Praja Deveena
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 1:40 pm Posted by : praja deveena

Lucknow fire accident: బిగ్ బ్రేకింగ్, లక్నోలో భారీ అగ్నిప్ర మాదo, విషాద ఘటనలో 11మం ది విద్యార్థులు మృత్యువాత

Lucknow fire accident: ప్రజా దీవెన, లక్నో: సాధారణ రో జులాగే మొదలైన ఆ ఉదయం.. కాసేపట్లోనే ఒక పెను విషాదానికి వేదికవుతుందని అక్కడున్న వారె వ్వరూ ఊహించలేదు. లక్నోలోని పూర్నియా ప్రాంతంలో ఉన్న ఒక కో చింగ్ సెంటర్‌లో ఒక్కసారిగా చెలరే గిన మంటలు, విద్యార్థుల బంగా రు భవిష్యత్తును బుగ్గిపాలు చేశా యి.క్షణాల వ్యవధిలోనే రెండు అం తస్తుల భవనాన్ని చుట్టేసిన మంట లు, అక్కడ చదువుకుంటున్న వి ద్యార్థులకు నరకాన్ని చూపించా యి.


మృత్యుకుహరంగా భవనo

ప్రమాదం జరిగిన సమయంలో భ వనంలో 30 మందికి పైగా విద్యా ర్థులు ఉన్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో, ప్రాణభయంతో అల్లాడిపోయిన విద్యార్థులకు ఏం చేయాలో పాలుపోలేదు. దట్టమైన పొగ, సెగలు కమ్ముకోవడంతో ఊ పిరాడక కొందరు.. ప్రాణాలు దక్కిం చుకోవడానికి వేరే దారి లేక భవ నం పైనుంచి కిందకు దూకేశారు. కాగా ప్రస్తుతానికి మృదుల సంఖ్య 11 గా అధికారులు నిర్ధారించారు.
ఈ దుర్ఘటనలో తీవ్ర గాయాల పా లైన పలువురు విద్యార్థులు ఆసు పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రమాద తీవ్రతకు రెండు అంతస్తు ల భవనం పూర్తిగాకాలి బూడిదైం ది. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇం కా పెరిగే అవకాశం ఉందని అధి కారులు భావిస్తున్నారు.

ఈ ప్రమాదం కేవలం ఒక ‘యాక్సి డెంట్’ మాత్రమేనా? లేక భద్రతా ప్రమాణాలను విస్మరించడం వల్ల జరిగిన ముమ్మాటికీ ‘మానవ తప్పి దమా’? ఇలాంటి ఇరుకైన భవనా ల్లో నడుస్తున్న కోచింగ్ సెంటర్లలో సరైన ఎమర్జెన్సీ ఎగ్జిట్ (అత్యవ సర ద్వారాలు) ఎందుకు ఉండటం లేదు, ఫైర్ సేఫ్టీ నిబంధనలను తని ఖీ చేయాల్సిన అధికారులు ఎం దుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు?
ఈ ఘోర కలికి బాధ్యులెవరు అనే ది విచారణలో తేలాల్సి ఉంది. కా నీ, ఇలాంటి ఘటనలు పునరావృ తం కాకుండా ఉండాలంటే.. ఇప్ప టికైనా విద్యాసంస్థల్లో భద్రతా ప్ర మాణాలపై కఠినమైన నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఎం తైనా ఉంది. లేదంటే, రేపటి తరం భవిష్యత్తు ఇలాంటి మంటల్లో కా లిపోతూనే ఉంటుందన్న వాదన వినిపిస్తోంది.