Praja Deveena
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 9:11 am Posted by : praja deveena

Ahmedabad Bomb Blasts : బిగ్ బ్రేకింగ్, అహ్మదాబాద్‌ పేలుళ్ల కేసులో సంచలన తుదితీర్పు,38 మందికి మరణదండన సరైనదే

Ahmedabad Bomb Blasts : ప్రజా దీవెన, అహ్మదాబాద్: 200 8లో అహ్మదాబాద్‌ నగరాన్ని వణి కించిన ఆ వరుస బాంబు పేలుళ్ల ర క్తాక్షరాల గాయం… నేటితో పూర్తి గా మానిపోయింది. దేశ న్యాయ చరిత్రలోనే అత్యంత అరుదైన, సంచలన తీర్పును గుజరాత్‌ హై కోర్టు వెలువరించింది. కింది కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును సమ ర్థిస్తూ… ముష్కరుల గుండెల్లో రై ళ్లు పరిగెత్తించేలా తుది తీర్పును ఖరారు చేసింది.ఉగ్రవాదానికి వ్య తిరేకంగా భారతదేశం పంపిన బల మైన సంకేతం ఇది. ఈ కేసులోని నిందితుల భవితవ్యాన్ని తేలుస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు వివరాలు ఇ లా ఉన్నాయి.38 మందికి ఉరిశిక్ష (మరణదండన) విధిస్తూకింది కోర్టు నిర్ణయాన్ని హైకోర్టు పూర్తిగా సమ ర్థించింది. మిగిలిన 11 మంది మిగి లిన జీవిత కాలం మొత్తం జైలు లోనే గడపాల్సి ఉంటుంది.

ఆ రాత్రి విధ్వంసం… నేటితో ముగిసిన న్యాయపోరాటం

70 నిమిషాల వ్యవధిలో 21 బాం బు పేలుళ్లు… రక్తసిక్తమైన అహ్మ దాబాద్‌ వీధులు, వందలాది కు టుంబాల్లో తీరని శోకం. ఆ నాడు ఉగ్రవాదులు విత్తిన హింసకు, కా లం నేడు న్యాయం రూపంలో బ దులిచ్చింది.విచారణాధికారుల ప క్కా ఆధారాలు, కింది కోర్టు లోతైన పరిశీలనను హైకోర్టు కూడా ఏకీభ వించింది. ఉగ్రమూలాలను సమూ లంగా తుడిచేయడంలో ఈ తీర్పు ఒక మైలురాయిగా నిలిచిపోనుం ది. బాధితుల కుటుంబాలకు ఇ న్నాళ్లకు పూర్తిస్థాయిలో ఊరట లభించినట్లయింది.”ఇలాంటి ఘా తుకాలకు పాల్పడే వారికి సమా జంలో క్షమాభిక్ష లేదు. అమాయ కుల ప్రాణాలను బలిగొన్న వారికి చట్టం ఇచ్చే అత్యున్నత శిక్షే సరైన న్యాయం అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది.