Praja Deveena
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 4:38 pm Posted by : praja deveena

Nalgonda district CMR Deliveries : సీఎంఆర్ డెలివరీ వేగవంతం చేయాలి

 

Nalgonda district CMR Deliveries : ప్రజా దీవెన, నల్ల గొండ: రాష్ట్ర ప్ర భుత్వ ఆదేశాల మేరకు సీఎంఆర్ డెలివరీని వేగవంతం చేయాల ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డై రెక్టర్ జి వి శ్యాం ప్రసాద్ లాల్ పౌ రసరఫరాల అధికారులు ,రైస్ మిల్లర్లను ఆదేశిం చారు. అలాగే రా ష్ట్ర ప్రభుత్వం రూపొం దించిన ఖరీఫ్ 100 రోజుల ప్రణాళికను పకడ్బందీగా అమ లు చేయాలని చెప్పారు.

గురువారం అయన నల్గొండ రెవి న్యూ అదనపు కలెక్టర్ ఛాంబర్ లో ఉమ్మడి నల్గొండ జిల్లా రైస్ మిల్లర్లు, పౌరసరఫ రాల అధికా రులతో కష్టం మిల్లింగ్ రైస్ పై సమీక్ష నిర్వహిం చారు.ఎఫ్ సి ఐ రే క్ మూమెంట్, స్థలాలు, ఎఫ్ సిఐ పేమెం ట్స్ తదితర అంశాలపై ఆ యా జిల్లాల వారీగా సమీక్షించా రు.

రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఖరీఫ్ వంద రోజుల ప్రణా ళికపై సమీక్షిస్తూ 100 రోజుల కార్యాచ రణ ప్రణాళికను వేగ వంతం చేయాలని, ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడాలన్నా రు. రానున్న ఖ రీఫ్ కార్యాచరణ ప్రణాళిక కు పౌ రసరఫరా ధికారులతో పాటు, రై స్ మిల్లర్లు కూడా సిద్ధం కావాలన్నా రు. సి ఎం ఆర్ డెలివరీలో భాగంగా ప్రతిరోజు డిఎస్ఓ లు పౌరసరఫరాల డిఎంలు మిల్ల ల వారీగా పర్యవేక్షణ చేసి సీ ఎంఆర్ డెలివరీని పెంచేయాలన్నారు.

ప్రతి వారం మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటి కప్పుడు సమీక్షించాలని తెలి పా రు. మిల్లులు 24 గంటలు నడిచే లా పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసిల్దా రులు పర్యవేక్షించా లని ఆదేశించారు.రెవెన్యూ ఆదనపు కలెక్టర్ జే .శ్రీనివాస్, నల్గొండ పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాంపతి నాయక్, డిఎస్ఓ వెంక టేశ్వర్లు, యాదాద్రి భువన గిరి, సూర్యాపేట జిల్లాల డీఎస్ ఓ లు, పార సరఫరాల డీ ఎంలు, ఉ మ్మడి నల్లగొండ జిల్లా రైస్ మిల్లర్లు, సివిల్ సప్లై, ఎ న్ ఫాసిమెంట్ విభాగాల అధికారులు, తదితరులు ఈ స మావేశానికి హాజరయ్యారు.

 

నల్లగొండ జిల్లా ఆర్అండ్ బి ఎస్ఈగా పున్న మోహన్

నల్లగొండ: నల్లగొండ జిల్లా రోడ్లు, భవనాల శాఖ సూపరిం టీండెంట్ ఇంజనీర్ గా గురువారం పున్న మోహన్ బాధ్యత లు స్వీకరించా రు.అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ బి. చం ద్రశేఖర్ ను జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో మర్యాదపూర్వ కంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు.జిల్లా ఆర్ అండ్ బి ఎ స్ ఈ గా విధుల్లో చేరిన వున్న మోహన్ కు ఆర్ అండ్ బి శా ఖ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలియజేశారు.