Praja Deveena
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 3:12 am Posted by : praja deveena

Hydraa ranganath hot comments : బిగ్ బ్రేకింగ్, హైడ్రా రంగనాథ్ సంచలన వ్యాఖ్య, ల్యాండ్ మాఫియా కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నాయి

 

Hydraa ranganath hot comments : ప్రజా దీవెన, హై దరాబాద్: “రాజ్యాంగానికి కట్టుబడే నగరాన్ని కాపాడు తు న్నామని హైకోర్టు ఉ త్తర్వులపై కమిషనర్ ఏవీ రంగనాథ్ సంచలన ప్రకటన చేశారు.హైదరాబాద్ నగరాన్ని వరదల ముప్పు నుండి కాపాడి, ఆక్రమ ణదారులకు సింహస్వప్నం గా మారిన ‘హైడ్రా’పై దాఖలైన పిటి షన్లపై హైకోర్టు స్పందిం చిన నేప థ్యంలో, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ భవిష్యత్ ప్రణాళికలు, సాధించిన విజయాలపై కీలక వ్యాఖ్యలు చేశా రు.

రాజ్యాంగ స్ఫూర్తితో, ప్రజా ప్రయోజనాలే పరమావధిగా హై డ్రా పనిచేస్తోందని ఆయన స్పష్టం చే శారు. కమిషనర్ మా ట్లాడిన ము ఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. గడి చిన మూడే ళ్లలో రూ.1.50 లక్షల కోట్ల విలువైన విలువైన ప్రభుత్వ భూ ములను, చెరువుల ప్రాంగ ణాలను భూకబ్జాదారుల నుండి విడిపించి తిరిగి ప్రజల ఆస్తిగా మార్చామని వివరించారు. అత్యాధునిక ఎకో-టెక్నాలజీతో నగరంలో ఇప్పటికే 6 చారి త్రాత్మ క చెరువులను పూర్తిస్థాయిలో పునరుద్ధరించి, పర్యా టక కేంద్రాలుగా తీర్చిదిద్దాం. మరో 20 చెరువుల్లో పునరుద్ధ రణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.

  న్యాయస్థానాలను తప్పుదోవ

ల్యాండ్ మాఫియా తమ స్వార్థ ప్రయోజనాల కోసం తప్పు డు పత్రాలు, అవాస్తవ సమాచారంతో న్యాయస్థానాలను సైతం త ప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపిం చారు.మా ల క్ష్యం ఆక్రమణలను అడ్డుకోవడమే కాదు రా బోయే తరాలకు నీటి వనరులను, పచ్చని హైద రాబాద్‌ను భద్రంగా అందించడం. న్యాయవ్యవస్థపై మాకు పూర్తి నమ్మ కం ఉందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణలో నయా ట్రెండ్ సెట్ చేస్తున్న హై డ్రా, చట్టా నికి లోబడే భవిష్యత్ నగర నిర్మాణంలో ముందుకు సాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు.