Praja Deveena
Newspaper Banner
Date of Publish : 18 June 2026, 2:18 pm Posted by : praja deveena

Nalgonda district collecter chandhrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలకపిలుపు, పచ్చని భవిష్యత్తు వైపు నల్లగొండను నడిపిద్దాం

 

Nalgonda district collecter chandhrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: భవి ష్యత్ తరాలకు స్వచ్ఛమైన గా లిని, పచ్చని పర్యావరణాన్ని అందించడమే లక్ష్యంగా నల్గొం డ జిల్లా మరో బృహత్తర కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్త ‘వనమహోత్సవం’ కార్యక్రమంలో భాగంగా గు రువారం జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ జూ నియర్ కళాశాల ఆవరణలో జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, మే యర్ బుర్రి చైతన్య శ్రీనివాస రెడ్డి మొక్కలు నాటి ఈ ఉత్స వాన్ని ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ మొక్క లు కేవలం అందం కోసం కాదని, అవి మానవ మను గడకే మూల మని స్పష్టం చేశారు. జిల్లాను హరితవనంగా మార్చేందుకు స్పష్ట మైన కార్యాచరణను ప్రకటించారు. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 57 లక్షల 70 వేల మొక్కలు నాటడ మే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 1.65 లక్షల మొక్కలు నాటేలా ప్రణాళిక లు సిద్ధం చేయాలని ఆదేశించారు.ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణ లో కనీసం ఆరు మొక్కలు నా టాలని, రోడ్ల పక్కన, పార్కుల్లోనే కా కుండా నల్గొండ కార్పొ రేషన్ పరిధి లోని ఖాళీ ప్లాట్లను గుర్తించి అక్క డ పెద్ద ఎత్తు న పచ్చదనాన్ని పెం పొందించాలని సూచించారు.

    లతీఫ్ సాబ్ గుట్టకు హరిత శోభ

చారిత్రాత్మక లతీఫ్ సాబ్ గుట్టపై స్థానిక వాతావరణానికి తగ్గట్టు ఎ లాంటి మొక్కలు నాటాలనే దానిపై డి.ఎఫ్.ఓ (DFO) ప్రత్యేక కార్యాచ రణ రూపొందిస్తున్నారు. ఈ హరి త యజ్ఞంలో మహిళలు భాగస్వా ములు కావాలని, గత ఏడాది 90 శాతం లక్ష్యాన్ని సాధించామని, ఈ సారి అందరి సహకారంతో 100 శా తం విజయం సాధిస్తామని కలెక్టర్ ధీమా వ్యక్తం చేశారు.ప్రభుత్వ సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ తమ సొంత బాధ్యతగా భావించి ముందుకు తీసుకెళ్లినప్పు డే నల్గొండకు పచ్చని భవిష్యత్తు సాధ్యమవుతుందన్నారు.

   పర్యావరణాన్ని కాపాడుకుందాం

నల్లగొండ మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస రెడ్డి మా ట్లాడుతూ ప్రపంచవ్యాప్త పర్యావరణ సమతుల్యత కోసం దాదాపు 5000 కోట్ల మొక్కల ఆవశ్యకత ఉందని గుర్తు చే శారు. కాంక్రీట్ నిర్మాణాల వల్ల పచ్చదనం తగ్గిపోతోందని, దీనివల్ల నీరు, ఆహారం, గాలి కలుషిత మ వుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రతి ఒక్కరూ కేవలం మొక్కలు నా టడమే కాకుండా, వాటి ని సంరక్షించి, పెంచి పోషించే బాధ్యత తీసు కోవాలి. నగరం లో పరిశుభ్రతతో పాటు పచ్చదనాన్ని సమానంగా పెంపొం దించాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మే యర్ ఆమీర్ అలీ, డీఎఫ్‌ఓ రాజశేఖర్ మాట్లాడారు. పర్యా వరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరి భాగస్వా మ్యం అవసరమని నొక్కిచెప్పారు. ఈ అద్భుతమైన హరిత సంకల్పం లో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, జె .సి. శ్రీనివాస్, కార్పొరేషన్ కమి షనర్ శరత్ చంద్ర, డి.ఐ.ఇ. ఓ. ద శ్రు నాయక్ తదితర ఉన్నతాధికారులు పాల్గొని మొ క్కలు నాటారు.