బెడ్‌రూమ్‌లో మంచం కింద ఏ కంగా రూ. 1.10 కోట్ల విలువైన కరెక్ట్ నోట్ల కట్టలు దొరిక డం గమనార్హం కాగా గదిలో పైన ఉండే సజ్జలపై (Loft) సం చుల్లో దాచి ఉంచిన నోట్ల కట్టలను చూసి అధికారులు నోరె ళ్లబెట్టారు. బీరువాల్లో గుట్టలుగా పడి ఉన్న కిలోల కొద్దీ బం గారు, వెండి ఆభరణాలను సీజ్ చేశారు.

       ఖాళీ బాండ్లు, చెక్కులు

ఛత్రినాక నివాసంలో సంతకాలు చే సిన ఖాళీ బాండ్ పేప ర్లు, చెక్కులు, కీలకమైన భూమి పత్రాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు బయటపడ్డాయి. అవినీతి రారాజులా బతికిన అధికారి ఇంట్లో దొరికిన సొత్తు చూస్తే.. సామాన్యుడి గుండె గుభేల్ అ నాల్సిందే. ఇదంతా కేవలం ఒక్క రోజులో తేలింది మాత్రమే.. తవ్వే కొద్దీ ఇంకా ఎంత బయటపడుతుందో ఏసీ బీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతానికి ఇంకా సోదాలు కొన సాగుతూనే ఉండగా ఈ అవినీతి తిమింగలానికి సంబంధిం చిన పూర్తి వివరాలు, అధికారిక లెక్కలు ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించనున్నారు.