Praja Deveena
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 6:33 pm Posted by : praja deveena

Vijayawada Guinness World Record : బిగ్ బ్రేకింగ్, విజయవాడకు ‘సంగీత’ కిరీటం, గిన్నీస్ రికార్డుల్లో నిలిచిన ‘వాహ్ తాజ్’ వర్షపురాగం

Vijayawada Guinness World Record : ప్రజా దీవెన, విజయవాడ: కనక దుర్గమ్మ కొలువైన బెజవాడ నగరం ఇ ప్పుడు ఓ అద్భుతమైన గిన్నీ స్ రికార్డ్‌తో ప్రపంచ పటంలో సరికొ త్తగా మెరిసిపోతోంది. సాధారణం గా హోర్డింగులు (ప్ర కటనల బోర్డు లు) కేవలం కనిపిస్తాయి… కానీ వి జయవాడ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న ఈబోర్డు మాత్రం కనిపించడం తో పాటు అద్భుతంగా విని పి స్తుంది. నమ్మశక్యం కావడం లేదా? కానీ ఇది నిజం! ప్రముఖ ‘వాహ్ తాజ్’ టీ బ్రాండ్ ఏ ర్పాటు చేసిన ఒ క వినూత్న ప్రకటన బోర్డు ఇప్పుడు ప్రపం చ రికార్డులను తిరగరాసింది.

  వర్షం కురిస్తే… రాగం వినిపిస్తుంది

ఈ హోర్డింగ్ వెనుక ఒక తిరుగులేని సైన్స్ అండ్ మ్యూజిక్ మ్యాజిక్ ఉంది. ఈ భారీ బోర్డు మీద సాంప్రదాయ భారతీ య సంగీత వాయిద్యాలను అమర్చారు. ఆకాశం నుంచి వ ర్షపు చుక్కలు ఈ బోర్డుపై పడగానే… అక్కడ అమర్చిన ప్ర త్యేక సాంకేతిక వ్యవస్థ (స్పెషల్ అ రేంజ్మెంట్) యాక్టివేట్ అ వుతుంది.

   ప్రకృతి, సాంకేతికత, సంగీతం.

వాన చుక్కల తాకిడికి ఆ వాయి ద్యాలు వాటంతట అవే స్పందిస్తూ, వర్షాన్ని ఆహ్వానించే ప్రసిద్ధ మేఘ మల్హర్ రాగా న్ని శ్రావ్యంగా పలికిస్తాయి. ఈ మూడింటి కలయికతో రూ పొందిన ఈ బోర్డు, ప్ర పంచంలోనే అత్యంత వినూత్నమై న “ఇంటరాక్టివ్ సౌండ్ ఇన్‌స్టాలేషన్” ప్రకటనగా గుర్తింపు పొం దింది.

   గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్

ప్రకటనల రంగంలో ఇంతవరకు ఎ వరూ చేయని ఈ సరి కొ త్త ప్రయోగానికి, సృజనాత్మకతకు గాను ‘గిన్నీస్ బుక్ ఆఫ్ వ రల్డ్ రికార్డ్స్ లో చోటు లభించింది. ఇకపై బెజవాడలో వర్షం పడితే ట్రాఫిక్ చిరాకు లు కాదు… మధురమైన శాస్త్రీయ సం గీత అలలు రైల్వేస్టేషన్ పరిస రాలను ముంచెత్తుతాయి. టీ క ప్పు పట్టుకుని ఈ వర్షపు రాగాన్ని ఆస్వాదించడానికి బెజ వాడ వాసులు, ప్రయాణికులు ఎగబడుతున్నారు. వాహ్.. బెజవాడ..వాహ్ తాజ్ అంటూ కితాబులిస్తున్నారు.