Praja Deveena
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 5:13 am Posted by : praja deveena

Two Boys Die After Falling Into a Well : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ ఖాజీరామారంలో తీవ్ర విషాదం, బావిలోపడి ఇద్దరుబాలుర మృత్యువాత

 

Two Boys Die After Falling Into a Well : ప్రజా దీవె న, నల్లగొండ క్రైమ్ : న ల్లగొండ జిల్లాలో గుండెల్ని పిండేసే దారుణ ఘటన వెలుగుచూసింది. ఖాజీరామారం గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు బావిలో పడి ప్రాణాలు కోల్పోవ డం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. విధి వం చించిన వేళ బోల్గూరి లక్కీ (10), బొంగరాల మనీ భార్గవ్ (14) లు
ఆడుకుంటూ వెళ్లి శవాలై తేలడం తో ఖాజీరామారం గ్రామం ఒక్కసా రిగా దిగ్భ్రాంతికి లోనైంది. ఊరంతా విషాద ఛా యలు అలుముకున్నాయి.

 


అయితే చిన్నారుల మృతిపై ప్రస్తు తం పలు అనుమానాలు వ్యక్తమ వుతున్నా యి. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ను ముమ్మరం చేశారు. పోలీసుల ముందున్న ప్రధాన ప్రశ్న లు ఏమిటంటే ఆ ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు బావి లో పడిపోయారా?ఎవరైనా కావా లనే వారిని బావిలోకి నె ట్టేసి చంపేశారా, లేక మరేదైనా బలమైన కారణంతో వాళ్లే స్వయంగా బావిలోకి దూకేశారా అనే కోణాల్లో పోలీసులు వి చారణ జరుపుతున్నారు.

ప్రస్తుతం చిన్నారుల మృతదేహాల ను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అసలు ఏం జరిగిందనే కోణంలో పోలీసు లు క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేక రిస్తు న్నారు.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.