Praja Deveena
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 1:54 pm Posted by : praja deveena

Leading Liquor Brands Banned : బిగ్ బ్రేకింగ్, మద్యం ప్రియులకు మింగుడుపడని వార్త, తనిఖీల్లో లీడింగ్ లిక్కర్ బ్రాండ్లపై నిషేధం 

Leading Liquor Brands Banned : ప్రజా దీవెన, హైద రాబాద్: మ ద్యం ప్రేమికులకు ఇది ఖచ్చితంగా మింగుడు పడని వార్తే అని చెప్పవచ్చు. మనం ఎంతో ఇష్టంగా తాగే ప్రముఖ బ్రాండ్ల కిక్కు వెనుక అసలు నిజాలు బయటప డ్డా యి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండ ర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (F SSAI) జరిపిన తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగు చూడటంతో లీడింగ్ లిక్కర్ బ్రాండ్లపై అధికారులు వేటు వే శారు.యునైటెడ్ స్పిరిట్స్ (డియాజియో గ్రూప్), ఇన్ బ్రూ బేవరేజెస్ వంటి దిగ్గజ సంస్థలు తయారుచేసే కొన్ని ప్ర ము ఖ విస్కీ, రమ్ బ్రాండ్ల విక్రయాలపై FSSAI నిషేధం విధిస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది.

నిషేధానికి గురైన ప్రముఖ బ్రాండ్లు ఇవే

యాంటిక్విటీ బ్లూ విస్కీ (యునై టెడ్ స్పిరిట్స్), రాయల్ ఛాలెంజ్ విస్కీ (యునైటెడ్ స్పిరిట్స్), బ్యా గ్ పైపర్ డీలక్స్ విస్కీ(ఇన్ బ్రూ బేవరేజెస్), ఓల్డ్ కాస్క్ డీలక్స్ X XX రమ్ (ఇన్ బ్రూ బేవరేజెస్) త దితర బ్రాండ్ లుపై తనిఖీల్లో తే లిన ‘చేదు’ నిజాలు సాధారణం గా విస్కీ, రమ్‌లకు నిర్దేశిత ము డిసరుకులు మరియు సుదీర్ఘ నిల్వ (Aging) ప్రక్రియ ద్వారానే సహజమైనరుచి, సువాసన రావాల్సి ఉంటుంది. కానీ, ఈ కంపెనీలు సత్వర లాభాల కోసం సహజ ప్రక్రియ ను పక్కనపెట్టి,

బయటి నుంచి కృత్రిమ ఫ్లేవర్లు (Artificial Flavours)

కలిపి విక్రయిస్తున్నట్లు FSSAI తనిఖీల్లో పట్టుబడింది. సహ జ మైన ప్రాసెస్ పేరుతో కృత్రిమ ఫ్లేవర్లు కలపడం వినియోగ దారులను నేరుగా తప్పుదారి పట్టించడ మేనని FSSAI అ ధికారులు వెల్లడిస్తున్నారు. కంపెనీలకు షాక్ ఇ చ్చినప్పటికీ, ఇప్పటికే మార్కెట్‌ లో ఉన్న స్టాక్ విషయంలో అధికారులు చిన్న సడలింపు ఇచ్చారు.

             సరికొత్త షరతు

బాటిళ్ల ముందు భాగంలో”కృత్రిమ ఫ్లేవర్లు ఉపయోగించాం” అని స్పష్టంగా కనిపించేలా సరికొత్త లేబుళ్లు అతికించాలి.ఆ తర్వాతే సదరు పాత స్టాక్‌ను విక్రయించడానికి అనుమతి నిచ్చారు. కాబట్టి, ఇకపై మీ ఫేవరెట్ బ్రాండ్ బాటిల్ ఎత్తే ముందు ఆలేబుల్‌ను ఒక్కసారి చెక్ చేసుకోవడం మంచిద ని హితవు పలుకుతున్నారు.